Main Menu

ANDHRA PRADESH

 
 

చేతులెత్తేసిన చంద్ర‌బాబు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. ఓవైపు కాంగ్రెస్ తో క‌ల‌వ‌డానికి ఆయ‌న ఆస‌క్తి చూపుతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతున్న త‌రుణంలో తెలంగాణా ఎన్నిక‌ల ప్ర‌చారానికి తాను దూరంగా ఉండ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. త‌ద్వారా ఎన్నిక‌ల‌కు ముందే జాతీయ పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న ఆయ‌న పార్టీ భ‌విష్య‌త్తుని గాలికొదిలేసిన‌ట్టేనా అన్న ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి. తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తు విష‌జ్ఞంలో కూడా చంద్రబాబు ఆచితూచి అడుగులేస్తున్నారు. నేరుగా పొత్తు పెట్టుకుంటే అది ఏపీలో త‌న పుట్టి ముంచుతుంద‌న్న ఆందోళ‌న చంద్ర‌బాబులో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఏపీ ప్ర‌యోజ‌నాలే త‌న‌కు ముఖ్యంగా కాబ‌ట్టి నిర్ణ‌యం త‌నకు త‌గ్గ‌ట్టుగా ఉండేలా చూసుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. తెలంగాణాలో ఎన్నిక‌ల పొత్తు విష‌యంలో టీటీడీపీదే నిర్ణ‌యం అన్న‌ట్టుగా చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో కేసీఆర్ మీద విమ‌ర్శ‌లు చేయ‌డానికి కూడా సిద్ధ‌ప‌డ‌క‌పోవ‌డం విశేషం. అదే స‌మ‌యంలో నేరుగా పొత్తులుRead More


కేసీఆర్ న‌మ్మినా…చంద్ర‌బాబు న‌మ్మ‌డం లేదు!

తెలంగాణా సీఎం కేసీఆర్ పెట్టిన ప‌రీక్ష ఇప్పుడు ఆంధ్ర‌ప్రదేశ్ అధికార ప‌క్షాన్ని అత‌లాకుతలం చేసేలా ఉంది. సీట్ల కేటాయింపు విష‌యంలో కేసీఆర్ చేస్తున్న సాహ‌సం చంద్ర‌బాబుకి చిక్కులు తెచ్చిపెట్టేలా క‌నిపిస్తోంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల విష‌యంలో కేసీఆర్ ధైర్యంగా ముంద‌డుగు వేశారు. కొంద‌రి మీద వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ వెన‌కాడ‌లేదు. కేవ‌లం ఇద్ద‌రంటే ఇద్ద‌రిని మాత్ర‌మే త‌ప్పించారు. త‌న‌ను చూసి ఓటేస్తారని, తాను చేసిన కార్య‌క్ర‌మాలే మ‌ళ్లీ గెలిపిస్తాయ‌ని ఆయ‌న న‌మ్ముతున్నారు. అదే మాట అంద‌రికీ చెబుతున్నారు. అదే స‌మ‌యంలో ఏపీలో చంద్రబాబు తీరు ఎలా ఉంటుందోన‌నే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. కేసీఆర్ మాదిరిగా చంద్రబాబుకి ధైర్యం ఉందా అన్న ప్రశ్న వినిపిస్తోంది. సిట్టింగుల‌ను కొన‌సాగించి, త‌న‌ను చూసి ఓటేయ‌మ‌ని అడ‌గ‌గ‌ల ద‌మ్ముందా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ప‌లువురు తీవ్ర వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇసుక‌, మ‌ట్టిRead More


ఆ స్థానాల్లో బాగోలేదంటున్న చంద్ర‌బాబు!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యానికి పార్టీ శ్రేణుల‌ను స‌మాయ‌త్తం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు క‌దులుతున్నారు. ఇప్ప‌టికే బూత్ లెవెల్ క‌మిటీల‌కు శిక్ష‌ణ ఏర్పాటు చేసి, మొబైల్ ఫోన్లు పంపిణీ చేస్తున్న తెలుగుదేశం, తాజాగా నియోజ‌క‌వ‌ర్గాల కోఆర్డినేట‌ర్లు, రాష్ట్ర నేత‌ల‌తో స‌మావేశం నిర్వహించింది. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌కాంశాల‌ను చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. ముఖ్యంగా టీడీపీ ప‌రిస్థితి గురించి ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం ఏపీలోని 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు గానూ కేవ‌లం 100 చోట్ల మాత్ర‌మే పార్టీ ప‌రిస్థితి స‌జావుగా ఉంద‌ని ఆయ‌న ఓ నివేదిక ప్ర‌వేశ‌పెట్టిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. మ‌రో 40 చోట్ల పార్టీ ప‌రిస్థితి బాగోలేద‌ని ఆయ‌న అంగీక‌రించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ముఖ్యంగా టీడీపీ నేత‌ల మ‌ద్య స‌ఖ్య‌త లేక‌పోవ‌డం పెద్ద స‌మ‌స్య‌గా మార‌డంతో 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి అన‌నుకూలంగా ఉంద‌ని పార్టీ అధినేతRead More


సీఎంకి సొంత జిల్లాలోనే చిక్కులు

వ‌చ్చే ఎన్నిక‌ల కోసం అన్ని పార్టీలు వ్యూహాలు ర‌చిస్తున్నాయి. టీడీపీ కూడా ఓ అడుగు ముందుకేసి బూత్ క‌మిటీ స‌భ్యుల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తోంది. పార్టీ నేత‌ల‌కు సెల్ ఫోన్లు కూడా పంచుతున్నారు. అయితే చంద్ర‌బాబు సొంత జిల్లాలో మాత్రం టీడీపీ ప‌రిస్థితి ఢోలాయ‌మానంలో క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క్లారిటీ క‌నిపించ‌డంక‌పోవ‌డంతో టీడీపీలో చిక్కులు త‌ప్ప‌డం లేదు. దాదాపుగా జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల విష‌యంలోనూ తెలుగుదేశం పార్టీకి త‌ల‌నొప్పులు త‌ప్ప‌డం లేదు. సిట్టింగుల విష‌యంలోనే స్ప‌ష్ట‌త రాక‌పోతే ఇక కొత్త వాళ్ల ప‌రిస్థితి ఎలా ఉంటుందోన‌నే అభిప్రాయం వినిపిస్తోంది. గ‌డిచిన కొన్నేళ్లుగా సొంత జిల్లాలో మెజార్టీ సాధించ‌లేక చంద్ర‌బాబు చ‌తికిల‌ప‌డుతున్నారు. దాంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ్యూహాత్మ‌కంగా సాగాల‌ని ఆశిస్తున్నారు. అయితే ప‌రిస్థితి దానికి భిన్నంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం జిల్లాలో తాము ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సీట్ల‌లో స‌మ‌స్య‌లున్నాయంటూRead More


రెచ్చిపోయిన పోలీస్ అధికారి

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ అంత‌లో మ‌రో వివాహేత‌ర సంబంధానికి సిద్ధ‌మ‌య్యాడు. చివ‌ర‌కు సొంత భార్యే అనుమానించే ద‌శ‌కు చేరాడు. ఆఖ‌రికి విడాకుల‌కు సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో మ‌రోసారి త‌గాదాకి దిగి తాను ఖాకీన‌నే విష‌యం మ‌ర‌చి ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన అధికారి కూడా విచ‌క్ష‌ణ మ‌రిచాడు. భార్య‌పై విరుచుకుప‌డి కర్క‌శం ప్ర‌ద‌ర్శించాడు.. దాంతో మ‌ణుగూరు ఎస్ ఐ వ్య‌వ‌హారం వివాదాస్ప‌దంగా మారుతోంది. భార్య ప‌ర్వీనాపై మణుగూరు ఎస్సై జితేందర్ రెచ్చిపోయిన వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. జితేందర్‌కు వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న పర్వీనా.. కొంత కాలంగా అతనికి దూరంగా ఉంటోంది. దీంతో జితేందర్.. పర్వీనాకు విడాకులు ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ విషయంపై జితేందర్‌తో పర్వీనా గొడవకు దిగింది. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్సై జితేందర్.. పర్వీనాను, ఆమె తల్లిని విచక్షణా రహితంగా కొట్టాడు. దాంతో ఎస్ ఐపైRead More


పొత్తుపై టీడీపీలో ట్విస్ట్: అస‌లు క‌థ‌..!

ఏపీ రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు అనేక ఎత్తుగ‌డ‌ల విష‌యంలో మితిమీరిన అనుభ‌వం ఉన్న నేత‌. అనేక అంశాల్లో ఇప్ప‌టికే అది రుజువ‌య్యింది. ముఖ్యంగా అవ‌స‌రార్థం పార్టీల‌తో జ‌త‌గ‌ట్టే సంద‌ర్భంలో అన్ని జాగ్ర‌త్త‌లు పాటించ‌డంలో ఆయ‌న ఆరితేరారు. అందుకు త‌గ్గ‌ట్టుగా జ‌నాభిప్రాయాన్ని మ‌ల‌చ‌డంలో ఆయ‌న‌కు మీడియా మ‌ద్ధ‌తు బ‌లంగా ఉండ‌డంతో బాబు వేసే ప్ర‌తీ అడుగుకి అండ‌దండ‌లు సులువుగానే ల‌భిస్తుంటాయి. తాజాగా కాంగ్రెస్ విష‌యంలో కూడా అదే జ‌రుగుతోంది. బీజేపీని పూర్తిగా బ‌ద్నాం చేయ‌డం ద్వారా బాబు చెబుతున్న‌ట్టుగానే కాంగ్రెస్ పై వ్య‌తిరేక‌త బీజేపీకి బ‌దిలీ అయ్యింది. త‌ద్వారా కాంగ్రెస్ కి కొంత ఊర‌ట ల‌భిస్తోంది. దానిని స‌ద్వినియోగం చేసుకునే ప‌నిలో చంద్ర‌బాబు ఉన్నారు.కాంగ్రెస్ కి పెరిగిన క‌వ‌రేజ్, రాహుల్ గాంధీకి ల‌భిస్తున్న తెలుగు మీడియా ఆద‌ర‌ణ గ‌మ‌నిస్తే టీడీపీ-కాంగ్రెస్ పొత్తు విషయంలో జ‌నాల‌ను స‌న్న‌ద్ధం చేసే ధోర‌ణి క‌నిపిస్తోంది.Read More


ఏపీలో మ‌రో మ‌హాకూట‌మి!

ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. కొత్త పొత్తుల‌కు పార్టీలు స‌మాయ‌త్త‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా రాజ‌కీయంగా త‌న చ‌రిత్ర‌లో ఎన్న‌డూ ఒంట‌రిగా పోటీ చేసిన అనుభ‌మే లేని టీడీపీ వ‌చ్చే ఎన్నికల్లో కూడా అదే ప‌రంప‌ర కొన‌సాగిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగా కొత్త మిత్రుడిని సంపాదించిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో క‌లిసి పోరు సాగించాల‌ని టీడీపీ నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో పొత్తుల విష‌యంపై చంద్ర‌బాబుకే అధికారం అప్ప‌గిస్తూ టీడీపీ నిర్ణ‌యం తీసుకుంది. త‌ద్వారా కాంగ్రెస్ తో క‌ల‌యిక‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. బీజేపీకి దూర‌మ‌యిన టీడీపీ ఏపీలో పొత్తుల విష‌య‌మై సుదీర్ఘంగా క‌స‌ర‌త్తు చేసింది. కాంగ్రెస్ తో చేతులు క‌ల‌ప‌డ‌మే కాకుండా బీఎస్పీని ద‌గ్గ‌ర చేర్చుకుంటోంది. ఆపార్టీతో కూడా మితృత్వానికి మొగ్గు చూపుతోంది. ఇక అవ‌కాశం ఉంటేRead More


చంద్ర‌బాబు ముంద‌స్తు స‌న్నాహాలు

ఎన్నిక‌ల వాతావ‌ర‌ణ ముంచుకొస్తోంది. అన్ని పార్టీలు స‌న్నాహాల్లో క‌నిపిస్తున్నాయి. తెలంగాణాలో ఏకంగా అసెంబ్లీ ర‌ద్దు అయ్యే అవ‌కాశాలున్నాయంటూ అధికార పార్టీ లీకులిస్తోంది. క్యాబినెట్ ని ర‌ద్దు చేసేందుకు కేసీఆర్ స‌న్న‌ద్ధం చేసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడా ఎన్నిక‌లు అనివార్య‌మ‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. తాజాగా ఏపీ సీఎం కూడా టీడీపీ నేత‌ల ముందు ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. షెడ్యూల్ ప్ర‌కార‌మే ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని ఆశిస్తున్నామ‌ని, అయితే డిసెంబర్ లో ఎన్నిక‌లు జ‌రిగినా దానికి త‌గ్గ‌ట్టుగా స‌న్న‌ద్ధం కావాల‌ని ఆదేశించారు. డిసెంబ‌ర్ నాటికి అటు ప్ర‌భుత్వ ప‌రంగానూ, పార్టీ ప‌రంగానూ సిద్దంకావాల‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించ‌డం వెనుక కార‌ణాలు ఆస‌క్తిగా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప‌లు వ‌రాలు ప్ర‌క‌టించింది. మ‌రిన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునే రీతిలో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు సిద్ధ‌మ‌వుతోంది. నిరుద్యోగ భృతి స‌హా ప‌లు ప‌థ‌కాలుRead More


లోకేష్ జెండావంద‌నంపై విమ‌ర్శ‌లు

ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి మంత్రి. ఏపీ మంత్రులంతా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జెండా వంద‌నం చేశారు. జిల్లా కేంద్రంలో అవ‌కాశం రాని మంత్రులు కూడా జెండావిష్క‌ర‌ణ‌లో పాల్గొన్నారు. అయితే ఏపీకి మంత్రిగా ఉన్న నారా లోకేష్ మాత్రం తెలంగాణాలో జెండావంద‌న నిర్వ‌హించ‌డం విశేషంగా మారింది. వివాదంగా మారుతోంది. కొంద‌రు అభ్యంత‌రం కూడా వ్య‌క్తం చేస్తుండ‌డం విశేషం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఓట‌రుగా ఉండి, రాజ‌ధానిని కూడా ఏపీ అభివృద్ధి కోసం అమ‌రావ‌తికి త‌ర‌లించామ‌ని చెప్పుకుంటున్న సీఎం త‌న‌యుడు నారా లోకేష్ మాత్రం విశేషంగా హైద‌రాబాద్ లోని సొంత ఇంట్లో జెండా వంద‌నం చేశారు. కేవ‌లం త‌న భార్య‌, కుమారుడితో క‌లిసి జెండావిష్క‌ర‌ణ చేసి, పోలీసుల గౌర‌వ‌వంద‌నం స్వీక‌రించారు. పైగా కుటుంబ‌మంతా క‌లిసి గౌర‌వ వంద‌న స్వీక‌రించ‌డం కూడా విడ్డూరంగా ఉంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కీల‌క‌మైన గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగాRead More


బ్రాహ్మ‌ణి స్థానంలో భార‌తి అయితే..!

ఏపీ రాజ‌కీయాల్లో మీడియా పాత్ర బాగా మిళితం అయిపోయింది. రాజ‌కీయ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా మీడియా యాజ‌మాన్యాలు స్పందించే ధోర‌ణి పెరిగింది. త‌మ‌కు ఇష్ట‌మ‌యిన పార్టీ, నేత‌లు ఏమి చేసినా చూస్తూ ఉండ‌డం, త‌మ‌కు గిట్ట‌ని వారిపై ఒంటికాలితో లేవ‌డం అల‌వాటుగా మారింది. తాజాగా ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ భార్య వ్య‌వ‌హారం దానికో ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. భార‌తీ సిమెంట్ వ్య‌వ‌హారంలో ఆమె పాత్ర మీద ఈడీకి అభ్యంత‌రాలు క‌నిపించాయి. కోర్టులో పిటీష‌న్ వేశారు. దానికి కోర్టు నుంచి ఇంకా అంగీకారం రాలేదు. ఆమెను కూడా కేసులో ప్ర‌తివాదిగా చేర్చే అంశంలో కోర్టు నుంచి స్ప‌ష్ట‌త రాలేదు. ఈడీ కూడా అందుకు వేచి చూస్తోంది. కానీ తెలుగుమీడియాలో క‌థ‌నాలు రెచ్చిపోయాయి. జ‌గ‌న్ భార్య‌ను కూడా దాదాపుగా దోషిని చేసిన‌ట్టుగానే వార్త‌లు వండేశారు. ఈ సీన్ క‌ట్ చేస్తే ఏపీలోRead More