Main Menu

anam brothers

 
 

టీడీపీ అధ్య‌క్షుడిగా రెడ్డి గారు..!

ఏపీ టీడీపీలో అనూహ్య నిర్ణ‌యాలు త‌ప్ప‌వ‌నిపిస్తోంది. ఇప్ప‌టికే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌, ఎమ్మెల్సీ ప‌ద‌వుల పంపిణీలో సామాజికంగా రెడ్ల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ద‌క్కింది. చంద్ర‌బాబులో వ‌చ్చిన మార్పున‌కు అది సంకేతంగా ఉంది. ఇక ఇప్పుడు తాజాగా మ‌రో అనూహ్య నిర్ణ‌యం ఖాయ‌మ‌నే వాద‌న ఉంది. తెలుగుదేశం పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని ఓ జంపింగ్ నేత‌కు క‌ట్టుబెట్ట‌డం ఖాయంగా ఉంది. ఇప్ప‌టికే ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న కిమిడి క‌ళా వెంక‌ట్రావు మూడు నెల‌ల క్రితం మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. ఆయ‌న కూడా జంపింగ్ నాయ‌కుడే కావ‌డం గ‌మ‌నార్హం. 2009లో ఆయ‌న పీఆర్పీ త‌రుపున ఎచ్చెర్ల నుంచి పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. మ‌ళ్లీ 2014 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరారు. ఆత‌ర్వాత ఏకంగా ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్య‌త‌లు కూడా ద‌క్కించుకున్నారు. ఇక ఇప్పుడు తాజా ప‌రిణామాల‌తో జ‌గ‌న్Read More


ఆనం బ్ర‌దర్స్ కి పెరుగుతున్న ఇంటిపోరు

ఆనం బ్ర‌ద‌ర్స్ చెప్పిందే వేదంగా క‌నిపించేది ఒక‌నాడు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. పార్టీ మారిన త‌ర్వాత వారి ప‌రిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డ్డ‌ట్టుగా ఉంద‌నే వ్యాఖ్య‌లు క‌నిపిస్తున్నాయి. క‌నుసైగ‌ల‌తో పార్టీని శాసించిన నేత‌లు ఇప్పుడు టీడీపీలో స‌త‌మ‌త‌మ‌వుతున్న తీరు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ముఖ్యంగా నెల్లూరు టీడీపీలో ఇంటిపోరు ముదిరిపోతోంది. ముఖ్యంగా ఆత్మ‌కూరు రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారిపోతున్నాయి. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి కొత్త అవ‌స్థ‌లు ఏర్ప‌డుతున్నాయి. ఆత్మ‌కూరు వ్య‌వ‌హారాల‌తో అస‌లుకే మోసం వ‌స్తుందా అనే సందేహం క‌లుగుతోంది. పిట్ట‌పిట్ట‌పోరు పిల్లి తీర్చిన‌ట్టుగా ఈ ప‌రిణామాల‌ను వైసీపీ సొమ్ము చేసుకుంటుందా అనే చ‌ర్చ మొద‌ల‌య్యింది. ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ఒక‌నాడు సీఎం రేసులో కూడా క‌నిపించారు. అలాంటి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి ఇప్పుడు సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. పేరుకి పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న‌ప్ప‌టికీ అక్క‌డ సీనియ‌ర్Read More


ఆనం బ్ర‌ద‌ర్స్ అల‌క‌తో ఆందోళ‌న‌

నెల్లూరు రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు సాగుతున్నాయి. పొలిటిక‌ల్ స్టార్ గా పేరున్న ఆనం బ్ర‌ద‌ర్స్ అల‌క పాన్పు వీడ‌డం లేద‌ట‌. దాంతో టీడీపీ శ్రేణుల్లో క‌ల‌క‌లం రేగుతోంది. వ‌రుస‌గా నేత‌లంతా రాయ‌బారాలు న‌డుపుతున్నారు. కొత్త మంత్రి సోమిరెడ్డి నుంచి మొద‌లుకుని పాత‌మంత్రి నారాయ‌ణ వ‌ర‌కూ ఆనం బ్ర‌ద‌ర్స్ ఇంటికి క్యూ కట్టారు. పార్టీ జిల్లా అధ్య‌క్షుడు బీదా ర‌వి చంద్ర కూడా ఆనం వారితో చ‌ర్చ‌లు జ‌రిపి వ‌చ్చారు. అయినా సీన్ లో ఛేంజ్ క‌నిపించ‌క‌పోవ‌డం క‌ల‌త చెందేలే చేస్తోంది. వ‌రుస‌గా పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం నుంచి చంద్ర‌బాబు జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు కూడా ఆనం వారు అంద‌నంత దూరంలో ఉండ‌డం నెల్లూరు టీడీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారుతోంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. సుదీర్ఘ‌కాలం కాంగ్రెస్ లో ఉన్న ఆనం ఫ్యామిలీ మ‌ళ్లీ ఒక‌నాటి పాత స్నేహితుడుRead More


రౌండ‌ప్: సింహ‌పురి లో ఎవ‌రి సీన్ ఎలా ఉంది?

నెల్లూరు రాజ‌కీయాలు నిత్యం ఆస‌క్తిగానే ఉంటాయి. రెడ్లు ప్ర‌ధానంగా క‌నిపించే ఈ జిల్లాలో రెండు పార్టీల్లోనూ వారిదే హ‌వా. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలో వైసీపీదే హ‌వా. మెజార్టీ అసెంబ్లీ, ఎంపీ సీట్లే కాకుండా నెల్లూరు జెడ్పీ, మేయ‌ర్ పీఠం కూడా ఆపార్టీ చేతికి చిక్కాయి. కానీ మూడేళ్ల కాలంలో అనేక మార్పులు జ‌రిగాయి. ప‌లువురు నేత‌లు అటూ ఇటూ మారిపోయారు. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌లు కూడా చంద్ర‌బాబు చెంత‌కు చేరుకున్నారు. దాంతో టీడీపీ పుంజుకుంటుంద‌ని బాబు భావిస్తున్నారు. మ‌రి జిల్లాలో రాజ‌కీయ ప‌రిస్థితి ఎలా ఉందో ఈ రౌండ‌ప్ లో చూద్దాం. 1. కందుకూరు ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ అభ్య‌ర్థి పోతుల రామారావు విజ‌యం సాధించారు. సమీప టీడీపీ అభ్య‌ర్థి దివి శివ‌రాం ని ఓడించారు. 3,806 ఓట్ల తేడాతోRead More


ఆనం తృప్తిగా లేరు..!

టీడీపీకి వ‌రుస త‌ల‌నొప్పులు త‌ప్పేలా లేవు. వ‌చ్చిన‌వారంద‌రినీ పార్టీలో చేర్చుకున్న చంద్ర‌బాబుకి ఇప్పుడు చిక్కులు త‌ప్ప‌డం లేదు. ఓ వైపు పార్టీలో పాత నేల‌త‌కు, కొత్త‌గా చేరిన వారి మ‌ధ్య స‌మ‌స్య‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. మ‌రోవైపు ప‌ద‌వులు ఆశ‌చూపి పార్టీలో చేర్చుకున్న త‌ర్వాత సంతృప్తి ప‌ర‌చ‌లేక‌పోవ‌డంతో కొత్త నేత‌లు గుర్రుగా క‌నిపిస్తున్నారు. తాజాగా ఆనం బ్ర‌ద‌ర్స్ వ్య‌వ‌హారం ఇప్పుడు నెల్లూరులో హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా రెండు నెల‌లుగా తెలుగుదేశం కార్య‌క్ర‌మాల‌తో అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారి తీరు టీడీపీలో క‌ల‌క‌లం రేపుతోంది. అధిష్టానాన్ని ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఈ నేప‌థ్యంలో మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన సోమిరెడ్డి చొర‌వ తీసుకున్నారు. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌డానికి త‌న‌వంతు ప్ర‌య‌త్నం ప్రారంభించారు. నేరుగా ఆనం ఇంటికి వెళ్లారు. వారిని స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేశారు. వివేకానంద‌రెడ్డితో స‌మావేశ‌మ‌య్యారు. పార్టీలో త‌గిన న్యాయం జ‌రుగుతుంద‌ని హామీRead More


పున‌రాలోచ‌న‌లో ఆనం బ్ర‌ద‌ర్స్..!

అంతా సాఫీగా ఉంటుంద‌ని ఆశ‌పెడితే అనుకోని ఆటంకాలు ఎదుర‌వుతున్నాయి. అధికార పార్టీ క‌దా అనుకుంటే అందుకు భిన్నంగా క‌నిపిస్తోంది. పిలిచి కండువా క‌ప్ప‌డంతో క‌ష్టాలు తీరిపోతాయ‌ని భావిస్తే కొత్త స‌మ‌స్య‌లు చుట్టిముట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. నెల్లూరు గ‌డ్డ మీద మ‌ళ్లీ మీసం మెలేద్దామ‌నుకుంటే మోస‌పోయామా అన్న సందేహం క‌లుగుతోంది. ఇలాంటి ఆలోచ‌న‌లే ఇప్పుడు ఆనం బ్ర‌ద‌ర్స్ ని తీవ్రంగా క‌ల‌చివేస్తున్నాయి. వ‌రుస‌గా చంద్ర‌బాబు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో అటు రామ‌నారాయ‌ణ రెడ్డి, ఇటు వివేకానంద రెడ్డి కూడా ఉలుకూ ప‌లుకూ లేకుండా ఊహించ‌ని ప‌రిణామాల‌తో ఉసూరు మంటున్నారు. కాంగ్రెస్ లో సుదీర్ఘ‌కాలం పాటు చ‌క్రం తిప్పి, చివ‌ర‌కు సీఎం రేసులో కూడా పేరు ప‌రిశీల‌కు వెళ్లే స్థాయిలో సాగిన ఆనం బ్ర‌ద‌ర్స్ హ‌వా సాగింది. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ కుదేలుకావ‌డంతో మ‌రోదారి లేక సైకిలెక్కేశారు. చంద్ర‌బాబు ఆహ్వానం అందుకుని టీడీపీలోRead More


ఆనం బ్ర‌ద‌ర్స్ కి కోర్టులో చుక్కెదురు

తెలుగుదేశం నేత‌ల‌కు కోర్టు వ్య‌వ‌హారాలు షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో ఆనం బ్ర‌ద‌ర్స్ కూడా చేరిపోయారు. హైకోర్ట్ ఆదేశాల‌తో ఇప్పుడు సింహ‌పురి నేత‌ల‌కు సెగ త‌గిలింది. నెల్లూరులో భారీగా ఆస్తులు క‌లిగిన కాలేజీ వ్య‌వ‌హారాల‌లో హైకోర్ట్ క‌న్నెర్ర చేసింది. కాలేజీ క‌మిటీ పేరుతో వారి క‌నుసన్న‌ల్లో సాగిన నిర్ణ‌యాల‌కు చెక్ పెట్టింది. వీఆర్‌ కాలేజీ కమిటీ నిర్ణ‌యాలు చెల్ల‌వ‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం వీఆర్‌ కాలేజీకి కరస్పాండెంట్ మాజీ ఎమ్మెల్యే వివేకానందా రెడ్డి‌, అధ్యక్షులుగా మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కొనసాగుతున్నారు. కాలేజీ పేరు రూ. 700కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఈ ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ వ్య‌వ‌హారం కోర్ట్ కి చేరింది. కోర్టులో ఆనం బ్ర‌ద‌ర్స్ కి వ్య‌తిరేకంగా తీర్పు రావ‌డంతో ఇప్పుడు నెల్లూరు రాజ‌కీయాల్లో ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గాRead More


వాళ్ల‌ను ఆదుకోలేక‌పోతున్న‌ జ‌గ‌న్..!

అవును..విప‌క్షంలోనే కాదు..అధికార‌ప‌క్షంలోనూ అనేక‌మందికి ఇప్పుడు జ‌గ‌నే ఆధారం. జ‌గ‌న్ చుట్టూ సాగించే ప్ర‌చారం ఆధారంగానే ప‌లువురు నేత‌ల ప్రమోష‌న్లు ఆధార‌ప‌డి ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే గ‌త కొంత కాలంగా కొంద‌రు నేత‌లు చేసిన ప్ర‌య‌త్నాలు క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్ర‌బాబుని ఆకట్టుకోవాలంటే విప‌క్ష నేత మీద విరుచుకుప‌డ‌డమే ద‌గ్గ‌ర మార్గ‌మ‌ని ప‌లువురు నేత‌లు భావిస్తున్నారు. అంతేగాకుండా విప‌క్షానికి త‌గిన స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారంటూ ప‌దే ప‌దే అధినేత కూడా విరుచుకుప‌డుతున్న త‌రుణంలో పాల‌క‌పక్షంలోని ప‌లువురికి జ‌గ‌నే దిక్క‌వుతున్నారు. జ‌గ‌న్ మీద నోరు పారేసుకుంటే చాలా అది అధినేత దృష్టిలో ప‌డిపోతుంద‌ని భావిస్తున్నారు. అనుకోవ‌డ‌మే త‌డువుగా అనేక మంది అదే ప‌ని సాగించారు. అటు అసెంబ్లీలోనూ, ఇటు బ‌య‌ట కూడా కొంద‌రు నేత‌లు జ‌గ‌న్ మీద గురిపెట్టారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది కానీ..వారు ఆశించిన ల‌క్ష్యం నెర‌వేరుతుందా అన్న‌దే ఇప్పుడుRead More


టీడీపీలో ఆగ‌మాగం చేస్తున్న ‘ఆనం’ బ్ర‌ద‌ర్స్..!

  ఇత‌ర పార్టీల నేత‌లను పార్టీలో చేర్చుకుంటే పుంజుకుంటామ‌ని టీడీపీ అధినేత భావించారు. కానీ వాస్త‌వం దానికి భిన్నంగా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్, వైఎస్సార్సీపీ ల నుంచి వ‌చ్చి చేరిన సీనియ‌ర్ నేత‌ల తీరుతో అనేక చోట్ల త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు చోట్ల అవి ర‌ణ‌రంగాన్ని త‌ల‌పించాయి. తాజాగా నెల్లూరులో ఆనం బ్ర‌ద‌ర్స్ రాక‌తో తెలుగు త‌మ్ముళ్ల‌లో పెద్ద త‌గాదా సాగుతోంది. ఏకంగా న‌గ‌ర మేయ‌ర్ అబ్దుల్ అజీజ్ కి, ఆనం బ్ర‌ద‌ర్స్ కి మ‌ధ్య ఇప్పుడు అగ్గి రాజుకుంది. దాంతో వైఎస్సార్సీపీ నుంచి మేయ‌ర్ తో, కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన ఆనం బ్ర‌ద‌ర్స్ ఆగ‌మాగం సాగిస్తున్నారు. దాంతో టీడీపీలో చాలాకాలంగా ఉన్న నేత‌ల‌కు మింగుడ‌ప‌డ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. కొత్త‌గా వ‌చ్చిన ఇద్ద‌రు నేత‌లు త‌గువు ప‌డుతుంటే త‌మ‌కు త‌ల‌నొప్పులొస్తాయ‌ని వాపోతున్నారు. అదంతా బ‌హిరంగంగానే కావ‌డంRead More