AP UPDATES

 
 

జ‌గ‌న్ ని ఫాలో అవుతున్న చంద్ర‌బాబు..!

Jagans-Generation-Next-Vs-Chandrababus-political-experience

ఆశ్చర్య‌మే అయినా అనుభ‌వ‌జ్ఞుడికి కూడా కొన్ని సార్లు యువ‌నేతల ఆలోచ‌న‌ను అందిపుచ్చుకోవాల్సిందే. ఎప్పుడొచ్చామ‌న్న‌ది కాద‌న్న‌య్యా అంటూ పోకిరి సినిమాలో మ‌హేష్ బాబు చెప్పిన డైలాగ్ మాదిరిగానే రాజ‌కీయాల్లో ఎప్పుడొచ్చినా ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొంద‌గ‌లిగిన ఎత్తులు వేస్తే చాలు..అదే అంద‌లం అందిస్తుంది. అందుకే ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ‌ను చంద్ర‌బాబు ఆచ‌రిస్తే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా టీడీపీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మం గ‌మ‌నిస్తే అదే విష‌యం అర్థ‌మ‌వుతుంది. వాస్త‌వానికి ఇంటింటికీ టీడీపీ లాంటి కార్య‌క్ర‌మాలు చాలాకాలంగా, దాదాపుగా అన్ని పార్టీలు చేస్తూనే ఉన్నాయి. అయితే అది అధికార పార్టీ క‌న్నా విప‌క్షాల‌కే మంచి అస్త్రం అవుతుంది. అందుకే జ‌గ‌న్ కూడా దానికి త‌గ్గ‌ట్టుగా అడుగులేశారు. చంద్ర‌బాబు పాల‌న మూడేళ్ల పాల‌న ముగుస్తున్న ద‌శ‌లో ప్ర‌జాభిప్రాయం తెలుసుకోవ‌డానికి, త‌న పార్టీని అంద‌రి ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్ల‌డానికి , పార్టీ నేత‌ల‌ను ప్ర‌జ‌ల్లోRead More


చెర్రీకి ఆ సినిమా లేన‌ట్టే!

ramcharan

ప్రస్తుతం భిన్నమైన సినిమాగా తెరకెక్కుతున్న రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్నాడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. ఇప్పటికే ఈ సినిమాలోని చరణ్ స్టిల్స్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 1985 నాటి కథ అంటూ సాగుతున్న ఈ సినిమాలో చరణ్ చెవిటివాడిగా నటిస్తున్నాడని, రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ మొదలుపెట్టనుంది. ఈ సినిమా తరువాత చరణ్ ఓ పాపులర్ దర్శకుడితో సినిమా చేస్తానని చెప్పాడు. దాంతో ఆ దర్శకుడు స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు అప్పుడే మొదలుపెట్టాడు. కానీ ఈ సినిమా చేయడానికి ఇప్పుడు చరణ్ ఆసక్తిగా లేడట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో మీకు ఈపాటికే అర్థం అయి ఉంటుంది కదా.. అవును మీరు అనుకున్న ఆ దర్శకుడే మణిరత్నం. చాలా రోజులపాటు చర్చలు జరిపి చరణ్‌ని ఒప్పించాడు మణిరత్నం. కథRead More


ఏపీలో కొత్త ప‌థ‌కం: చెట్ల కింద పాఠాలు

19657275_1938545723096024_1804251571997059624_n

అవును…ఆశ్చ‌ర్య‌మే అయినా చంద్ర‌బాబు మాత్రం అదే ఆలోచిస్తున్నారు. ఇక‌పై వారానికి ఒక‌రోజు చెట్టు కింద పాఠాల‌కు పిల్ల‌లు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే సోమ‌వారం కాస్తా పోల‌వ‌రం అని అంటున్నారు. ఇక శ‌నివారాన్ని కూడా చెట్లు వారం అని పిల‌వాలంటారో ఏంటో అని కొంద‌రు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. వ‌నం మ‌నం కార్య‌క్ర‌మం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఇలాంటి ప్ర‌క‌ట‌నే చేశారు. ఇక‌పై ప్ర‌తీ శ‌నివారం పిల్ల‌లంతా పాఠాలు చెట్లు కింద చ‌దుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపారు. ఇప్ప‌టికే అనేక చోట్ల స‌ర్కారీ బ‌డుల్లో సౌక‌ర్యాలు లేక చెట్లు, పుట్ట‌లు ఎక్క‌డ వీల‌యితే అక్క‌డే బ‌డులు న‌డుస్తున్నాయి. ఇక ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి స‌ర్వాత్రా తీసుకురావ‌డంలో భాగంగా అంద‌రూ చెట్లు కింద పాఠాలు నేర్చుకోవాల‌నే ఆలోచ‌న‌లో బాబు ఉన్న‌ట్టుగా తాజా ప్ర‌క‌ట‌న తేటతెల్లం చేస్తోంది. ప్ర‌తీ శ‌నివారం మ‌ధ్యాహ్నం పిల్ల‌లంతా చెట్లRead More


క్లాస్ పీకుతున్న బాబు, లోకేష్

chandrababu-naidu-nara-lokesh

తెలుగుదేశం పార్టీలో చంద్ర‌బాబు ప‌దే ప‌దే క్ర‌మ‌శిక్ష‌ణ గురించి మాట్లాడుతుంటారు. క్యాడ‌ర్ కి కిందిస్థాయి నుంచి అవ‌గాహ‌నా త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌డానికి దానిలో భాగ‌మే బాబు ప్రాధాన్య‌త‌నిస్తుంటారు. అయితే ఇటీవ‌ల పార్టీలో ప‌రిస్థితి అదుపుతప్పుతోంది. కిందిస్థాయి నుంచి కీల‌క నేత‌ల వ‌ర‌కూ ఎవ‌రూ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను పాటిస్తున్న‌ట్టు దాఖ‌లాలు లేవు. దాంతో బాబు మ‌రోసారి శిక్ష‌ణా త‌ర‌గ‌తుల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈసారి నారా లోకేష్ , బాబు క‌లిసి నేత‌ల‌కు క్లాస్ పీకే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఈ శిక్ష‌ణా త‌ర‌గ‌తులు సాధార‌ణ నేత‌ల‌కు మాత్ర‌మే కాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల‌కే ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇవ్వాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఏపీలోని నాలుగు చోట్ల శిబిరాలు ఏర్పాటు చేసి గ‌తంలోనే లోకేష్ సార‌ద్యంలో శిక్ష‌ణా త‌ర‌గ‌తులు నిర్వ‌హించారు. వాటి ద్వారా నేత‌ల్లో అవ‌గాహ‌న పెంచ‌డం, విప‌క్షానికి త‌గిన రీతిలో జ‌వాబులిచ్చేRead More


కేశినేని, దేవినేని మ‌ధ్య‌లో నంద‌మూరి!

tdp-bala

సీఎం వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ నిర్ణ‌యం మంత్రి దేవినేని ఉమాకు ఇబ్బందిక‌రంగా మారుతోంది. అనంత‌పురం మీద బాల‌య్య‌కు విర‌క్తి క‌ల‌గ‌డం కృష్ణా జిల్లాలో ఉన్న ఉమాకి క‌ల‌వ‌రం క‌లిగిస్తోంది. దాంతో టీడీపీ వ‌ర్గాల్లో బాల‌కృష్ణ ఆలోచ‌న చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. నారా లోకేష్ భ‌విష్య‌త్తు మీద కూడా ప్ర‌భావితం చేసేలా క‌నిపిస్తోంది. మామా, అల్లుళ్ల భ‌విష్య‌త్తుకి సంబంధించి పార్టీ అధినేత చంద్ర‌బాబు ఎలా స్పందిస్తార‌న్న దానిని బ‌ట్టి దేవినేని ఉమా భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని వ్య‌వ‌హారం కొంత‌కాలంగా టీడీపీకి త‌ల‌నొప్పిగా మారింది. చంద్ర‌బాబుతో పాటు చిన‌బాబు రంగంలో దిగినా ర‌వాణారంగం పేరుతో సాగుతున్న రాజకీయం చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. చివ‌ర‌కు ఎటుమ‌ళ్లుతుంద‌నే చ‌ర్చ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కేశినేనికి ఝ‌ల‌క్ ఇవ్వ‌డానికే అన్న‌ట్టుగా టీడీపీలో కొత్త ప్ర‌చారం మొద‌ల‌య్యింది.Read More


టీడీపీలో చానెళ్ల‌ రాజ‌కీయం

chandrababu

ఏపీ రాజ‌కీయాలు హ‌ఠాత్తుగా మీడియావైపు మ‌ళ్లాయి. న్యూస్ చానెళ్లను టీడీపీ బ‌హిష్క‌రించింద‌నే ప్ర‌చారం హాట్ టాపిక్ అయ్యింది. అధికార ప‌క్షంలో గంద‌ర‌గోళంగా మారింది. ఈ ప‌రిణామాల‌తో పార్టీ అప్ర‌మ‌త్త‌మ‌య్యింది. అలాంటిదేమీ లేద‌ని తేల్చిచెప్పింది. సోష‌ల్ మీడియాలో సాగుతున్న ప్ర‌చారం వెనుక కుట్ర ఉంద‌నే అనుమానం వ్య‌క్తం చేసింది. దాంతో ఇదిప్పుడు ఆస‌క్తిగా క‌నిపిస్తోంది. ఏపీలో గ‌డిచిన కొన్ని రోజులుగా సాగుతున్న ప‌రిణామాల‌తో కొన్ని న్యూస్ చానెళ్ల కార్య‌క్ర‌మాల‌ను బ‌హిష్క‌రించాలంటూ టీడీపీ ఇచ్చిన పిలుపు క‌ల‌క‌లం రేపుతోంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ప‌లువురు తీవ్రంగా విరుచుకుప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే పార్టీ కార్యాల‌య స‌మ‌న్వ‌య కార్య‌ద‌ర్శి టీడీ జనార్థ‌న్ ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ ప్ర‌చారంతో పార్టీకి సంబంధం లేద‌న్నారు. ‘‘48 గంటలపాటు టీవీ ఛానల్స్ కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బహిష్కరించాలంటూ సోషల్Read More


బెంగ పెట్టుకున్న బాబు..!

chandrababu

చంద్ర‌బాబు తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఏడాది క్రితం ఈ స‌మ‌యంలో 21 మంది ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపు చేర్చుకుని ఉత్సాహంగా క‌నిపించిన టీడీపీలో ఏడాది తిరిగేస‌రికి సీన్ రివ‌ర్స్ అయ్యింది. తీరా ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో అస‌లు వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డుతుంద‌నే భ‌యాందోళ‌న ఆయ‌న్ని వెంటాడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌జావ్య‌తిరేక‌త చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌డంతో ఆయ‌న అదుపు త‌ప్పుతున్నారు. సాధార‌ణ నేత‌లు నోటిదురుసు ప్ర‌ద‌ర్శిస్తే ఏదో అనుకోవ‌చ్చు గానీ ఏకంగా చంద్ర‌బాబే ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించే ప‌రిస్థితి రావ‌డం విస్మ‌యం క‌లిగిస్తోంది. నేను ఇచ్చిన పెన్ష‌న్లు తీసుకుంటూ నాకే ఓటెయ్య‌రా అంటూ ఆయ‌న నిల‌దీసిన ప‌రిస్థితి చూసి టీడీపీ నేత‌లే బిక్క‌మొఖం వేయాల్సి వ‌చ్చింది. నేను వేసిన రోడ్ల మీద న‌డుస్తున్నానంటూ కూడా బెదిరించిన ఆయ‌న మ‌రో అడుగు ముందుకేసి ఓటుకి ఐదు వేలు కూడా ఇవ్వ‌గ‌ల‌నని చెప్ప‌డం బ‌హిరంగంగానేRead More


టీడీపీలో బ్రాహ్మ‌ణ లొల్లి..!

iyr krishnrao

ఏపీలో చంద్ర‌బాబు స‌ర్కారుకి స‌మ‌స్య‌లు చుట్టుముడుతున్నాయి. ఇప్ప‌టికే అనేక‌వ‌ర్గాలు దూర‌మ‌వుతుండ‌గా తాజాగా బాబు వ్య‌వ‌హారంతో బ్రాహ్మ‌ణులు కూడా క‌ల‌త చెందే ప‌రిస్థితి వ‌చ్చేసింది. చంద్ర‌బాబు తీరుతో అసంతృప్తిగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు పై సీనియ‌ర్ అధికారి అనే గౌర‌వం కూడా లేకుండా అనూహ్యంగా వేటు వేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. బ్రాహ్మ‌ణ కార్పోరేష‌న్ నుంచి ఆయ‌న్ని తొల‌గించ‌డం వివాదంగా మారుతోంది. బ్రాహ్మ‌ణ వ‌ర్గాల్లో నిర‌స‌న‌ల‌కు దారితీస్తోంది. సోషల్ మీడియాలో కృష్ణారావు చేసిన పోస్టులను సాకుగా చూపిస్తూ ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించిన‌ట్టు చెబుతున్నారు. టీడీపీ నేతల ఫిర్యాదుతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చైర్మన్ కృష్ణారావును ఎలాంటి వివరణ అడగకుండానే ఆయనను పదవి నుంచి తొలగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐవైఆర్ స్థానంలో వేమూరి ఆనంద సూర్యను చైర్మన్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.Read More


బాబుకి భారంగా మారిన టీమ్

ap cabinet1

మూడు నెల‌ల‌య్యింది. టీమ్ 2019 అని చెప్పారు. క్యాబినెట్ విస్త‌ర‌ణ‌లో భాగంగా చంద్ర‌బాబు కొత్త వ్యూహంతో ముందుకెళుతున్నార‌నే ప్ర‌చారం చేశారు. కానీ ఇప్పుడు అదే వ్యూహం కొంప‌ముంచేలా క‌నిపిస్తోంది. పార్టీ ప‌రువు తీసేలా సాగుతోంది. ఇప్ప‌టికే నంద్యాల వ్య‌వ‌హారం ఓ ఉదాహ‌ర‌ణ‌గా క‌నిపిస్తోంది. భూమా కుటుంబం నుంచి అఖిల‌ప్రియ‌కు క్యాబినెట్ లో అవ‌కాశం ఇచ్చినా ప్ర‌యోజ‌నం లేద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. అమె అనుభ‌వం, వ్య‌వ‌హార ధోర‌ణి, స‌మ‌న్వ‌య లేమి క‌లిసి టీడీపీకి లాభం క‌న్నా న‌ష్టం ఎక్కువ తెస్తుంద‌నే పార్టీ నేత‌లే అభిప్రాయ‌ప‌డుతున్నారు. క‌ర్నూలు జిల్లాలో కీల‌క సామాజిక‌వ‌ర్గాన్ని మ‌చ్చిక చేసుకోవ‌చ్చ‌ని ఆశిస్తే, చివ‌ర‌కు నంద్యాల‌లో కూడా ఆమె ప్ర‌భావం స‌న్న‌గిల్లుతోంద‌ని చెబుతున్నారు. వ‌ర‌కు సొంత శాఖ‌లోనూ ప్ర‌భావం చూప‌లేక‌పోవ‌డంతో చాలామంది పెద‌వి విరుస్తున్నారు. కీల‌క టూరిజం శాఖ బాధ్య‌త‌లు అప్ప‌గించినా మూడు నెల‌ల్లో ఒక్క‌టి కూడాRead More


మల్టీస్టార‌ర్ మువీలో మ‌హేష్

mahesh

యంగ్ హీరోస్ సుధీర్ బాబు, నారా రోహిత్, ఆది, సందీప్ కిషన్ హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా శమంతకమణి. భలే మంచి రోజు ఫేం శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నలుగురు హీరోలకు సమానమైన మరో కీలక పాత్ర ఉందట.. ఆ పాత్ర పేరే మహేష్ బాబు. కీలకమైన క్యారెక్టర్ కోసం సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ను తీసుకున్నారు. తాజాగా రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ కు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ను గురువారం రిలీజ్ చేయనున్నారు. భవ్యక్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.