Main Menu

ap budget

 
 

బాబుకి బడ్జెట్ భయం!

కేంద్ర బడ్జెట్ కాక పూర్తిగా తగ్గలేదు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ తొలివిడత సమావేశాలు ముగుస్తుండడంతో సీన్ కొంత మారే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో అమరావతిలో వేడి రాజుకోవడం ఖాయంగా ఉంది. ఈసారి ఏపీ బడ్జెట్ గురించి ఆసక్తికర చర్చ మొదలవుతోంది. హామీల అమలు విషయంలో కేంద్రాన్ని అన్ని పక్షాలు నిలదీస్తున్నాయి. ఎవరి మార్గంలో వారు మోడీ సర్కారు తీరుని ప్రశ్నిస్తున్నారు. ఏపీకి రావాల్సిన నిధుల కోసం పట్టుబడుతున్నారు. ఇప్పటికే మోడీ, జైట్లీ ప్రకటనలు కూడా వారిని సంత్రుప్తి పరచలేదని చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర బడ్జెట్ లో కూడా పలు హామీలు నెరవేర్చాల్సి ఉంది. నిరుద్యోగభ్రుతి, రుణమాఫీ వంటి కీలకాంశాలు సహా పలు మాటలు నీటిరాతలుగానే ఉన్నాయి. కొన్ని అరకొరగా అమలయినప్పటికీ అంచనాలకు తగ్గట్టుగా లేవు. దాంతో చంద్రబాబు వ్యవహారం చర్చల్లోకి రాబోతోంది. బీజేపీRead More


అప్పుల కుప్ప ఆంధ్ర‌ప్ర‌దేశ్..!

ఏపీ ని ప్ర‌పంచంలో నెంబ‌ర్ వ‌న్ గా నిల‌బెడ‌తామ‌ని సీఎం చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతుంటారు. 2022 నాటికి దేశంలో నెంబ‌ర్ త్రీ గానూ, 2029 నాటికి  ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ గానూ, 2050 నాటికి ప్ర‌పంచంలో నెంబ‌ర్ వ‌న్ గాను స‌న్ రైజ్ సిటీని నిల‌ప‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని చంద్ర‌బాబు చాలామార్లు ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు చంద్ర‌బాబు మాట‌లు ఎలా ఉన్న‌ప్ప‌టికీ అప్పుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎవ‌రిక అంద‌నంత ఎత్తు కి ఎదిగిపోతోంది. అనూహ్యంగా చంద్ర‌బాబు హ‌యంలో అప్పుల్లో అభివృద్ధి అమాంతంగా క‌నిపిస్తోంది. 2004కి ముందు ప్ర‌పంచ బ్యాంకు జీత‌గాడు- చంద్ర‌బాబు మోస‌గాడ‌ని ఓ పాపుల‌ర్ నినాదం వినిపించేది. దానికి కార‌ణం చంద్ర‌బాబు చేసిన అప్పులు..దాని మూలంగా అమ‌లు చేసిన ష‌రతులే. అయితే అప్ప‌ట్లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పులు ల‌క్ష కోట్ల‌కు చేర‌డం తీవ్ర దుమారం రేపింది.Read More


లోటు తీవ్రం: ఏపీ కి పెను భారం

గ‌త‌కాల‌పు చీక‌టి కాలం చెదిరిపోయింది..మంచి కాలం వ‌చ్చేసింది..అంతా చంద్ర‌న్న చ‌ల‌వే అంటూ వ్య‌వ‌సాయ బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య‌లు పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. ఏపీలో ప‌రిస్థితికి , అమాత్యుడి మాట‌ల‌కు సంబంధం ఉందా అన్న ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. గ‌త కొన్ని రోజులుగా నిత్యం ప‌త్రిక‌ల్లో గ‌మ‌నిస్తే మిర్చి రైతుల అగ‌చాట్లు అన్నీ ఇన్నీ కావు. కంది రైతుల క‌ష్టాలు చెప్ప‌న‌ల‌వి కాదు. ఉల్లి రైతుల లొల్లి, ట‌మోటా రైతుల తిప్ప‌లు ప్ర‌భుత్వానికి ప‌ట్టాయా అన్న ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. అన్నింటికీ మించి క‌రువు స‌మ‌స్య‌ల‌తో అన్న‌దాత‌లు కేర‌ళ‌లో ప‌డుతున్న క‌ష్టాలు ప‌తాక శీర్షిక‌ల‌కెక్కాయి. ఇంత తీవ్ర ప‌రిస్థితుల్లో ఆయా వ‌ర్గాల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండానే చీక‌టి కాలం చెదిరిపోయిందంటూ మంత్రి చెప్ప‌డం విస్మ‌యం క‌లిగిస్తోంద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.Read More


హోదా లేదు ..రాదు..!

‘రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే పద్ధతిని 14వ ఆర్థిక సంఘం నిలిపివేసిన తరుణంలో అందుకు సమానమైన ప్రత్యేక కేంద్ర సహాయ హామీని పొందగలిగాం. దీనికి తగిన చట్టబద్ధత సాధించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము’ ఇది ఏపీ బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తేల్చి చెప్పిన మాట. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్ష, హక్కు అయిన ప్రత్యేక హోదాను వదులుకున్నట్టు ఆయన ఈ ప్రసంగం ద్వారా చెప్పకనే చెప్పేశారు. ప్రత్యేక హోదా కోసం ఓ వైపు ప్రజలు  తీవ్రంగా పోరాడుతున్నప్పటికీ.. హోదాను వదిలేసి ప్యాకేజీ కోసం పాకులాడుతున్నట్టు బడ్జెట్‌ ప్రసంగంలో యనమల ప్రకటన చేయడం విమర్శలకు తావిస్తున్నది.