Main Menu

ap cabinet

 
 

కొత్త ఆశ‌లు రేపుతున్న చంద్ర‌బాబు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కొత్త ఆశ‌లు రేపుతున్నారు. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జాప్యం చేస్తూ ఆశావాహుల్లో ఆశ‌లు చిగురించిడానికి తోడ్ప‌డుతున్నారు. దాంతో ఇప్పుడు మంత్రివ‌ర్గంలో చోటు కోసం చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి ఆశావాహులా జాబితాలో జ్యోతుల నెహ్రూ క‌నిపిస్తున్నారు. అయ‌న‌కు పోటీగా తోట త్రిమూర్తులు కూడా ఉన్నారు. వీరిద్ద‌రిలో ఒక‌రికి మంత్రి ప‌ద‌వి ఇస్తార‌నే ప్ర‌చారం ఉంది. ఏపీ క్యాబినెట్ నుంచి పైడికొండ‌ల మాణిక్యాలరావు బీజేపీ మంత్రి రాజీనామా చేయ‌డంతో కాపు కోటాలో ఒక‌టి ఖాళీ అయ్యింది. క‌మ్మ కోటాలో కామినేని శ్రీనివాస్ సీటు ఖాళీగా ఉంది. అయితే ఆరెండు ఖాళీల‌ను మైనార్టీ, ఎస్టీ కోటాల‌తో నింపాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే త‌మ‌కు గ‌తంలో ఇచ్చిన హామీలు అమ‌లు చేయాలంటూ ప‌లువురు ముందుకొస్తున్నారు. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా చంద్ర‌బాబు చుట్టూ చ‌క్క‌ర్లుRead More


మాజీ మంత్రికి మొండిచేయి త‌ప్ప‌దా?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల కోసం అప్పుడే రేసు మొద‌ల‌య్యింది. నేత‌లంతా త‌మ సీట్లు సుర‌క్షితంగా మార్చుకోవాల‌ని చూస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే మాజీ మంత్రి పీత‌ల సుజాత కూడా త‌న సీటు ఖాయం చేసుకోవాల‌ని ఆశిస్తున్నారు. కానీ ప‌రిస్థితి అంత సానుకూలంగా లేద‌నే ప్ర‌చారం సాగుతోంది. ముఖ్యంగా మాజీ జెడ్పీ చైర్మ‌న్ కోరా జ‌య‌రాజు త‌న‌కే సీటు ఖాయం చేశారంటూ ప్ర‌చారం చేసుకుంటూ ఉండ‌డం ఆమెకు ఆందోళ‌న క‌లిగిస్తోంది. మ‌రికొంద‌రు ఆశావాహులున్న‌ప్ప‌టికీ జ‌య‌రాజు మూలంగా త‌న‌కు ఎస‌రు వ‌చ్చే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ముఖ్యంగా ఎంపీ మాగంటి బాబు, దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ తో పీత‌ల సుజాత‌కు వ‌చ్చిన విబేధాల కార‌ణంగా ఆమెను మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించారు. వారిద్ద‌రి ఒత్తిడి కార‌ణంగానే ఆమెను క్యాబినెట్ నుంచి తొల‌గించిన‌ట్టు అప్పట్లో ప్ర‌చారం సాగింది. చివ‌ర‌కు ఇప్పుడు వ‌చ్చే అసెంబ్లీRead More


బాబు మీద పెట్టుకున్న గంపెడాశ తీరేనా?

ఏపీ రాజ‌కీయాల్లో సామాజిక స‌మీక‌ర‌ణాల‌దే కీల‌క‌పాత్ర‌. కులాల‌ను కాద‌ని ఏ రాజ‌కీయ పార్టీ ఓ అడుగు ముందుకేయ‌లేని ప‌రిస్థితి ఉంది. దాంతో తొలుత రిజ‌ర్వేష‌న్ల‌కు వ్య‌తిరేకం అని చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ప్ర‌స్తుతం మ‌న‌సు మార్చుకోవాల్సి వ‌చ్చింది. ఇక చంద్ర‌బాబు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టి పెట్టుకుని వివిధ వ‌ర్గాల‌ను స‌మీక‌రించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కులాల వారీగా స‌మీక‌ర‌ణ ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. దానికి త‌గ్గ‌ట్టుగా నారా హ‌మారా- టీడీపీ హ‌మారా అంటూ మైనార్టీల‌ను మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రాష్ట్ర‌మంతా విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు.భారీగా స‌మీక‌ర‌ణ చేయ‌డం ద్వారా మైనార్టీల మ‌ద్ధ‌తు త‌మ‌కేన‌ని చెప్పుకునే య‌త్నంలో ఉన్నారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ వెంట న‌డిచిన వ‌ర్గంలో చీలిక తీసుకురావాల‌నే ల‌క్ష్యంతో సాగుతున్నారు. అందులో భాగంగానే ఈనెల 28న గుంటూరులో జ‌ర‌గ‌బోతున్న మైనార్టీలRead More


చంద్ర‌బాబు క్లారిటీ, ఆశావాహుల సంద‌డి మొద‌లు

ఏపీ క్యాబినెట్ విస్త‌ర‌ణ ఖాయం అయ్యింది. ఇప్ప‌టికే రెండు ఖాళీలున్నాయి. బీజేపీకి చెందిన మంత్రులు రాజీనామాల త‌ర్వాత ఖాళీ అయిన రెండు పోస్టులు భ‌ర్తీ చేయ‌డానికి స‌న్నాహాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సీఎం ప్ర‌క‌టించారు. మైనార్టీల‌కు బెర్త్ ఖాయం చేసేవారు. ముస్లీంల‌ను క్యాబినెట్ లోకి తీసుకోబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దాంతో ఆశావాహుల సంద‌డి షురూ అయ్యింది. రెండు ఖాళీలుండ‌డంతో రెండో బెర్త్ కోసం గ‌ట్టి పోటీ త‌ప్పేలా లేదు. ముఖ్యంగా కామినేని శ్రీనివాస్ ఖాళీ చేయ‌డంతో క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన మ‌రొక‌రికి అవ‌కాశం ద‌క్కుతుంద‌న్న అబిప్రాయంతో ఉన్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే ప‌లువురు క‌దుపుతున్నారు. ధూలిపాళ న‌రేంద్ర‌, ప‌య్యావుల కేశ‌వ్, గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి వంటి వారు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేసి గ‌తంలో విఫ‌ల‌మ‌య్యారు. ఇప్పుడు మ‌రోసారి ఈ పేర్ల‌న్నీ తెర‌మీద‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. వారికి తోడుగాRead More


మంత్రులంతా మౌనం పాటించాలి…!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అనూహ్యంగా ఇర‌కాటంలో ప‌డ్డారు. రిజ‌ర్వేష‌న్ల‌ వ్య‌వ‌హారం ఆయ‌న మెడ‌కు చుట్టుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. పార్టీ నేత‌లు, మంత్రులు కూడా రిజ‌ర్వేష‌న్ల‌పై నోరు మెద‌ప‌వ‌ద్ద‌ని ఆదేశాలిచ్చిన‌ట్టు తాజా స‌మాచారం. ఏపీ క్యాబినెట్ భేటీలో కాపు రిజ‌ర్వేష‌న్ల అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మంత్రులు జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించారు. అదే స‌మ‌యంలో మ‌త్స్యకారులు, ర‌జ‌కుల రిజ‌ర్వేష‌న్ల‌పై పెరుగుతున్న ఒత్తిడిని సీఎం ముందుకు తీసుకొచ్చారు. దాంతో ఆయ‌న ఈ విష‌యంలో తొంద‌ర‌పాటు అస‌లుకే ఎస‌రు తెస్తుంద‌ని తెలిపిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. రిజ‌ర్వేష‌న్ల వ్య‌వ‌హారాన్ని తాత్కాలికంగా విడిచిపెట్టాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో కాపు, ర‌జ‌క‌, మ‌త్స్య‌కార‌, బోయ వంటి సామాజిక‌వ‌ర్గాల రిజ‌ర్వేష‌న్లు విస్తృతంగా వినియోగించుకుని ప్ర‌యోజ‌నం పొందిన టీడీపీ అధినేత ఇప్పుడు వెన‌క‌డుగు వేస్తున్న‌ట్టుRead More


పీకే ఎఫెక్ట్: కాపుల‌కు మ‌రో బెర్త్

ఏపీ రాజ‌కీయాల్లో మ‌రో కొత్త ప‌రిణామం చోటు చేసుకుంటోంది. ఏపీ క్యాబినెట్ విస్త‌ర‌ణ వ్య‌వ‌హారాలు ముందుకొస్తున్నాయి. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు సింగ‌పూర్ లో ప‌ర్య‌టిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న తిరిగి వ‌చ్చిన త‌ర్వాత కీల‌క ప‌రిణామాలు ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఏపీ క్యాబినెట్ లో రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. బీజేపీకి చెందిన మాణిక్యాల‌రావు, కామినేని శ్రీనివాస్ రాజీనామాల త‌ర్వాత మూడు నెల‌లుగా అటు దేవాదాయ శాఖ‌తో పాటు ఇటు ప్ర‌ధాన‌మైన వైద్య‌, ఆరోగ్యం కూడా మంత్రి కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఖాళీలను భ‌ర్తీ చేసే ఆలోచ‌న‌లో భాగంగా మైనార్టీల‌కు ఒక ప‌ద‌వి కేటాయించాల‌ని చంద్ర‌బాబు ఆలోచిస్తున్నారు. ఆ స్థానాన్ని ష‌రీఫ్ కి దాదాపు ఖాయంగా భావిస్తున్నారు. వైసీపీ నుంచి వ‌చ్చి చేరిన మ‌రో ఇద్ద‌రు ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న‌ప్ప‌టికీ టీడీపీ ఎమ్మెల్సీ వైపు మొగ్గు చూపుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. జ‌లీల్Read More


ఏపీ క్యాబినెట్ లో మార్పులు

ఎన్నిక‌ల ముంగిట మ‌రోసారి తేనెతుట్ట‌ను క‌దిలించే ప్ర‌య‌త్నం ప్రారంభ‌మ‌యిన‌ట్టు తెలుస్తోంది. ఆశావాహుల సంఖ్య భారీగా ఉన్న నేప‌థ్యంలో ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కుతుందోన‌నే చ‌ర్చ మొద‌ల‌య్యింద‌. ఏపీ క్యాబినెట్ లో రెండు ఖాళీల‌ను పూరించ‌డానికి చంద్రబాబు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం. బీజేపీ మంత్రుల రాజీనామాతో రెండు బెర్తులు గ‌డిచిన మూడు నెల‌లుగా ఖాళీగా ఉన్నాయి. అందులో కీల‌క‌మైన వైద్య ఆరోగ్య శాఖ ఉండ‌డం విశేషం. అ నేప‌థ్యంలో ఈసారి మైనార్టీల‌కు క్యాబినెట్ లో చోటు క‌ల్పించ‌డానికి చంద్రబాబు సంక‌ల్పించిన‌ట్టు తెలుస్తోంది. గడిచిన నాలుగేళ్లుగా బీజేపీతో క‌లిసి సాగిన నేప‌థ్యంలో మైనార్టీలు త‌మ‌కు దూరంగా ఉన్నార‌ని చంద్ర‌బాబు భావించారు. దాంతో ఆ వ‌ర్గాన్ని దూరం పెట్టారు. కానీ తాజాగా మారిన ప‌రిణామాల‌తో చంద్ర‌బాబు దూకుడు పెంచ‌గా, జ‌గ‌న్ , బీజేపీ కి ద‌గ్గ‌ర‌య్యార‌నే ప్ర‌చారం సాగుతోంది. దాంతో మైనార్టీల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డ‌మేRead More


మంత్రుల‌కే ముప్పుతిప్ప‌లు: గెలిచేదెవ‌రు? నిలిచేదెవ‌రు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్న వారికి ఎన్నిక‌ల జ్వ‌రం ప‌ట్టుకుంది. నేత‌లు ఇప్పుడు జ‌నం వైపు మ‌ళ్లారు. సంక్షేమ ప‌థ‌కాల జ‌పం ప‌ఠిస్తున్నారు. మ‌ళ్లీ గెలిపించండి అంటూ మొత్తుకుంటున్నారు. ర‌క‌ర‌కాల ప్ర‌చారాల‌తో ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప‌నిలో సాగుతున్నారు. అయితే ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌న్న‌దానిపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు సాగుతున్నాయి. చంద్ర‌బాబుతో క‌లుపుకుని ప్ర‌స్తుతం క్యాబినెట్ లో 23మంది ఉన్నారు. వారిలో య‌న‌మ‌ల‌, నారాయ‌ణ‌, నారా లోకేష్, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ఉన్నారు. మిగిలిన 18మందిలో 10మందికి గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అందులో ఫిరాయింపు మంత్రుల్లో ఇద్ద‌రు స‌హా మ‌రికొంద‌రున్నారు. మిగిలిన నేత‌ల్లో కూడా విజ‌యం కూడా గ‌ట్టిగా చ‌మ‌టోడ్చ‌క త‌ప్ప‌ద‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుత అంచ‌నాల ప్ర‌కారం ఏపీ మంత్రుల్లో కిమిడి క‌ళా వెంక‌ట్రావు (ఎచ్చెర్ల), చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు(న‌ర్సీప‌ట్నం), నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌(పెద్దాపురం),Read More


మంత్రులు మారిపోతున్నారు..!

ఏపీలో క్యాబినెట్ లో పలువురు మంత్రులు మారబోతున్నట్టు తెలుస్తోంది. దానికి తగ్గట్టుగా సీఎం కసరత్తు కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల నుంచి కొందరు మంత్రులు సురక్షిత స్థానాల వైపు కన్నేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు మంత్రులు దానికి సంబంధించి ఓ స్పష్టతకు వచ్చేసినట్టు సమాచారం. మిగిలిన మంత్రల విషయంలో చంద్రబాబు ఓ నిర్ణయానికి వస్తే ఆ తర్వాత వారికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో స్థానాలు మారాలని భావిస్తున్న మంత్రుల్లో మొదటి స్థానం భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా శ్రీనివాసరావుదే. ప్రతీ ఎన్నికల్లోనూ నియోజకవర్గం మారుతూ వస్తున్న ఆయన వచ్చేసారి వీలయితే జిల్లా మార్చేసే యోచనలో ఉన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల వైపు ఆయన కన్నేశారు. అధిష్టానం అవకాశం ఇస్తే తనకు సేఫ్ జోన్ అవుతుందని ఆశిస్తున్నారు.Read More


చంద్ర‌బాబుకి క్యాబినెట్ క‌ష్టాలు త‌ప్ప‌వా?

ఏపీ రాజ‌కీయాల్లో తాజా ప‌రిణామాలు తెలుగుదేశం పార్టీని తీవ్రంగా కలచివేస్తున్నాయి. ఇన్నాళ్లుగా కేవ‌లం వైసీపీని ఎదుర్కొంటూ, ఆపార్టీని చీల్చ‌డానికి సైతం ప్ర‌య‌త్నించేంత‌ వ‌ర‌కూ సాగిన టీడీపీకి వ‌రుస‌గా బీజేపీ, జ‌న‌సేన నుంచి వ‌స్తున్న ఎదురుదాడితో త‌ల్ల‌డిల్లిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో అనేక‌మార్లు చంద్ర‌బాబు నిర్ణ‌యాల్లో మార్పులు త‌ప్ప‌డం లేదు. ఆయ‌న ప్ర‌క‌ట‌న‌ల్లో కూడా అనూహ్య మార్పులు వ‌స్తున్నాయి. అయితే తాజాగా చంద్ర‌బాబు మ‌రోసారి తేనెతుట్ట లాంటి క్యాబినెట్ మార్పుల‌ను చంద్ర‌బాబు నెత్తిన పెట్టుకుంటార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. మ‌రోసారి మంత్రివ‌ర్గ మార్పుల‌కు చంద్ర‌బాబు సిద్ద‌మ‌వుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. మూడో సారి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు చంద్ర‌బాబు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అయితే గ‌త ఏడాది ఏప్రిల్ లో జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ నాటి ప‌రిణామాల ప్ర‌భావం నేటికీ చ‌ల్లార‌లేదు. బుచ్చ‌య్య చౌద‌రి, క‌ర‌ణం బ‌ల‌రాంRead More