Main Menu

ANUSHKA

 
 

మెగాస్టార్ తో జేజ‌మ్మ‌!

టాలీవుడ్ జేజ‌మ్మ , మెగాస్టార్ కాంబినేష‌న్ లో మువీకి ఇప్ప‌టికే చాలా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. కానీ చివ‌ర‌కు అది సెట్స్ పైకి వెళ్ల‌బోతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. వ‌చ్చే డిసెంబ‌ర్ లో ప్రారంభం కాబోతున్న సినిమాలో చిరంజీవి స‌ర‌స‌న అనుష్క న‌టించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. దాంతో అ కాంబినేష‌న్ లో మువీ ఫ్యాన్స్ లో ఆస‌క్తిని రాజేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. స‌క్సెస్ పుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న సినిమాపై అంద‌రి దృష్టి ప‌డ‌బోతోంది.గ‌తంలో చిరంజీవితో ఐటెమ్ సాంగ్ చేసి ఈ భామ మెప్పించింది. రచయితగా కెరీర్‌ను మొదలుపెట్టి స్టార్ దర్శకుడిగా ఎదిగిన అతికొద్దిమంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. కాగా ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మంచి సోషల్ మెసేజ్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరు రైతు పాత్రలో నటించనున్నారనిRead More


మ‌ళ్లీ అదే బాట‌లో అనుష్క‌

అనుష్క త‌న‌కు బాగా అచ్చొచ్చిన మార్గాన్ని వెదుకుతున్నారు. ఇప్ప‌టికే ప‌లు సినిమాల‌తో ఆక‌ట్టుకున్న ఆమె మ‌రోసారి లేడీ ఓరియంటెడ్ మువీపై మొగ్గు చూపారు. కొంత‌కాలంగా ఖాళీగా ఉన్న ఈ భామ త్వ‌ర‌లో సెట్స్ మీద‌కు వెళ్ల‌డానికి సిద్ధం అవుతున్నారు. బాహుబలి, అరుంధతి లాంటి సినిమాలతో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ అనుష్క ప్రధాన పాత్రలో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. భిన్నమైన సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే అనుష్కతో చర్చలు జరిపి ఆమెతో ఒప్పించాడు దర్శకుడు. అయితే ఈ సినిమాలో మరో కీలకపాత్రకోసం హీరో నానిని ఎంపిక చేశారట. ఈ కథ విని నచ్చడంతో నాని ఓకే చెప్పాడట. అనుష్క భాగమతి తరువాత నటించే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా అనగానే ఈ సినిమాపై సర్వత్రాRead More


ర‌హ‌స్య పెళ్ల‌యినా ఫ్యాన్స్ కి చెప్పిన త‌ర్వాతేనంటున్న ప్ర‌భాస్

ప్ర‌భాస్ పెళ్లి చుట్టూ వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఇటీవ‌ల అనుష్క వ్య‌వ‌హారం తెర‌మీద‌కు వ‌చ్చిన త‌ర్వాత మ‌రింత హాట్ టాపిక్ గా మారింది. కొంత‌కాలం క్రితం మంచి సంబంధాల కోసం తిరిగిన ప్ర‌భాస్ కుటుంబీకులు ప్ర‌స్తుతం వాటికి స్వ‌స్తి చెప్పారు. అదే స‌మ‌యంలో అనుష్క‌, ప్ర‌భాస్ ప్రేమ వ్య‌వ‌హారం పెద్ద స్థాయిలో ప్ర‌చారం సాగింది. ఈలోగానే అనుష్క పెళ్లి మాట‌లు చెబుతోంది. దాంతో అంద‌రి క‌న్నూ ప్ర‌భాస్ మీద ప‌డింది. అయితే అభిమానులకు తెలియపరచకుండా తాను వివాహం చేసుకోబోనని ప్రభాస్ అంటున్నారు. అనుష్క‌తో పెళ్లి వార్త‌ల‌పై ప్రభాస్‌ తాజాగా స్పందించారు. తన వివాహానికి సరైన సమయం ఏంటో చూసి చెబుతానని వెల్లడించారు. రహస్యంగా వివాహం చేసుకునే ఆలోచన లేదని ఒకవేళ అలా జరిగినా అభిమానులకు మాత్రం చెప్పకుండా చేయనని అన్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ చిత్రం షూటింగ్‌లో బిజీగాRead More


పరిణయానికి అనుష్క..

జేజమ్మ సిద్ధం అవుతోంది. పరిణయానికి సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయకిగా రాణిస్తున్న అనుష్క పెళ్లికి ఏర్పాట్లు సాగుతున్నట్టు ప్రచారం మొదలయ్యింది. ఈ బ్యూటీకి త్వరలో పెళ్లి చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమచాారం. ఇదివరకే అనుష్క పెళ్లిపై చాలా వదంతులు ప్రచారం అవుతూ వచ్చాయి. అందులో నటుడ ప్రభాస్‌తో ప్రేమాయణం అనీ, త్వరలో ఆయన్ని పెళ్లి చేసుకోనుందంటూ వదంతులు హోరెత్తాయి. అనుష్కను ప్రభాస్‌ పెళ్లి చేసుకోవడానికి ఆయన కుటుంబసభ్యులు అంగీరించలేదనే ప్రచారం కూడా జరిగింది. కాగా అనుష్క మంచి స్నేహితురాలు మాత్రమే అని ఇటీవల ప్రభాస్‌ స్పష్టం చేశారు. ఇంతకాలం చిత్రాలతో బిజీగా ఉన్న అనుష్క ఆ సాకుతో పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు. జాతక దోషం ఉందని జ్యోతిష్కులు చెప్పడంతో దోషం నివారణ కోసం ఇటీవల అనుష్కతో దైవRead More


అనుష్క గురించి ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్

బాహుబలి జంట ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. వారిద్దరి పెళ్లి గురించి చర్చ మొదలయిన తర్వాత జేజమ్మ వ్యవహారం మరింత చర్చనీయాంశం అవుతోంది. ఇద్దరూ చివరకు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారోననే ఆసక్తి కనిపిస్తోంది. అందులోనూ బాలీవుడ్ అనుష్కను కోహ్లీ మనువాడిన నేపథ్యంలో టాలీవుడ్ అనుష్క కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా ప్రభాస్ పెదనాన్న క్రుష్ణంరాజు కూడా ప్రభాస్ ఎవరినీ చెప్పినా పెళ్లి చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని చెప్పేయడం అందుకు తోడ్పడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అనుష్క గురించి ప్రభాస్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ని జోష్ లో ముంచుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’లో బిజీగా ఉంటే, అనుష్క ‘భాగమతి’ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటోంది. తాజాగా అనుష్క సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఆ వెంటనే ప్రభాస్ ప్రత్యక్షమయ్యాడు.Read More


సైనాకి అనుష్క కానుక..

సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ షిప్ లో ఇటీవల విజయం సాధించిన ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ కు బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రత్యేక కానుక పంపారు. ‘నుష్’ పేరుతో టెక్స్ టైల్ వ్యాపార రంగంలోకి అనుష్క అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమ సంస్థకు చెందిన కొన్ని వస్త్రాలను అందమైన ప్యాక్ లో ఉంచి వాటిని కానుకగా సైనాకు పంపారు. ఈ విషయాన్ని సైనా తన ట్విట్టర్లో తెలిపారు. ‘అనుష్క శర్మకు ధన్యవాదాలు. ఈ దుస్తువుల‌ను త్వరలోనే ధరిస్తా. ‘నుష్’ సంస్థ ద్వారా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన మీకు శుభాకాంక్షలు’ అని సైనా తన ట్వీట్ లో పేర్కొన్నారు.


అతనంటే పిచ్చి..ప్రేమలో పడ్డానంటున్న అనుష్క

జేజమ్మ ప్రేమలో పడింది. ఆ విషయం కూడా బ్యూటీ స్వీటీ శెట్టి స్వయంగా ప్రకటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలు సంచలనంగా మారాయి. తన ప్రేమ గురించి ఆమె చెప్పిన విషయం విశేషంగా మారింది. ఇప్పటికే అనుష్క ప్రేమకు సంబంధించి పలు రకాల కథనాలు వచ్చాయి. ఆమె పెళ్లి గురించి కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె చేసిన ప్రకటన ఆసక్తిగా మారుతోంది. ద‌క్షిణాదిన లేడీ ఓరియెంటెడ్ సినిమాల ట్రెండ్‌ను మళ్లీ ట్రాక్ లోకి తెచ్చిన ఘనత అనుష్కదే. అలాంటి అనుష్క తాజాగా ప్రేమ గురించి చెప్పిన మాటలు ఓ క్రికెటర్ గురించి కావడం విశేషం. ఆమె సొంత రాష్ట్రానికే చెందిన స్టార్ బ్యాట్స్ మెన్ పై ప్రేమను ఆమె వ్యక్తం చేయడం విశేషం. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో అనుష్క త‌నకుRead More


కోహ్లీ కోసం లంకలో అనుష్క

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ శ్రీలంకలో సందడి చేస్తున్నారు. కొంత మంది అభిమానులతో కలిసి వారు తీయించుకున్న ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. కోచ్ రవి శాస్ర్తీ కూడా వారితో ఉండడంతో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. విదేశీ టూర్ల సమయంలో ఆటగాళ్ల వెంట వారి భార్యలు లేదా గర్ల్‌ఫ్రెండ్స్ ఉండరాదన్న నిబంధనను కోహ్లీ పట్టించుకోవడం లేదు. అతను ఎక్కడికి వెళ్లినా అనుష్క అక్కడ ప్రత్యక్షం కావడం చాలాకాలంగా జరుగుతునే ఉంది. తాజాగా ఈ ప్రేమ జంట లంకలోనూ కనువిందు చేస్తున్నది.


అనుష్క ఐటెమ్ గ‌ర్ల్

బాహుబ‌లి త‌ర్వాత అనుష్క చాలా ఆఫ‌ర్ల‌కు దూరంగా ఉంది. ప్ర‌భాస్ తో ఐదో సారి జ‌త‌క‌డుతుంద‌నే వార్త‌లు వచ్చినా ఇంకా ఊగిస‌లాట‌లోనే ఉంది. దాంతో ప్రస్తుతం అనుష్క చేతిలో ‘భాగ్‌మతి’ ఒక్కటే ఉంది. ఇక చిరంజీవి 151వ చిత్రంలో నటించేందుకు అంగీకరించింది. దాంతో ఉయ్యాలవాడ‌లో అనుష్క మ‌రోసారి చారిత్ర‌క పాత్ర‌లో సంద‌డి చేసే అవ‌కాశం ఉంది. గ‌తంలో ‘ఖైదీ నంబర్‌ 150’లో చేయాలని అభ్యర్థించినా డేట్స్‌ ఖాళీ లేవని ఆ ఆఫర్‌ను తిరస్కరించింది. అంతేగాకుండా మరోసారి మహేష్‌ బాబుతో మెప్పించబోతుందట. వీరిద్దరూ కలిసి ‘ఖలేజా’తో ఆకట్టుకొన్నారు. కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో మిర్చి సినిమా కూడా చేసిన సంగ‌తి తెలిసిందే. మళ్లీ ఆ ఇద్దరూ మరోసారి తెరపై సందడి చేయబోతున్నారని తెలిసింది. పూర్తి స్థాయి కథానాయికగా కాకుండా ఓ ప్రత్యేక గీతంలో చేయబోతుందట. ఆ చిత్రమే మహేష్‌, కొరటాల శివRead More


ప్ర‌భాస్ తో అనుష్క అనుమాన‌మే..!

బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ కోసం హీరోయిన్ ఫైనల్ కాలేదు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‌గా పలువురు పేర్లు వినిపిస్తున్నాకూడా ఇంతవరకు ఎవరు ఫైనల్ కాకపోవటం విశేషం. సుజీత్ దర్శకత్వంలో 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకోసం బాలీవుడ్ హీరోయిన్స్‌ను ప్రయత్నిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు కాబట్టి బాలీవుడ్ భామ అయితే బెటర్ అనే ఆలోచనలో వున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపించినప్పటికీ అనుష్క ఫైనల్ అయిందంటూ వార్తలు వచ్చాయి. బాహుబలి తరువాత మళ్లీ అనుష్క ప్రభాస్‌తో నటిస్తుందని అనుకున్నారు కానీ ఈ సినిమాలో ఆమె నటించడం లేదట. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్స్ గురించే గట్టిగా ప్రయత్నిస్తున్నారని టాక్? అనుష్క ఆసక్తిగా వున్నా కూడా ఆమెను తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపడం లేదని, హిందీ మార్కెట్‌లోకిRead More