ap assembly

 
 

మొక్కుబడి తంతుగా ఏపీ అసెంబ్లీ

ap assembly

ఏపీ అసెంబ్లీ సమావేశాలు బాతాఖానీ క్లబ్బులా మారిందన్నది సీపీఐ నాయకుడి ఆరోపణ. పరిస్థితి చూస్తుంటే అది విమర్శ మాత్రమే కాదు వాస్తవం కూడా అన్నట్టుగా ఉంది. అసెంబ్లీ సమావేశాల పట్ల జనంలో అసలు ఆసక్తి కనబడడంలేదు. చానెల్స్ కూడా ప్రత్యక్ష ప్రసారాలను దాదాపు ఆపేశాయి. అదే సమయంలో ఎమ్మెల్యేలకు కూడా ఏమాత్రం అటువైపు చూడాలన్న ధ్యాసే కనిపించడం లేదు. దాంతో అసెంబ్లీలు సమావేశాలు పూర్తిగా మొక్కుబడి తంతులా మారిపోయాయి. వాస్తవానికి అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోలేదన్న కారణంతో విపక్షం సమావేశాలను బాయ్ కాట్ చేసిన నాడే సగం ఆసక్తిపోయింది. జనానికి ఇది చప్పగా మారిపోయే తంతులా అనిపించింది. పాలకపక్ష సభ్యులే ప్రశ్నలు వేసుకుని, ఆపార్టీ నేతలే సమాధానాలు చెప్పుకునే పరిస్థితి రావడం విస్మయం కలిగించింది. దాంతో ఈసారి అసెంబ్లీ జరుగుతుందన్న విషయమే చాలామందికి తెలియకుండాRead More


పెళ్ళి ఎఫెక్ట్: ఖాళీ అయిన అసెంబ్లీ

ap assembly

పెళ్లిళ్ల ఎఫెక్ట్ అసెంబ్లీ మీద పడింది. ఏకంగా సెలవు ప్రకటించాల్సి వచ్చింది. ప్రతిపక్షం లేని అసెంబ్లీ కావడంతో పెద్దగా ప్రజల ద్రుష్టిలో పడే అవకాశం లేదు. ఈలోగా ఇప్పటికే పోలవరం ట్రిప్పు కోసం ఓ సారి సెలవు ప్రకటించారు. ఇప్పుడు మరోసారి పెళ్లిళ్లులున్నాయన్న పేరుతో సెలవు తీసుకున్నారు. వరుసగా మూడురోజుల పాటు పెళ్లిళ్ల సందడి నేపథ్యంలో వచ్చే సోమవారం వరకూ సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఈ నెల 23, 25 తేదీల్లో పెళ్లి ముహూర్తాలుండటంతో అసెంబ్లీ సమావేశాలకు సెలవులు ప్రకటించారు. తాము పెళ్లిళ్లకు హాజరు కావాల్సి ఉందని పలువురు శాసనసభ్యులు స్పీకర్‌ కోడెలను కలిసి 23,24,25 తేదీల్లో సెలవులు కోరారు. స్పీకర్‌ ఆ మూడు రోజులను సెలవు దినాలుగా ప్రకటించారు. తిరిగి అసెంబ్లీ 27 నుంచి ప్రారంభమై వారంతం వరకు ఉంటుందనిRead More


వైసీపీ అధినేతపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Adinarayana-Reddy1455803904

ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి రెచ్చిపోయారు. విపక్ష పార్టీపై చెలరేగారు. వివాదాస్పద కామెంట్స్ చేశారు. జగన్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. జనం వస్తున్నారని సంబరపడవద్దని సెటైర్లు విసిరారు. తాజాగా అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశాలుగా మారాయి. తాజాగా శుక్రవారం పాదయాత్రకు జగన్ బ్రేక్ ఇచ్చిన నేపథ్యంలో జగన్ ప్రస్తుతం అత్తగారి ఇంటికి వెళ్లారంటూ మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షవైసీపీ వైరస్ లాంటిది.. వైరస్ లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో సభలో వైసీపీ లేకపోవడం అలానే ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. జగన్‌ను ఇలానే వదిలేస్తే తెలంగాణకు షర్మిల సీఎం అవుతారని, విజయమ్మను రాష్ట్రపతి చేస్తాని చెబుతారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గత సాధారణ ఎన్నికలకు ముందు బొత్స, రఘువీరా రెడ్డి భారీగా పెళ్లిళ్లు జరిపారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.Read More


మ‌రో వివాదంలో రోజా, నోటీసులు సిద్ధం

Roja-suspended-from-andhra-pradesh-assembly

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా మ‌రోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ఇప్ప‌టికే గ‌తంలో అసెంబ్లీ వేదిక‌గా చేసిన వ్యాఖ్య‌ల వ్య‌వ‌హారం ఇంకా చ‌ల్లారలేదు. ఇటీవ‌లే సుప్రీంకోర్ట్ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. కానీ ఇప్పుడు మ‌రోసారి ఆమెకు నోటీసులు జారీ చేసే ప‌రిస్థితి రావ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అప్ప‌ట్లో మ‌హిళా ఎమ్మెల్యేల మీద చేసిన వ్యాఖ్య‌ల‌తో దుమారం రేగింది. అనిత ఫిర్యాదుతో మొద‌ల‌యిన క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. ఇక ఇప్పుడు తాజాగా స్పీక‌ర్ మీద చేసిన వ్యాఖ్య‌ల‌తో ఆమెకు నోటీసులు ఖాయంగా మారాయి. రోజాకు మరోసారి ప్రివిలేజ్ నోటీసులు జారీ చేయాల‌ని స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ ఆదేశాలు జారీచేయ‌డంతో అసెంబ్లీ కార్య‌ద‌ర్శి దానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో తాజాగా స్పీకర్‌పై రోజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇవాళ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వచ్చి మాక్ ఓటింగ్‌కుRead More


సచివాల‌యం బీట‌లు వారింది..!

ap assembly

నెల రోజుల క్రితం స‌చివాల‌యం లో నీరు కారింది. ఇప్పుడు గోడ‌లు బీట‌లు వారింది. అప్పుడు నీరు కారితే నాసిర‌కం నిర్మాణ లోపం కాద‌ని స‌ర్కారు త‌ప్పించుకుంది. ఇప్పుడు బీట‌లు వారినా అదే మాట‌లు చెబుతోంది. స‌చివాల‌యం గోడ‌లకు బీట‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నా ఏ స‌మ‌స్యా లేదంటోంది. వెల‌గ‌పూడి స‌చివాల‌యంలో ఒక్కో లోపం వెలుగుచూస్తున్నా అవ‌న్నీ అస‌లు స‌మ‌స్య‌లే కాద‌ని త‌ప్పించుకుంటోంది. మొత్తం 42 ఎక‌రాల విస్తీర్ణంలో స‌చివాలయం, అసెంబ్లీ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న నిర్మించారు. నిర్మాణాలు కూడా పూర్తిగా తాత్కాలికంగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే 680 కోట్లు ఖ‌ర్చు చేసిన త‌ర్వాత ఆరు నెల‌లు కూడా స‌మ‌స్య‌లు లేని ప‌రిస్థితి లేదు. ప్ర‌తీ రోజూస‌చివాల‌యంలో మ‌ర‌మ్మ‌త్తులే. నిత్యం ఏదో మూల ఇబ్బందులు రావ‌డం, దానిని క‌వ‌ర్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేయ‌డం అంద‌రూ గ‌మ‌నిస్తూనే ఉన్నారు. వాస్త‌వానికి ఈRead More


మ‌ళ్లీ ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

ap assembly

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌కు మ‌రోసారి రంగం సిద్ధ‌మ‌వుతోంది. వాడివేడిగా సాగిన బ‌డ్జెట్ స‌మావేశాల ప్ర‌భావం ఇంకా పూర్తిగా చ‌ల్లార‌క‌ముందే మ‌రోసారి స‌మావేశాల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అయితే ఈసారి కేవ‌లం రెండు రోజులు మాత్ర‌మే స‌మావేశాలు జ‌ర‌గ‌బోతున్నాయి. అది కూడా జీఎస్టీ బిల్లుకి ఆమోదం తెల‌ప‌డం కోస‌మేన‌ని స‌మాచారం. ఈ స‌మావేశాల‌ను మే 15, 16 తేదీల్లో జ‌ర‌ప‌డానికి ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తోంది. పార్లమెంటులో ఆమోదం పొందిన జీఎస్టీ బిల్లును రాష్ట్రా‌ల అసెంబ్లీలు కూడా ఆమోదించాల్సి ఉంది. జూలై 1 నుంచి ఈ చట్టం అమల్లోకి రానున్న దృష్ట్యా ఈ నెలలో అన్ని రాష్ట్రా‌ల అసెంబ్లీలు ఆమోదముద్ర వేయాల్సి ఉంది. దీంతోపాటు జీఎస్టీకి సంబంధించి రాష్ట్రం కూడా బిల్లును రూపొందించింది. దానిని కూడా అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించాల్సి ఉంటుంది. ఈ సమావేశాల్లోనే మరో రెండు బిల్లులను కూడా పెట్టి ఆమోదంRead More


తీరు మార‌ని లోకేష్ త‌ప్పులో కాలేశారు

nara lokesh

అంబేద్కర్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ.. అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు అన్నారు. తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో మాట్లాడుతూ తాగునీటి సమస్య ఏర్పాటే తన లక్ష్యమని చెప్పారు. ఇప్పుడు ఆ రెండింటినీ మించిపోయేలా మరో గొప్ప మాట చెప్పారు ఏపీ ఐటీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్‌. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా మరోసారి ఆయన నోరు జారారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మొత్తం 200 స్థానాల్లో గెలిపించాలని కార్యకర్తలను ఆయన కోరారు. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న మొత్తం స్థానాలు కేవలం 175 మాత్రమే. అలాంటప్పుడు నూటికి 110 మార్కులు తెచ్చుకోవాలని అన్నట్లుగా లేని సీట్లు ఎక్కడి నుంచి గెలిపించుకురావాలో అర్థం కాక కార్యకర్తలు జుట్టు పీక్కున్నారు. అసలు రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో కూడా తెలియకుండా ఆయన ఎలా చెప్పేస్తున్నారని తెలుగుRead More


అసెంబ్లీలో స్పీక‌ర్ కి ఇదేం ప‌ని?

speaker

ప్ర‌జాస్వామ్యం రానురాను ప‌రిహాస‌మ‌వుతోంది. రాచ‌రిక‌పు ఆన‌వాళ్లు అడుగ‌డుగునా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అందుకే సీఎం త‌న‌యుడు త‌ల‌చ‌కున్న‌దే త‌డువుగా ఎమ్మెల్సీ అయిపోయారు..నాలుగురోజుల‌కే మంత్రివ‌ర్గంలో చేరిపోయారు. అది ఒక భాగం అయితే ఇక్క‌డ ఫోటోలో చూడండి..సీఎం కోడ‌లు, ఓ మంత్రిగారి భార్య అసెంబ్లీ చూడాల‌న‌కున్నారు. స‌హ‌జంగా అసెంబ్లీ చూడాల‌నుకుంటే దానికి అనేక అనుమ‌తులు అవ‌స‌ర‌మ‌వుతాయి. వాట‌న్నింటినీ పూర్తి చేసిన త‌ర్వాత విజిట‌ర్స్ గ్యాల‌రీ వ‌ర‌కూ అనుమ‌తిస్తారు. కానీ ఇక్క‌డ దానికి భిన్నం. స‌భ‌లో స‌భ్యులు కానివారు కూడా ఏపీ అసెంబ్లీలో ద‌ర్జాగా తిరుగుతున్నారు. దానికి కేవ‌లం సీఎం బంధువుల‌యితే చాల‌న్న‌ట్టుగా ఉంది. అది కూడా స‌రే అని స‌రిపెట్టుకున్నా ఏకంగా స్పీక‌ర్ ద‌గ్గ‌ర ఉండి, సీఎం మ‌న‌వడిని చంక‌నెత్తుకుని అసెంబ్లీని ఓ ఆట‌స్థ‌లంగా చుట్టూ తిప్ప‌డం విస్మ‌య‌క‌రం. స్పీక‌ర్ చెయిర్ గురించి , విలువ‌ల గురించి వ‌ల్లించే నేత‌లు ఇంతగా దిగ‌జార‌డంRead More


టీవీ9 కొత్త దారి

tv9

అవును..ఏపీలో రాజ‌కీయాలు మారుతున్న కొద్దీ మీడియాలో ప‌రిణామాలు కూడా మారుతున్నాయి. పార్టీకో చానెల్, జెండాకో ప‌త్రిక అన్న‌ట్టుగా ఉన్న త‌రుణంలో మెరుగైన స‌మాజం కోసం అని చెప్పుకునే టీవీ9 కూడా త‌న ఎజెండా కోసం ఓ జెండాకి ప్రాధాన్య‌త ఇవ్వ‌డం చాలాకాలంగా వ‌స్తోంది. ముఖ్యంగా వైఎస్ జ‌గ‌న్ మీద వ్య‌తిరేక‌త‌తో చంద్ర‌బాబుకి సానుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డం అంద‌రికీ తెలిసిందే. అయితే తాజాగా చంద్ర‌బాబు క‌న్నా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన‌మ‌న్న‌ట్టుగా టీవీ9 తీరు క‌నిపిస్తోంది. అందుకే కొత్త దారి ప‌డుతోంది. కాట‌మ‌రాయుడు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో ఈ విష‌యాన్ని ర‌వి ప్ర‌కాష్ స్వ‌యంగా ప్ర‌క‌టించిన త‌ర్వాత పెద్ద‌గా ఆశ్చ‌ర్యం లేదు. అయితే ఆచ‌ర‌ణ ఎలా ఉంటుందో చెప్ప‌డానికి తాజా ప‌రిణామం ఓ ఉదాహ‌ర‌ణ‌గా చూడ‌వ‌చ్చు. స‌హ‌జంగా చంద్ర‌బాబు ఎక్క‌డ మాట్లాడినా లైవ్ ఇవ్వ‌డానికి టీవీ9 ప్రాధాన్య‌త‌నిస్తుంది. అందులోనూ అసెంబ్లీలో,Read More


వియ్యంకుల‌కు ఎస‌రు పెట్టిన‌ జ‌గ‌న్

ganta

జ‌గ‌న్ ప్ర‌తీకారం తీర్చుకున్న‌ట్టే భావించ‌వ‌చ్చు. క‌డప ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎదుర‌యిన అవ‌మానానికి ఆయ‌న త్వ‌ర‌గానే బ‌దులిచ్చేశారు. దాంతో ఇప్పుడు వియ్యంకుళ్లు ఇర‌కాటంలో ప‌డ్డారు. ఉక్కిరిబిక్కిర‌వుతున్నారు. మూడు రోజుల్లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉండ‌డంతో తీవ్రంగా స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. వారిలో గంటా శ్రీనివాస‌రావుకి గ‌ట్టి దెబ్బే ఖాయం అంటున్నారు. క‌డ‌ప ఇన్ఛార్జ్ మంత్రిగా గంటా చేసిన హ‌డావిడి అంతా ఇంతా కాదు. సీఎం ర‌మేష్ సీన్ లో ఉన్న‌ప్ప‌టికీ క‌డ‌ప‌లో గంటా స్కెచ్ గ‌ట్టిగానే ఫ‌లించిన‌ట్టు చెప్ప‌వ‌చ్చు. దానికి బ‌దులుగా గంటాను అంతా అభినందించారు. ప్ర‌త్తిపాటి పుల్లారావు లాంటి వాళ్లు ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఆయ‌న్ని క‌డ‌ప నుంచి పోటీ చేయించాలని ప్ర‌తిపాదించే వ‌ర‌కూ వెళ్లారు. అలాంటి గంటా హ‌ఠాత్తుగా లీకేజీలో గ‌లీజు కావ‌డం కొంత అస‌హ‌నంగా మార్చేసింది. చివ‌ర‌కు స‌భ‌లో ఆయ‌న తీరు కూడా చంద్ర‌బాబును సంతృప్తిప‌ర‌చ‌కపోవ‌డం క‌ల‌వ‌ర‌పెడుతోంది.Read More