Main Menu

ap politics

 
 

చంద్ర‌బాబు ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లిన నేత‌లు?

ఏపీ సీఎం చంద్ర‌బాబు భారీ ప్ర‌ణాళిక‌తో బ‌య‌లుదేరారు. దేశ ప్ర‌యోజ‌నాల కోస‌మే అని చెబుతూ వివిధ రాష్ట్రాల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు నేత‌ల‌ను క‌లిశారు. వారంతా చాలాకాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న వారే కావ‌డం కొంద‌రు పెద‌వి విరుస్తున్నారు. ఎన్డీయేలో ఉన్న‌వారిని బ‌య‌ట‌కు తీసుకొచ్చి త‌న అనుభ‌వ ఘ‌న‌తను చాటుకోవాలే త‌ప్ప‌, ఇప్ప‌టికే మోడీకి వ్య‌తిరేకంగా ఉన్నవారిని స‌మీక‌రిస్తున్నాన‌నే పేరుతో ప్ర‌చారం చేసుకోవ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. అయినా చంద్ర‌బాబు వాటిని ఖాత‌రు చేయ‌కుండా ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు తో పాటు తాజాగా ప‌శ్చిమ బెంగాల్ ప‌ర్య‌ట‌న కూడా ముగించారు. అదే స‌మ‌యంలో ఈ నెలాఖ‌రున అమ‌రావ‌తి కేంద్రంగా నాయ‌కులంద‌రినీ స‌మీక‌రించి పెద్ద కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టాల‌ని భావించారు. త‌ద్వారా జాతీయ స్థాయి నేత‌లంద‌రి మ‌ద్ధ‌తు కూడ‌గ‌ట్టిన ఘ‌న‌త చంద్రబాబుదేన‌ని చెప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుRead More


జగన్ నోరు తెరిస్తే…!

ఏపీ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు తప్పవనిపిస్తోంది. రాజకీయంగా మళ్లీ వేడి రాజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే మూడు నాలుగు రోజులలో విపక్ష నేత పెదవి విప్పబోతున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో అక్టోబర్ 25నాటి ఘటనలపై ఆయన ఇప్పటి వరకూ స్పందించ లేదు. కేవలం రెండు ట్వీట్లు మినహా తనపై దాడి వ్యవహారం గురించి జగన్ మాట్లాడకపోవడం చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రజాసంకల్పయాత్రకు శ్రీకారం చుట్టిన జగన్ దానికి ముందే మీడియాతో మాట్లాడతారని అంతా భావించారు. కానీ ఈసారి విజయమ్మ తెరమీదకు వచ్చారు. తన బిడ్డను జనాలకు అప్పగిస్తున్నానని, కడుపు కోత మిగల్చవద్దని వేడుకుంటూ ఆమె పూర్తి సెంటిమెంట్ తో మాట్లాడారు. అదే సమయంలో జగన్ మాత్రం ఇప్పటికీ నోరు మెదకపోవడంతో వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. వాస్తవానికి జగన్ పై దాడి ఘటనపై అధికార,Read More


పొత్తు ఖాయం, టీడీపీ నేత‌లకు ఎస‌రు అనివార్యం

ఏపీలో కూడా మ‌హాకూట‌మి ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయి. తెలంగాణాలో చేయి అందుకున్న చంద్ర‌బాబు ఏపీలోనే కాకుండా దేశ‌మంతా విస్త‌రించే ఆలోచ‌న‌తో ఉన్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు , కొత్త రాజ‌కీయాలు న‌డుపుతామ‌ని ఆయ‌న తేల్చేశారు. దాంతో ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. టీడీపీ-కాంగ్రెస్ క‌ల‌యిక దేశ‌మంత‌టా ప్ర‌భావం ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఏపీలో తీవ్ర క‌ల‌క‌లం రేప‌డం ఖాయంగా చెప్ప‌వ‌చ్చు. ఓవైపు వైసీపీ త‌న ఓటు బ్యాంకుకి గండిప‌డ‌కుండా చూసుకోవ‌డంపై దృష్టి సారించాల్సి వ‌స్తుంది. అదే స‌మ‌యంలో టీడీపీ నేత‌లు త‌మ సీట్లు కాపాడుకోవ‌డానికి తీవ్రంగా శ్ర‌మించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. టీడీపీ, కాంగ్రెస్ తో క‌ల‌యిక దాదాపు ఖాయ‌మయిన నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో క‌నీసంగా కాంగ్రెస్ కి 20 అసెంబ్లీ స్థానాలు కేటాయించాల్సి వ‌స్తుంది. అదే జ‌రిగితే ప‌లువురు సిట్టింగులు త‌మ సీట్లుRead More


వైసీపీతో పొత్తుపై ప‌వ‌న్ క్లారిటీ!

జ‌న‌సేన అధినేత స్ప‌ష్టంగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ఆయ‌న క్లారిటీ గా ఉన్న‌ట్టు ప్ర‌కటించారు. ఎన్ని ప్ర‌చారాలు సాగినా, ఎలాంటి ఊహాగానాలు వినిపించినా త‌న రూటు వేరు అన్న‌ట్టుగా ఆయ‌న తేల్చేశారు. దాంతో ప‌వన్ క‌ళ్యాణ్ రాజ‌కీయ భ‌విత‌వ్యంపై సాగిన ర‌క‌ర‌కాల ప్ర‌చారాల‌కు దాదాపు చెక్ పెట్టిన‌ట్టుగా కొంద‌రు భావిస్తున్నారు. ఎన్నిక‌ల నాటికి ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతానికి మాత్రం ప‌వ‌న్ దారి సొంత‌మార్గ‌మే త‌ప్ప‌, ఎవ‌రికీ మిత్ర‌ప‌క్షంగా కొన‌సాగే ఉద్దేశంతో ఆయ‌న లేన‌ట్టుగా తెలిపోయింది. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న రాజ‌కీయ భ‌విత‌వ్యానికి సంబంధించి చేసిన ట్వీట్ ఆస‌క్తిగా మారింది. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు, జనసేన,ఆ పార్టీ తో కలుస్తుంది,యీ పార్టీ తో కలుస్తుంది అని కొందరు అంటే, కలవడం ఏంటి? సీట్ల సర్దుబాటు కూడా అయిపాయిందని ఇంకొందరుRead More


టీడీపీ మెడ‌కు చుట్టుకున్న‌ట్టే!

అధికార పార్టీ అడ్డంగా బుక్క‌య్యింది. తొంద‌రపాటుతో పీక‌ల‌మీద‌కు తెచ్చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. విశాఖ ఎయిర్ పోర్ట్ వ్య‌వ‌హారం పాల‌క‌ప‌క్షానికి పెద్ద త‌ల‌నొప్పిగా మారుతోంది. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌ద‌ర్శించిన హూందాత‌నం టీడీపీ నేత‌ల్లో క‌రువ‌వ్వ‌డంతో న‌ల‌భై ఏళ్ల అనుభ‌వం కూడా న‌ల‌భై ఏళ్ల వ‌య‌స్సున్న నాయ‌కుడు ముందు తేలిపోయిన‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో ఇప్పుడీ వ్య‌వ‌హారం నుంచి గ‌ట్టెక్కే మార్గం అన్వేషిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. వాస్త‌వానికి వైజాగ్ లో జ‌గ‌న్ మీద జ‌రిగిన దాడి ప‌క్కా ప్ర‌ణాళికాబ‌ద్ధ‌మ‌ని తాజాగా రిమాండ్ రిపోర్ట్ తేల్చేసింది. శ్రీనివాస్ ముందస్తుగానే జ‌గ‌న్ రాక‌పోక‌ల‌ను గ‌మ‌నించ‌డం నుంచి అత్యంత జాగ్ర‌త్త‌గా క‌త్తిని ఎయిర్ పోర్ట్ లోకి తీసుకెళ్ల‌డం వ‌ర‌కూ అన్నీ స్కెచ్ లో భాగంగా జ‌రిగిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌య్యింది. అంతేగాకుండా శ్రీనివాస్ కి ప‌లువురు స‌హాకారం అందించిన‌ట్టుగా కూడా క‌నిపిస్తోంది. ఒక్కొక్క‌రి పేర్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. అయితే అందులో అంద‌రూRead More


ప‌క్కా స్కెచ్, కానీ ప్లాన్ గీసిందెవ‌రు?

ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పై వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో జ‌రిగిన దాడి ప‌క్కా ప్ర‌ణాళికాబ‌ద్ధ‌మేనని తేలిపోయింది. అంతా ఓ ప్ర‌ణాళిక ప్ర‌కారం జ‌రిగిన వ్య‌వ‌హారం అని స్ప‌ష్ట‌మ‌య్యింది. ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు అబిమానంతోనో, లేక సానుభూతి కోస‌మో, డీజీపీ చెప్పిన‌ట్టు ప్ర‌చారం కోస‌మో కాద‌ని రుజువ‌య్యింది. తాజాగా పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో ఇది తేట‌తెల్లం అయ్యింది. అయితే నిందితుడు శ్రీనివాస్ వ్య‌వ‌హారంలో భారీగా డ‌బ్బులు చేతులు మారిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతుండ‌డం, నెల రోజుల ముందుగానే క‌త్తిని వైజాగ్ తీసుకెళ్ల‌డం, ఘ‌ట‌న జ‌రిగిన రోజు జేబులో మ‌రో కత్తి కూడా ఉండ‌డం, అంత‌కుముందే భారీ లేఖ సిద్ధం చేసుకోవ‌డం వంటివి గ‌మ‌నిస్తే క‌థ చాలా పెద్ద‌దేన‌ని తేలిపోతోంది. అయితే ఈ క‌థ‌లో అస‌లు నిందితులెవ‌ర‌న్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ప్ర‌భుత్వం తొలుత ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నేRead More


టీవీ9 యూ ట‌ర్న్ తీసుకుందా?

ఇదో చ‌ర్చ మొద‌ల‌య్యింది. తాజాగా ఆ చానెల్ తీరు గ‌మ‌నిస్తే ఇలాంటి అనుమాన‌మే క‌లుగుతోంది. ఆరంభం నుంచి అధికార‌పార్టీకి వంత‌పాడ‌డంలో ఈ చానెల్ ది అందెవేసిన చేయిగా చెబుతుంటారు. అందుకు త‌గ్గ‌ట్టుగా కొత్త కొత్త ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంభించడంలో ఆరితేరిన‌ట్టుగా చెబుతారు. అయితే ఇటీవ‌ల యాజ‌మాన్యం మారిన త‌ర్వాత ధోర‌ణి దాదాపుగా మారిపోయింద‌నే రీతిలో ప్ర‌స్తుతం టీవీ9 ప్ర‌సారాలు క‌నిపిస్తున్నాయి. ఇది ఎన్నాళ్లుంటుంద‌న్న‌ది ప‌క్క‌న పెడితే తాజాగా జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి త‌ర్వాత ప‌రిణామాలు గ‌మ‌నిస్తే టీవీ9 దాదాపుగా యూ ట‌ర్న్ తీసుకున్న‌ట్టు అనేక మంది భావిస్తున్నారు. ఏపీలో అధికార పార్టీ వాద‌న క‌న్నా విప‌క్షానికే ప్రాధాన్య‌త‌నిచ్చేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నం దానికి తార్కాణంగా చెబుతున్నారు. ఇటీవ‌ల టీవీ9 గ్రూపుని మై హోమ్స్ రామేశ్వ‌ర రావు, మేఘా కృష్ణారెడ్డి కాంబినేష‌న్ టేకోవ‌ర్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈRead More


వైసీపీని డిఫెన్స్ లోకి నెట్టిన జ‌గ‌న్!

ఒక్క‌సారిగా ఏపీ ఉలిక్కిప‌డింది. వైజాగ్ ఎయిర్ పోర్ట్ ఘ‌ట‌న‌ క‌ల‌క‌లం రేపింది. విప‌క్ష నేత మీద దాడి జ‌ర‌గ‌డం పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది. అయితే చివ‌ర‌కు అది రాజ‌కీయ దుమారంలా మారుతోంది. సీఎం కూడా ఎదురుదాడి సిద్ధ‌మ‌య్యారు. జ‌గ‌న్ దే త‌ప్పు అన్న‌ట్టుగా, అన్ని పార్టీలు క‌లిసి త‌మ మీద కుట్ర‌ప‌న్నుతున్నార‌నే రీతిలో మాట్లాడారు. అదే స‌మ‌యంలో జ‌న‌సేన‌, వైసీపీ, టీఆర్ఎస్ వంటి పార్టీల‌ను ప్ర‌స్తావించిన చంద్ర‌బాబు, వ్యూహాత్మ‌కంగానే కాంగ్రెస్ ని మాత్రం మిన‌హాయించారు. ర‌ఘువీరారెడ్డి కూడా మాట్లాడిన‌ప్ప‌టికీ ఆయ‌న పేరుని ప్ర‌స్తావించ‌కుండా మిగిలిన‌వారంతా ఒక్క‌టే అన్న‌ట్టుగా ఆరోపించారు. అయితే ఈవిష‌యంలో జ‌గ‌న్ తీరు ప‌ట్ల భిన్న‌వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే స్థానికంగా ఫిర్యాదు చేసి, పోలీసుల‌కు స‌హ‌క‌రించాల్సింది పోయి వెంట‌నే హైద‌రాబాద్ వెళ్లిపోవ‌డం విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇస్తోంది. దానికి భిన్నంగా వైజాగ్ లోనేRead More


విక‌టించిన అస్త్ర‌మే మ‌ళ్లీ సంధించిన టీడీపీ

ఏపీలో అధికార‌ప‌క్షం వైఖ‌రి ఆశ్చ‌ర్య‌క‌రంగా మారుతోంది. ప‌దే ప‌దే ఒకే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం విశేషంగా మారుతోంది. పైగా ఫ‌లితం ఇవ్వ‌ని ఎత్తుగ‌డ‌ల‌తోనే సాగుతున్న తీరు విస్మ‌యం క‌లిగిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని నిర్ణ‌యించిన నాటి నుంచి నేటి వ‌ర‌కూ టీడీపీ నేత‌ల తీరు అదే రీతిలో ఉంది. అందుకు ప‌లు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు అమ‌రావ‌తిలో రైతుల అర‌టి తోట‌లు అక్ర‌మంగా న‌రికితే దానికి కార‌కులంటూ విప‌క్షం వైపు వేళ్లు చూపించారు. ఆ త‌ర్వాత ప‌ట్టిసీమ నీరు వ‌ద‌ల‌గానే పోల‌వ‌రం కాలువ క‌ల్వ‌ర్టు కూలిపోతే ప్ర‌తిప‌క్షం కార‌కులంటూ ప్ర‌తి విమ‌ర్శ‌లు చేశారు. చివ‌ర‌కు అమ‌రావ‌తి రాజ‌ధాని భ‌వ‌నాలు నీరు గారిపోయినా , తునిలో కాపుఉద్య‌మ‌కారులు రైలు తగుల‌బెట్టినా జ‌గ‌న్ పేరుని వివాదాల్లోకి లాగేందుకు ప్ర‌య‌త్నించారు. అన్నింటికీ మించి మావోయిస్టులు చేసిన జంట హ‌త్య‌ల్లో కూడాRead More


జ‌న‌సేన‌కి కీల‌క నేత దూరం

ఆలులేదు చూలు లేదు అన్న‌ట్టుగా జ‌న‌సేన‌లో అప్పుడే వ‌ర్గ విబేధాలు తార‌స్థాయికి చేరుతున్నాయి. కొత్త నేత‌లు వ‌చ్చి చేరుతుండ‌గా, పాత నేత‌లు అసౌక‌ర్యంగా క‌నిపిస్తున్నారు. అందులోనూ కొంద‌రు కీల‌క వ్య‌క్తుల వైఖ‌రితో పార్టీ ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా మారుతోంది. ఇప్ప‌టికే జ‌న‌సేన కేంద్ర కార్యాల‌యంలో ప‌లువురు నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త పూర్తిగా క‌నుమ‌రుగ‌య్యింది. ఎవ‌రికి వారే ఆధిప‌త్యం కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. దాంతో వ‌ర్గ‌పోరు త‌ప్ప‌డం లేదు. ఈ ప‌రిణామాలు జ‌న‌సేన శ్రేణుల‌ను గంద‌ర‌గోళంలో ముంచుతున్నాయి. ముఖ్యంగా మీడియా కోఆర్డినేట‌ర్ హ‌రిప్ర‌సాద్ వైఖ‌రితో అనేక‌మంది అసంతృప్తిగా ఉన్నారు. దాంతో ఆయ‌న ధోర‌ణి న‌చ్చ‌ని కొంద‌రు బ‌హాటంగానే త‌గాదా ప‌డిన‌ట్టు తెలుస్తోంది. జ‌న‌సేన కోశాదికారిగా వ్య‌వ‌హ‌రించిన మారిశెట్టి రాఘ‌వ‌య్య ఇదే త‌ర‌హాలో వాగ్యుద్ధానికి దిగ‌డం, అయినా పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి త‌గిన స్పంద‌న క‌నిపించక‌పోవ‌డంతో ఆయ‌న అసంతృప్తితో క‌నిపిస్తున్నారు.Read More