ANDHRA PRADESH

 
 

రాజీనామాకు సిద్దం అంటున్న సోము వీర్రాజు

somu veerraju

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎత్తులు పై ఎత్తుల‌తో సాగుతున్నాయి. పై చేయి కోసం టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. ప‌రువు పోకుండా చూసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ భావిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగా కేంద్ర మంత్రుల రాజీనామాల ప్ర‌స్తావ‌న రాగానే రాష్ట్రంలో కూడా ఇద్ద‌రు మంత్రులు ప‌ద‌వులుకు రాజీనామా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్ప‌టికే బీజేపీ అధిష్టానం నుంచి అందిన ఆదేశాల‌తో త‌న రాజీనామా ప‌త్రాన్ని కార్య‌ద‌ర్శికి అప్ప‌గించేశాన‌ని మంత్రి కామినేని ప్ర‌క‌టించేశారు కూడా. ఈ నేప‌థ్యంలో బీజేపీలో మ‌రో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌ల‌య్యింది. మంత్రుల‌తో పాటుగా తాను కూడా రాజీనామా చేస్తానంటూ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్ర‌తిపాదించ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. టీడీపీ మీద నైతికంగా పై చేయి సాధించాల‌ని వీర్రాజు ప్ర‌తిపాదిస్తున్న‌ట్టు స‌మాచారం. టీడీపీ మ‌ద్ధ‌తుతో గెలిచిన ఎమ్మెల్సీ సీటు త‌న‌కు వ‌ద్ద‌ని సోము చెబుతున్న‌ట్టు స‌న్నిహితుల అభిప్రాయం.Read More


జ‌న‌సేనను త‌క్కువ అంచ‌నా వేసిన కేసీఆర్

kcr pawan

తాజాగా కేసీఆర్ పేరుతో ఓ స‌ర్వే హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఢిల్లీలో త‌న‌ను క‌లిసిన వారి ముందు కేసీఆర్ వెల్ల‌డించార‌ని చెబుతున్న లెక్క‌లు ఆస‌క్తిదాయ‌కంగా ఉన్నాయి. ఆ స‌ర్వే ప్ర‌కారం ఇప్ప‌టికీ ఏపీలో పాల‌క కూట‌మిదే పై చేయిగా ఉండ‌డం విశేషం. ముఖ్యంగా కేసీఆర్ పేరుతో సాగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం ప్ర‌స్తుతం ఏపీలో టీడీపీకి 43 శాతం మంది మ‌ద్ధ‌తు ఉంది. అదే స‌మ‌యంలో బీజేపీకి 2.6 శాతం అనుకూల‌త ఉంది. ఇక జ‌న‌సేన‌కి కేవ‌లం ఒక్క శాతం మాత్ర‌మే మ‌ద్ధ‌తు ఉంద‌న్నారు. త‌ద్వారా గ‌త ఎన్నిక‌ల్లో కూట‌మిగా బ‌రిలో దిగిన టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన కూట‌మికి ఇప్ప‌టికీ 46.6 శాతం మ‌ద్ధ‌తు ఉన్న‌ట్టు లెక్క‌. అదే స‌మ‌యంలో వైసీపీకి 45 శాతం సానుకూల‌త ఉంద‌ని కేసీఆర్ చెబుతున్న‌ట్టుగా సాగుతున్న ప్ర‌చారంలో ఉంది. త‌ద్వారా 2014 నాటికి ఇప్ప‌టికీ బ‌లాబ‌లాల్లోRead More


ప‌వ‌న్ దానితో ప‌రిమిత‌మ‌యిపోతున్నారా?

janasena pawan

రాజ‌కీయాలలో రెండు ప‌క్షాలు ఉంటాయి. అయితే అధికార‌ప‌క్షం..ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను, కార్య‌క్ర‌మాల‌ను స‌మ‌ర్థించ‌డం వారిప‌ని. రెండోది ప్ర‌తిప‌క్షం..ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌లో లోపాలను భూత‌ద్దంలో చూపించి ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెంచే ప్ర‌య‌త్నం వీరి ప‌ని. ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో రెండింటికి భిన్నంగా ఉంది ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరు. జ‌నసేన పార్టీ అధినేత గా ప‌వ‌న్ వ్య‌వ‌హారం రాజ‌కీయవ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. అయోమ‌య‌మా..ఎటూ తేల్చుకోలేని సందిగ్ధ‌మా..లేక పాత స్నేహితుల‌ను కాపాడే య‌త్న‌మా అన్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే పొలిటిక‌ల్ గా ప‌వ‌న్ లో క్లారిటీ ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. అందుకే ఆపార్టీ టీడీపీతో క‌య్య‌మా..నెయ్య‌మా అన్న‌ది సూటిగా చెప్ప‌లేక‌పోతోంది. తాను ఏ పార్టీకి మిత్ర‌ప‌క్షం కాద‌ని, త‌నకెవ‌రూ శ‌త్రువులు లేరని చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయంగా విధానాల విష‌యంలోనూ దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోతున్నారు. ఒక వ‌ర్గం వాద‌న ప్ర‌కారం ఏపీ పొలిటిక్స్ మీద ప‌వ‌న్Read More


చంద్ర‌బాబుకి డేంజ‌ర్ బెల్ ..!

chandrababu

ఏపీ ప్ర‌జ‌ల నాడి గ‌మ‌నించ‌డానికి తాజా ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు ఓ మంచి ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. మొత్తం స్థానిక సంస్థ‌ల్లో 2800మంది, ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల్లో 4 ల‌క్ష‌ల మంది, ఉపాధ్యాయ నియోజ‌క‌ర్గాల్లో 1.4ల‌క్ష‌ల మంది త‌మ తీర్పునిచ్చారు. ఓట్ల రూపంలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌తను స్ప‌ష్టంగా చాటుకున్న‌ట్టు ఫ‌లితాలు రుజువు చేస్తున్నాయి. మూడు స్థానిక సంస్థ‌ల‌కు క‌లిపి సుమారు 1500 ఓట్లు, మూడు ప‌ట్ట‌భ‌ద్రుల్లో క‌లిపి టీడీపీ- బీజేపీకూట‌మికి దాదాపుగా 1.1 ల‌క్షల ఓట్లు, ఉపాధ్యాయుల్లో 60 వేల ఓట్లు అధికార‌ప‌క్షం సాధించింది. అంటే పీడీఎఫ్ గానీ, వైఎస్సార్సీపీకి గానీ క‌లుపుకుంటే దానికి రెట్టింపు ఓట్లు ల‌భించాయి. త‌ద్వారా టీడీపీ కూట‌మి ఓటింగ్ శాతం కేవ‌లం 30శాతంగా క‌నిపిస్తోంద 70 శాతం ఓటర్లు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉన్నార‌ని ఎమ్మెల్సీ ఓట్ల లెక్క‌లు చాటుతున్నాయి. ఏపీ అభివృద్ధి బాట‌న సాగుతోంద‌నిRead More


రెడ్లు వైపు మొగ్గు చూపుతున్న బాబు

ap cabinet

ఉగాదికి అనుకున్న‌ది వాయిదా ప‌డింది. వ‌చ్చే నెల‌లోనే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఖాయం అంటున్నారు. అందులోనూ సీఎం విదేశీయానానికి బ‌య‌లుదేర‌డానికి ముందే క్యాబినెట్ లో మార్పులు చేర్పులు ఖాయం చేస్తున్న‌ట్టు తాజా స‌మాచారం. అందులో భాగంగా ప‌లు మార్పులు ఉంటాయ‌ని అంటున్నారు. మంత్రివర్గ విస్తరణ కోసం 6, 7, 8 తేదీలను పరిశీలించారు. వీటిలో 6వ తేదీనే బాగుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక మంత్రి వ‌ర్గంలో కూడా ఈసారి రెడ్ల‌కు పెద్ద పీట వేయ‌డం ఖాయం అంటున్నారు. ఇటీవ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో టీడీపీ త‌రుపున రెడ్లు బ‌రిలో దిగారు. వ‌చ్చే మంత్రివ‌ర్గంలో కూడా రెడ్లు ముందు పీఠిన నిల‌వ‌బోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఏపీలో కుల పాల‌న‌, చంద్ర‌బాబు కులాధిప‌త్యం సాగుతోంద‌న్న విమ‌ర్శ‌లు బ‌హిరంగంగానే ఉన్నాయి. ప‌వ‌న్Read More


ఏపీలో ఉప ఎన్నిక‌ల‌కు నోటిఫికేషన్

voting_machine6_1322634277

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉప ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. వివిధ స్థానిక సంస్థ‌ల్లో ఖాళీగా ఉన్న స్థానాల‌న్నింటికీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. ప‌లు మునిసిపాలిటీలు, కార్పోరేష‌న్లల‌లో ఖాళీ స్థానాల‌కు ఏప్రిల్ 9న ఎన్నిక‌లు నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. రాష్ట్రంలోని 37స్థానాల్లోఖాళీగా వున్న కౌన్సిలర్ కార్పోరేటర్ స్థానాలకు ఈ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. దానికి సంబంధించిన‌ ఉత్తర్వులు జారీ అయ్యాయి..మార్చి 20నుండి 23వరకు నామినేషన్లు …24న స్క్రూటినీ …27న విత్ డ్రాస్ ఫైనల్ లిస్ట్ ప్రకటన..9న ఎన్నికలు 11న ఫలితాల ప్రకటన కౌంటింగ్ వుండే విధంగా షెడ్యూల్ విడుదల్లయ్యింది. మొత్తంగా వివిధ మునిసిపాలిటీల‌లో ఖాళీగా వున్న వాటికి బై ఎలెక్షన్స్ 37స్థానాల్లో జరగనున్నాయి.


ఏపీకి ఏమి ఇవ్వాలి? ప్యాకేజీతో ఏం ద‌క్కింది??

ap

ఏపీ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం ఉంది. దానికి తోడుగా పార్ల‌మెంట్ లో ప్ర‌భుత్వ హామీలున్నాయి. ఏపీకి కేంద్రం నెర‌వేర్చాల్సిన అనేక అంశాలున్నాయి. అందుకే ప్ర‌త్యేక హోదాను ఏపీ వాసులు అభివృద్ధికి ఆల‌వాలంగా భావిస్తున్నారు. హోదా ద‌క్కితే రాష్ట్రం కొత్త పుంత‌లు తొక్కుతుంద‌ని ఆశిస్తున్నారు. ఎన్నిక‌ల ముందు చెప్పిన మాట‌ల ప్ర‌కారం త‌మ‌కు హోదా ద‌క్కుతుంద‌ని ఆశించారు. కానీ బీజేపీ ప్ర‌భుత్వం దానికి భిన్నంగా స్పందించ‌డం, టీడీపీ నేత‌లు వంత‌పాడ‌డంతో హోదా పోయి ప్యాకేజీ ముందుకొచ్చింది. గ‌డిచిన ఆరు నెల‌లుగా ప్యాకేజీ చుట్టూ సాగిన పెద్ద చ‌ర్చ త‌ర్వాత చివ‌ర‌కు దానికి క్యాబినెట్ ఆమోదం లభించింది. దాంతో ఏదో సాధించామ‌న్న ప్ర‌చారం మొద‌ల‌య్యింది. నిజంగా ఈ ప్యాకేజీతో ఏపీకి ఏం మేలు జ‌రుగుతుంద‌న్న ఆస‌క్తి క‌నిపిస్తోంది. వాస్త‌వానికి ఏపీకి కావాల్సిన అంశాల‌కు, తాజా ప్యాకేజీకి పొంత‌న‌లేదు. ఉదాహ‌ర‌ణ‌కు ఏపీలో బ‌డ్జెట్Read More


అప్పుల కుప్ప ఆంధ్ర‌ప్ర‌దేశ్..!

andhra_graph1467892388

ఏపీ ని ప్ర‌పంచంలో నెంబ‌ర్ వ‌న్ గా నిల‌బెడ‌తామ‌ని సీఎం చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతుంటారు. 2022 నాటికి దేశంలో నెంబ‌ర్ త్రీ గానూ, 2029 నాటికి  ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ గానూ, 2050 నాటికి ప్ర‌పంచంలో నెంబ‌ర్ వ‌న్ గాను స‌న్ రైజ్ సిటీని నిల‌ప‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని చంద్ర‌బాబు చాలామార్లు ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు చంద్ర‌బాబు మాట‌లు ఎలా ఉన్న‌ప్ప‌టికీ అప్పుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎవ‌రిక అంద‌నంత ఎత్తు కి ఎదిగిపోతోంది. అనూహ్యంగా చంద్ర‌బాబు హ‌యంలో అప్పుల్లో అభివృద్ధి అమాంతంగా క‌నిపిస్తోంది. 2004కి ముందు ప్ర‌పంచ బ్యాంకు జీత‌గాడు- చంద్ర‌బాబు మోస‌గాడ‌ని ఓ పాపుల‌ర్ నినాదం వినిపించేది. దానికి కార‌ణం చంద్ర‌బాబు చేసిన అప్పులు..దాని మూలంగా అమ‌లు చేసిన ష‌రతులే. అయితే అప్ప‌ట్లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పులు ల‌క్ష కోట్ల‌కు చేర‌డం తీవ్ర దుమారం రేపింది.Read More


జ‌గ‌న్ ఎత్తు- బాబు చిత్తు: ఆ వ‌ర్గాల‌కు అన్యాయం

ap assembly

అనుకున్న‌ట్టే చంద్ర‌బాబు వెన‌క‌డుగు వేశారు. జ‌గ‌న్ దూకుడు మంత్రం ఫ‌లించింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వ్యూహాత్మ‌క పై చేయి సాధించారు. ఫిరాయింపుల సాయంతో గ‌ట్టెక్కాల‌నుకున్న బాబుని దెబ్బ‌కొట్టారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఏడో సీటు వ్య‌వ‌హారంలో జ‌గ‌న్ ల‌క్ష్యం నెర‌వేరింది. ఏక‌గ్రీవంగానే రెండు సీట్లు ద‌క్కించుకున్నారు. ఐదుగురు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన టీడీపీ, ఆరోస్థానం విష‌యంలో పోటీకి విముఖ‌త ప్ర‌ద‌ర్శించింది. దాంతో ఈ విభాగంలో మండ‌లి ఎన్నిక‌లు ఏక‌గ్రీవం అయిపోతున్న‌ట్టే భావించాలి. వైఎస్సార్సీపీ నుంచి ఇద్ద‌రు అభ్య‌ర్థులు ఆళ్ల నాని, గంగుల ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడా ఏక‌గ్రీవంగా మండ‌లిలో అడుగుపెట్ట‌బోతున్నారు. వాస్త‌వానికి రెండో సీటు గెల‌వ‌డానికి ఫిరాయింపుల మూలంగా వైఎస్సార్సీపీకి నాలుగు ఓట్లు త‌క్కువ ఉన్నాయి. దానిని ఆధారంగా చేసుకుని వైఎస్సార్సీపీ నుంచి మ‌రో ముగ్గురు నేత‌లు త‌మ వైపు మొగ్గు చూపుతున్న‌ట్టు టీడీపీ ప్ర‌చారం ప్రారంభించిన‌ప్ప‌టికీ అందులోRead More


జ‌న‌సేనకు మ‌రో ఛాన్స్ ..!

pawan

ఎప్పుడైనా రాజ‌కీయాల్లో పాల‌కప‌క్షాన్ని ప్ర‌జ‌లు స‌హించ‌లేన‌ప్పుడు ..అదే స‌మ‌యంలో విప‌క్షం ఏమాత్రం ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను వినియోగించుకోలేని ద‌శ‌లో ఉన్న‌ప్పుడు మాత్ర‌మే కొత్త పార్టీలు మ‌నుగ‌డ సాగించ‌గ‌లుగుతాయి. అలాంటి ప‌రిస్థితి ఇప్పుడు ఉందా అన్న ప్ర‌శ్న ప‌క్క‌న పెడితే జ‌న‌సేన పార్టీ ద్వారా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆశిస్తున్న ఫ‌లితాలు వ‌స్తాయా అన్న‌ది చాలామందిలో ఆస‌క్తిగా క‌నిపిస్తోంది. గ‌తంలో ప్ర‌జారాజ్యం అనుభవాలు కూడా ఉండ‌డంతో అంద‌రూ దానినే ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నారు అయితే ప‌వ‌న్ మాత్రం గెలుపోట‌ములు కాకుండా ప్ర‌శ్నించ‌డం కోస‌మే పార్టీ అని చెప్ప‌డంతో ఆయ‌న విధానాల‌లో కొంత స్ప‌ష్ట‌త క‌నిపిస్తోంది. అధికారం కోసం అర్రులు చాస్తున్న నాయ‌కుడు ప‌వ‌న్ కాద‌ని ఆయ‌న ప‌దే ప‌దే చెబుతున్న మాట‌ల ద్వారా అర్థ‌మ‌వుతోంది. దాంతో ఇక ప‌వ‌న్ రాజ‌కీయ ల‌క్ష్యం ప‌వ‌ర్ కాదు.ప్ర‌శ్నే అని భావించాల్సి ఉంటుంది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లోRead More