ap congress

 
 

సీఎంగా ర‌ఘువీరా రెడ్డి

raghuveera

కాంగ్రెస్ పార్టీలో అనూహ్య ప్ర‌తిపాద‌న ముందుకొచ్చింది. ఏకంగా సీఎంగా ర‌ఘువీరాను ప్ర‌తిపాదించేశారు. పీసీపీ చీఫ్ త‌మ త‌రుపున కాబోయే సీఎంగా ఉంటార‌నే ప్ర‌చారం ప్రారంభించార‌.వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రఘువీరారెడ్డి పేరును పరిశీలించాలని పలువురు నాయకులు ప్రతిపాదించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆయనే సమర్ధవంతమైన నాయకుడని వారు సూచించారు. విజయవాడలో నిర్వహించిన పిసిసి వర్క్‌షాపునకు ఎన్‌. రఘువీరారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పిసిసి ఉపాధ్యక్షులు తులసిరెడ్డి తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడితో పాటు సిఎం అభ్యర్థి కూడా చంద్రబాబునాయుడేనని, అదే సంస్కృతి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కూడా ఉందన్నారు. అందువల్ల కాంగ్రెస్‌ తరుఫున సిఎం అభ్యర్థిగా రఘువీరారెడ్డి పేరును ప్రకటిస్తే రాష్ట్రంలో పార్టీకి సానుకూల పవనాలు వీచే అవకాశం ఉంటుందన్నారు. ఓట్ల శాతం కూడా పెరిగే అవకాశముంటుందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ ఓటు బ్యాంకు గతంలోRead More