Main Menu

anam vivekananda reddy

 
 

ఆనం బ్ర‌ద‌ర్స్ ని మోసం చేసిందెవ‌రు..?

అయ్యో..అనాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది. రాజ‌కీయాల్లో అంతెత్తుకు ఎదిగిన వాళ్ల‌కు అన్యాయం జ‌రుగుతున్నా ఏమీ చేయలేని స్థితిలో ప‌డిపోవ‌డం అనూహ్య‌మే అనిపిస్తోంది. అయినా పోలిటిక్స్ లో ఇలాంటి సీన్లు త‌ప్ప‌వేమో అని స‌రిపెట్టుకోవాలి. బ‌ళ్లు ఓడ‌లు..ఓడ‌లు బ‌ళ్లు కావ‌డం అంటే ఏమిటో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అందుకే అంతా తామై అన్నింటా పెత్త‌నం చెలాయించిన ఆనం బ్ర‌ద‌ర్స్ ఇప్పుడు మోస‌పోయామ‌ని వాపోయే ప‌రిస్థితి వ‌చ్చేసింది. స్వ‌యంగా ఆనం వివేకానంద‌రెడ్డి తాము మోస‌పోయామ‌ని చెప్పిన నేప‌థ్యంలో అస‌లు ఇంత‌కీ వాళ్ల‌ని మోస‌గించిందెవ‌రనే చ‌ర్చ మొద‌ల‌య్యింది. ‘మోసపోయాం బ్రదర్‌.. ఎన్ని అవమానాలను భరిస్తాం. ఎవరెవరికో పదవులు ఇస్తున్నారు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినా.. అది కూడా చేజారింది. సొంత కళాశాల వీఆర్సీలో జూనియర్‌ కళాశాల ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేదు. భవిష్యత్తును దేవుడే నిర్ణయిస్తాడు. ఇక ఇప్పట్లో నెల్లూరుకు రాలేను’… ఇవీRead More


జ‌గ‌న్ , చంద్ర‌బాబు కూడా సీఎం కాలేరు..!

నేను సీఎం అవుతా..నేను సీఎంగా కొన‌సాగుతా అంటూ కుద‌ర‌ద‌ని సీనియ‌ర్ నేత ఆనం వివేకానంద‌రెడ్డి వ్యాఖ్యానించారు. చాలాకాలం త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చిన ఆయ‌న ప‌దే ప‌దే తాను సీఎం ని అవుతానంటూ జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌ను ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. నేను అవుతా..నేను అవుతా అంటే జ‌గ‌న్ గానీ, చంద్ర‌బాబు గానీ సీఎం కాలేర‌ని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు పనికొచ్చే ప‌నులు చేస్తేనే సీఎం అవుతార‌ని పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో తాను టీడీపీ ని వీడుతున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. రామ‌నారాయ‌ణ‌రెడ్డి కూడా పార్టీని వీడే అవ‌కాశం లేద‌న్నారు. ఎమ్మెల్సీ టికెట్ ఆశించిన స‌మ‌యంలో త‌మ‌ను అవ‌మానించార‌ని అసంతృప్తితో ఉన్న ఆనం బ్ర‌ద‌ర్స్ పార్టీని వీడే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం ఊపందుకున్న నేప‌థ్యంలో తాజాగా వివేకానంద‌రెడ్డి వ్యాఖ్య‌లు ఆసక్తిగా మారాయి. తాము జ‌న‌సేన‌లోకి వెళ్లే అవ‌కాశం లేద‌నిRead More


ఆనం బ్ర‌ద‌ర్స్ అల‌క‌తో ఆందోళ‌న‌

నెల్లూరు రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు సాగుతున్నాయి. పొలిటిక‌ల్ స్టార్ గా పేరున్న ఆనం బ్ర‌ద‌ర్స్ అల‌క పాన్పు వీడ‌డం లేద‌ట‌. దాంతో టీడీపీ శ్రేణుల్లో క‌ల‌క‌లం రేగుతోంది. వ‌రుస‌గా నేత‌లంతా రాయ‌బారాలు న‌డుపుతున్నారు. కొత్త మంత్రి సోమిరెడ్డి నుంచి మొద‌లుకుని పాత‌మంత్రి నారాయ‌ణ వ‌ర‌కూ ఆనం బ్ర‌ద‌ర్స్ ఇంటికి క్యూ కట్టారు. పార్టీ జిల్లా అధ్య‌క్షుడు బీదా ర‌వి చంద్ర కూడా ఆనం వారితో చ‌ర్చ‌లు జ‌రిపి వ‌చ్చారు. అయినా సీన్ లో ఛేంజ్ క‌నిపించ‌క‌పోవ‌డం క‌ల‌త చెందేలే చేస్తోంది. వ‌రుస‌గా పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం నుంచి చంద్ర‌బాబు జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు కూడా ఆనం వారు అంద‌నంత దూరంలో ఉండ‌డం నెల్లూరు టీడీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారుతోంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. సుదీర్ఘ‌కాలం కాంగ్రెస్ లో ఉన్న ఆనం ఫ్యామిలీ మ‌ళ్లీ ఒక‌నాటి పాత స్నేహితుడుRead More