andhrapradesh

 
 

బీజేపీ ఎదురుదాడి ఫ‌లిస్తుందా…?

bjp

ఏపీలో క‌మ‌ల‌నాధులు తీవ్రంగా క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. నాలుగేళ్ల క్రితం క‌ళ‌క‌ళ‌లాడిన క్యాంప్ ఇప్పుడు తీవ్రంగా క‌ల‌త చెందుతోంది. అస‌లు ఏం జ‌రుగుతుందో తెలియ‌క స‌త‌మ‌తం అవుతోంది. ఏపీలో దాదాపు అన్ని పార్టీలు త‌మ‌నే టార్గెట్ చేశాయ‌ని వాపోతోంది. తాము ఎంతో చేస్తున్నప్ప‌టికీ, ప్ర‌చారం మాత్రం చంద్ర‌బాబు కొట్టేసి, త‌మ‌ను బ‌ద్నాం చేస్తున్నార‌ని బాధ‌ప‌డుతోంది. దాంతో భ‌విష్య‌త్తు మీద కాషాయి శ్రేణులు బెంగ పెట్టుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ముఖ్యంగా గ‌డిచిన ఎన్నిక‌ల‌కు ముందు త‌మ‌తో చేరిన ప‌లు త‌ర‌గ‌తులు దూరం అవుతున్నాయ‌ని ఆందోళ‌న చెందుతోంది. యువ‌త‌లో ఇప్ప‌టికే బీజేపీ ప‌రువు గంగ‌లో క‌లిసి పోయింది. ప‌ట్ట‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తిలో బీజేపీ మీద ఆశ‌లు జావ‌గారి ఆగ్ర‌హం మొద‌ల‌వుతోంది. దాంతో ఇత‌ర పార్టీల నుంచి చేరిన నేత‌లు కూడా గోడ‌దూకే అవ‌కాశాలున్నాయ‌ని భావిస్తోంది. వారిని నిల‌బెట్టుకోవ‌డం, త‌మ ఉనికిని కాపాడుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా భావిస్తోంది. ఇప్ప‌టికేRead More


బాబుకి బూమరాంగ్ అయ్యింది…!

cbn tdp polit

తెలుగుదేశం అధినేత ఆశలు పండడం లేదు. పైగా ఎన్నిరకాల ఎత్తులేసిన చిత్తవుతున్నాయి. అంతకుమించి బూమరాంగ్ అవుతున్నాయి. దాంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి టీడీపీది. చివరకు ఎంతో హడావిడి చేసి, తాడోపేడో అని మీడియాకు లీకులిచ్చి ఆఖరిలో ఫోన్ కాల్ తో మెత్తబడక తప్పని పరిస్థితి వచ్చింది. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులను తీవ్రంగా నిరాశపరిచింది. రాజకీయ పరిశీలకులకు పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోయినా బాబు తీరు మరీ ఇంతగా పతనమవుతున్న పరిస్థితి విశేషంగా చెబుతున్నారు. తెలుగుదేశం , బీజేపీ సంబంధాలకు చాలాకాలంగా సమస్యలు వస్తున్నాయి. దానికి బడ్జెట్ ఆజ్యం పోసింది. ఇక రాంరాం చెప్పక తప్పదనే వాదన బయలుదేరింది. చంద్రబాబు కూడా అలాంటి సంకేతాలు ఇచ్చారు. కొందరు ఎంపీలు రాజీనామాకు సిద్ధపడ్డారు. మంత్రులు దూరం కావాలని సూచనలు వచ్చాయి. అన్నింటినీ కలిపి ఓ కొలిక్కి తీసుకురావడంలో భాగంగాRead More


బాబుకి వ్రతం చెడ్డా ఫలితం దక్కుతుందా..?

CHANDRABABU

ఏపీ సీఎం చంద్రబాబు కాపులకు కేటాయించిన రిజర్వేషన్లు కలకలం రేపుతున్నాయి. భిన్న స్పందనలు లభిస్తున్నాయి. టీడీపీ సానుకూల కాపులలో కొంత సానుకూల స్పందన వస్తోంది. అదే సమయంలో విపక్ష సానుభూతి పరులు, మధ్యస్తంగా ఉండే వారు మాత్రం పెదవి విరుస్తున్నారు. దాంతో చంద్రబాబు అసలు లక్ష్యం ఏమేరకు నెరవేరుతుందన్నది సందేహంగా ఉంది. ఇప్పటికే ముద్రగడ తమ కులస్తుల సంఖ్యను తక్కువ చూపించి కేవలం 5శాతమే రిజర్వేషన్లు కేటాయించడం అమోదయోగ్యం కాదన్నారు. కోటి మంది ఉన్న కాపులను కేవలం 50లక్షల మందిగా చెప్పడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేగాకుండా 9వ షెడ్యూల్ పెట్టనంత వరకూ ఈ ప్రకటనల వల్ల ప్రయోజనం ఉండదని, అది జరిగితేనే తమకు నిజమైన దీపావళి అంటూ వ్యాఖ్యానించారు. ఇక సాధారణ కాపుల్లో కూడా రాజకీయ రిజర్వేషన్లు లేవని, విద్యా, ఉపాది రంగాలకుRead More


సాంబశివరావుకి ఛాన్స్ వస్తుందా..

dgp samabasivarao ips

డిజీపీ పదవీ కాలం కొనసాగింపు విషయంలో కేంద్రం కొర్రీలు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికే రెండు మార్లు చంద్రబాబు సర్కారు పంపిన ప్రతిపాదనలు తప్పిపంపారు. స్వయంగా చంద్రబాబు వెళ్లి రాజ్ నాథ్ సింగ్ ని కలిసి విన్నవించిన తర్వాత కూడా ఫలితం మారలేదు. రెండోసారి పంపించిన ప్రతిపాదనలను వెనక్కి పంపించి ప్రత్యామ్నాయం ఆలోచించాలని కోరడంతో కలకలం రేగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నేపథ్యంలో డీజీపీగా సాంబశివరావుని నియమించాలంటూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా లేదా అన్న సందేహం కలుగుతోంది డిజిపి నియామకంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఉన్నతాధికారి ఎంపికకు బుధ వారం ఢిల్లీలో జరగాల్సిన సమా వేశం వాయిదా పడింది. నవంబరు మొదటి వారంలో రాష్ట్రం పంపిన ఐపిఎస్‌ జాబితాలో కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేసే ప్రస్తుత ఇన్ఛార్జిRead More


సోషల్ మీడియాపై చంద్రబాబు కన్ను…

DO6VyfFVoAMHVAK

ఇప్పటికే రాజకీయ పార్టీలు సోషల్ మీడియాకు ప్రాధాన్యత పెంచుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా తన విధానాల ప్రచారానికి తగ్గట్టుగా సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. దానిలో భాగంగా ఇప్పటికే అధికార పార్టీ తన శ్రేణులకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. దానికి తోడుగా ప్రభుత్వం తరుపున రెండు రోజుల సోషల్ మీడియా సమ్మిట్ కి శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియాను వినియోగించుకోవడం కోసమంటూ నిర్వహించిన ఈ కార్యక్రమం దాదాపుగా అధికార పార్టీ సొంత వ్యవహారంలా మార్చేశారన్న విమర్శలున్నప్పటికీ తొలిసారిగా ఇలాంటి ప్రయత్నం అభినందనీయమే. పలువురు సోషల్ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి అఖిల ప్రియ మాట్లాడుతూ ఆధునిక కాలంలో మీడియానే కీలక పాత్ర పోషిస్తోందని, సమాజంలోRead More


బాబు వల్ల కాదంటున్న జేసీ

07-1452146317-jc-diwakar-reddy-678-09-1457519530

అనంతపురం ఎంపీ మరోసారి ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. తమ అధినేత తీరు మీద పెదవి విరిచారు. ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని కుండబద్ధలు కొట్టేశారు. దాంతో మళ్లీ తెరమీదకు వచ్చిన పునర్విభజన సహా పోలవరం వంటి అంశాల్లో ఏపీ ప్రభుత్వ పెద్దల అంచనాలకు, వాస్తవాలకు పొంతనేలేదని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేయడం విశేషం. ఇటీవల చంద్రబాబు హస్తిన పర్యటన సందర్భంగా రాష్ట్రంలో ప్రజా సమస్యల కన్నా ప్రధానంగా ప్రస్తావించింది నియోజకవర్గాల పునర్విభజన. వచ్చే ఎన్నికల్లో తాను గట్టెక్కాలంటే అన్నింటికన్నా అదే కీలకాంశంగా చంద్రబాబు భావిస్తున్నారు. దాంతో ఆ విషయం మీద కేంద్రం ముందు మరోసారి ప్రస్తావించినట్టు కనిపిస్తోంది. కానీ అది జరిగే పని కాదని జేసీ తేల్చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునిర్విభజన జరగదని స్పష్టం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అదిRead More


జగన్ యాత్రలో కొత్త మలుపు…!

jagan11509963809

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు పాదయాత్ర చేయడం ఆనవాయితీగా మారింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభిస్తే దానిని చంద్రబాబు అందిపుచ్చుకున్నారు. ఇఫ్పుడు వైఎస్ జగన్ వరుసగా మూడో ప్రతిపక్ష నాయకుడిగా అదే బాటలో సాగుతున్నారు. ప్రజాసంకల్పం అంటూ ఆయన ప్రారంభించిన యాత్రకు మంచి స్పందనే వస్తోంది. ముఖ్యంగా వివిద వర్గాలతో విపక్ష నేత విడిగా సమావేశం కావడానికి దోహదపడుతోంది. వారికిస్తున్న హామీలకు కూడా మంచి ప్రతిస్పందన దక్కుతోంది. కానీ పీఠం ఎక్కిన తర్వాత వాటిని అమలు చేయడం సాధ్యమేనా అన్న సందేహం వినిపిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం జగన్ కి ఇన్నాళ్లుగా తనకు దూరంగా ఉన్న వర్గాలను దగ్గర చేసుకోవడానికి పాదయాత్ర హామీలు దోహదపడేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీపీఎస్ రద్దు లాంటి హామీ పెద్ద ప్రభావం చూపడం ఖాయంగా ఉంది. పెన్షన్లు పెంచడం సహా ఇతర హామీలు వర్కవుటు కావచ్చనేRead More


బాధ్యతల నుంచి తప్పుకుంటానంటున్న మంత్రి

kamineni

ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవి నుంచి తప్పుకోవడానికి సిద్దమంటూ వ్యాఖ్యానించి ఆశ్చర్యం రేకెత్తించారు. మంత్రి ఆవేశంగా చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి పరిణామాలతో ఆయన మనస్తాపం చెందినట్టు కనిపిస్తోంది. తీవ్రంగా కలత చెందిన ఆయన తన మంత్రి పదవిని సైతం వదులుకోవడానికి అభ్యంతరం లేదంటూ వ్యాఖ్యానించారు. తాను ఎంతో బాధ్యతగా వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని, అయినప్పటికీ వైద్య, ఆరోగ్యశాఖపై ఇటీవల తరచూ ఆరోపణలను గుప్పిస్తున్నారని మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. వైద్యారోగ్యశాఖపై చేసిన ఆరోపణలు రుజువైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. ఈ టెండర్ల ద్వారానే నిర్మాణ పనులు గుత్తేదార్లకు అప్పగిస్తున్నామన్నారు. ఉద్యోగాల భర్తీ, పదోన్నతులను పారదర్శకంగానే నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కష్టపడి పనిచేస్తున్నప్పటికీ నాపై నిందలుRead More


చంద్ర‌బాబుకి నో అంటున్న రాజ‌మౌళి

Making Mahabharata into a movie is my dream, says SS Rajamouli

బాబు ఆశ‌ల‌కు, జ‌క్క‌న్న అంచ‌నాల‌కు చాలా వైరుధ్యం క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు ఆశిస్తున్న దానికి భిన్నంగా ద‌ర్శ‌క‌ధీరుడి తీరు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే రాజ‌మౌళి స్పందించారు. ఏపీ సీఎం కోరుకున్న వ్య‌వ‌హారం త‌న‌వ‌ల్ల కాద‌ని చెప్పుకొచ్చారు. దాంతో ఇప్పుడు అటు సినీ, ఇటు రాజ‌కీయ రంగాల్లో ఇది పెద్ద చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి న‌గ‌ర నిర్మాణం ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌త లేదు. డిజైన్ల వ్య‌వ‌హార‌మే తేల‌లేదు. ఇప్ప‌టికే ఏడు మార్లు శంకుస్థాప‌న‌లు, మూడు సార్లు డిజైన్లు ప్ర‌క‌టించినా అవ‌న్నీ జ‌నాల‌ను సంతృప్తి ప‌ర‌చ‌లేక‌పోయాయి. పైగా ప‌లు సందేహాలు క‌లిగించాయి. దాంతో చివ‌ర‌కు సీఎం చంద్ర‌బాబు డిజైన్ల వ్య‌వ‌హారాన్ని సినీ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి అప్ప‌గించే ప్ర‌య‌త్నం ప్రారంభించారు. ఇప్ప‌టికే అధికారుల మీద కాస్త అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించిన ఆయ‌న బాహుబ‌లి ద‌ర్శ‌కుడి స‌ల‌హాలు తీసుకోవాల‌ని సూచించారు. రాజ‌ధాని నిర్మాణంలో కీల‌క‌మైన భ‌వనాలRead More


ముద్రగడ మాట మార్చేశారా

mudragada

ముద్రగడ పద్మనాభం. కాపు ఉద్యమ నేత. ఏపీ రాజకీయాల్లో టీడీపీకి తలనొప్పిగా మారిన నాయకుల్లో ఒకరు. గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న కాపు సామాజికవర్గంలో ఇప్పుడు చంద్రబాబు పట్ల తీవ్ర వ్యతిరేకతను రాజేయడంలో ముద్రగడ విజయవంతమయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో కాపులు దాదాపుగా టీడీపీకి దూరమయ్యారు. దాని ప్రభావం కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో కనిపించే అవకాశం కొంతవరకూ ఉంది. వాస్తవానికి నంద్యాల ఫలితాల ప్రభావం లేకపోతే కాకినాడలో కాపులు టీడీపీకి కాక పుట్టించే వారే. కానీ నంద్యాల మూలంగా కాపులు కొంత చల్లబడ్డారు. ఇక తాజాగా ముద్రగడ అనుకున్నట్టుగానే పాదయాత్ర ప్రారంభించారు. కానీ అనూహ్యంగా విరమించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. వాస్తవానికి ముప్పై ఐదు రోజుల పాటు పోలీసులను ఆయన ముప్పుతిప్పలు పెట్టారు. చివరకు ఖాకీలు కాస్త ఏమరపాటు ప్రదర్శించగానే పాదయాత్ర ప్రారంభించేసిRead More