Main Menu

amaravati

 
 

ఇరుక్కుపోయిన సీఎం చంద్ర‌బాబు

స‌హ‌జంగా సామాన్యుడు రోడ్డు మీద అడుగుపెడితే క‌లిగేక‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. అందులోనూ రాజ‌ధాని న‌గ‌రంలా మారిపోయిన విజ‌య‌వాడ‌లో ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయం. నిత్యం ట్రాఫిక్ వ‌ల‌లో ఇరుక్కుని విల‌విల్లాడాల్సిందే. బెంజి స‌ర్కిల్ అయితే బ‌హు క‌ష్టాలు త‌ప్ప‌వు. ఇలాంటి స‌మ‌స్య‌లు తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబుకి కూడా త‌ప్ప‌లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుపోవ‌డం ఆస‌క్తిగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో జ‌ర‌గ‌బోతున్న స్వ‌తంత్ర్య‌దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన‌డానికి చంద్ర‌బాబు బ‌య‌లుదేరారు. అయితే బంద‌రు రోడ్డులో ట్రాఫిక్ ని నియంత్రించిన పోలీసుల‌కు బెంజి స‌ర్కిల్ లో ఉన్న ర‌ద్దీ కార‌ణంగా చేతులెత్తేయ‌క త‌ప్ప‌లేదు. చివ‌ర‌కు చంద్ర‌బాబు కాన్వాయ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ బెంజి స‌ర్కిల్ లో ట్రాఫిక్ స‌రిచేయ‌డం సాధ్యం కాలేదు. దాంతో సీఎం కాన్వాయ్ కూడా ట్రాఫిక్ లో ఆగిపోయింది. అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఓ వైపు ఫ్ల‌ట్Read More


చంద్ర‌బాబు క్లారిటీ, ఆశావాహుల సంద‌డి మొద‌లు

ఏపీ క్యాబినెట్ విస్త‌ర‌ణ ఖాయం అయ్యింది. ఇప్ప‌టికే రెండు ఖాళీలున్నాయి. బీజేపీకి చెందిన మంత్రులు రాజీనామాల త‌ర్వాత ఖాళీ అయిన రెండు పోస్టులు భ‌ర్తీ చేయ‌డానికి స‌న్నాహాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సీఎం ప్ర‌క‌టించారు. మైనార్టీల‌కు బెర్త్ ఖాయం చేసేవారు. ముస్లీంల‌ను క్యాబినెట్ లోకి తీసుకోబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దాంతో ఆశావాహుల సంద‌డి షురూ అయ్యింది. రెండు ఖాళీలుండ‌డంతో రెండో బెర్త్ కోసం గ‌ట్టి పోటీ త‌ప్పేలా లేదు. ముఖ్యంగా కామినేని శ్రీనివాస్ ఖాళీ చేయ‌డంతో క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన మ‌రొక‌రికి అవ‌కాశం ద‌క్కుతుంద‌న్న అబిప్రాయంతో ఉన్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే ప‌లువురు క‌దుపుతున్నారు. ధూలిపాళ న‌రేంద్ర‌, ప‌య్యావుల కేశ‌వ్, గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి వంటి వారు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేసి గ‌తంలో విఫ‌ల‌మ‌య్యారు. ఇప్పుడు మ‌రోసారి ఈ పేర్ల‌న్నీ తెర‌మీద‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. వారికి తోడుగాRead More


ఆర్టీసీ ఎన్నిక‌ల్లో టీడీపీకి ఎదురుదెబ్బ‌

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏపీ అధికార ప‌క్షానికి చెంప‌దెబ్బ త‌గిలింది. ఏకంగా మంత్రి అచ్చెన్నాయుడు స్వ‌యంగా ప్ర‌చారంలో దిగి ఎన్ఎంయూ విజ‌యం కోసం శ్ర‌మించినా ఫ‌లితం ద‌క్క‌లేదు. ఐక్య కూట‌మి ముందు పాల‌క‌ప‌క్ష మ‌ద్ధ‌తుదారు త‌ల‌వంచింది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార ప‌క్షం మీద తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపించింది. దాంతో సిట్టింగ్ యూనియ‌న్ ఎన్ఎంయూ ఘోరంగా ఓట‌మి పాల‌య్యింది. శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూగో, విజ‌య‌వాడు. గుంటూరు. నెల్లూరు. అనంత‌పురం , తిరుప‌తి స‌హా అన్ని రీజియ‌న్ల‌లోనూ ఎన్ఎంయూ ఓటమి పాల‌య్యింది. కేవ‌లం ప‌గోలో మాత్ర‌మే విజ‌యం సాధించి ప‌రువు కాపాడుకున్న‌ట్ట‌య్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంప్లాయిస్ యూనియ‌న్ ఐక్య కూట‌మి సాధించిన ఫ‌లితాలు చంద్ర‌బాబు ప్ర‌భుత్వ విధానాల‌కు చావుదెబ్బ వంటిద‌ని ఈయూ, స‌హా ప‌లువురు నేత‌లు పేర్కొన్నారు. ఎస్ డ‌బ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కూడా ఇదే విష‌యాన్ని పేర్కొన్నారు.Read More


ఆయ‌న త‌ప్పుకోవ‌డంతో బాబుకి రిలీఫ్

ఏపీ సీఎం చంద్ర‌బాబుకి రిలీఫ్ ద‌క్కింది. మోడీ త‌న‌ను చ‌క్ర‌బంధంలో ఇరికించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని క‌ల‌వ‌ర‌ప‌డ్డ టీడీపీ అధినేత కొంత కుదుట‌ప‌డ్డారు. రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో న‌రేష్ అగ‌ర్వాల్ ని బ‌రిలో దింపాల‌ని మోడీ భావించాలి. త‌ద్వారా చంద్ర‌బాబుని ఇర‌కాటంలో నెట్టేయ‌త్నం జ‌రిగింది. అయితే న‌రేష్ అగ‌ర్వాల్ మాత్రం తాను పోటీ చేయలేన‌ని చేతులెత్తేయ‌డంతో బాబుకి ఉప‌శ‌మ‌నంగా మారింది. న‌రేష్ రంగంలో దిగితే రాజ‌కీయంగా చంద్ర‌బాబుకి పెద్ద స‌మ‌స్య‌గా మారేది. దాంతో ఇప్పుడు అకాలీద‌ళ్ కి చెందిన న‌రేష్ స్థానంలో జేడీయూ అభ్య‌ర్థి హ‌రివంశ్ ని బ‌రిలో దింపేందుకు ఎన్డీయే సిద్ధ‌మ‌య్యింది. ఈనెల 9న ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. దాంతో ఒక్క‌సారి గా పార్టీల‌న్నీ ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. ప్ర‌తిప‌క్షాల అభ్య‌ర్థిత్వం కోసం తృణ‌మూల్ కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తోంది. అయితే కాంగ్రెస్ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో వారి మ‌ధ్య పీట‌ముడిRead More


ఏపీ రాజ‌కీయాల్లో కాంగ్రెస్ కొత్త ఎత్తులు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకోవ‌డానికి పార్టీల‌న్నీ ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అందులోనూ పునాదులే కోల్పోయిన కాంగ్రెస్ అయితే మ‌రో అడుగు ముందుకేస్తోంది. సుదీర్ఘ‌కాలం పాటు కాంగ్రెస్ కి సామాజిక పునాదిగా ఉన్న రెడ్డి సామాజిక‌వ‌ర్గాన్ని జ‌గ‌న్ ఎగ‌రేసుకుపో్వ‌డంతో కాంగ్రెస్ విల‌విల్లాడుతోంది. చివ‌ర‌కు ఎస్సీల‌లో కూడా కాంగ్రెస్ కున్న ప‌ట్టు ఇప్పుడు జ‌గ‌న్ చేత‌చిక్కింద‌నే చెప్ప‌వ‌చ్చు. దాంతో కాంగ్రెస్ కొత్త దారి ఎన్నుకుంటోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే కాపు సామాజిక‌వ‌ర్గాన్ని సొంతం చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాపు సామాజిక‌వ‌ర్గం ఓట్లు 11శాతంగా ఉంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. సాధికారిక స‌ర్వే త‌ర్వాత చంద్ర‌బాబు ఈ లెక్క‌లు ప్ర‌క‌టించారు. అయితే వారికి రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో న్యాయం జ‌ర‌గ‌లేద‌న్న అభిప్రాయం వినిపిస్తోంది. ఏపీ ప్ర‌భుత్వం అసెంబ్లీ లో తీర్మానం చేసిన‌ప్ప‌టికీ అస‌లు వ్య‌వ‌హారం పార్ల‌మెంట్ ప‌రిధిలో ఉంది. చ‌ట్టం చేయాల్సిన అవ‌స‌రంRead More


బాబుకి బూమ‌రాంగ్ అయ్యింది..!

అవిశ్వాసం. అనుకున్న‌ట్టే జ‌రిగింది. టీడీపీకి ఏదో ప్ర‌యోజ‌నం ఒన‌గూరుస్తుంద‌నుకుంటూ అస‌లుకే ఎస‌రు వ‌చ్చే ప‌రిస్థితీ ఏర్ప‌డింది. అవిశ్వాసం వీగిపోతుంద‌న్న అంచ‌నాలున్న‌ప్ప‌టికీ చ‌ర్చ‌ల సంద‌ర్భంగా బీజేపీ గుట్టు ర‌ట్టు చేసి దేశ‌వ్యాప్తంగా మైలేజీ సాధించాల‌ని బాబు ఆశించారు. అదే స‌మ‌యంలో ఏపీ ప్ర‌జ‌ల దృష్టిలో బీజేపీ మీద పోరాడుతున్న నాయ‌కుడిగా నిలిచిపోవాల‌ని భావించారు. కానీ తీరా చూస్తే గ‌ల్లా జ‌య‌దేవ్, రామ్మోహ‌న్ నాయుడు ఉప‌న్యాసాలు ఆక‌ట్టుకున్న‌ప్ప‌టికీ బీజేపీ ఎదురుదాడితో తెలుగు త‌మ్ముళ్లు త‌ల‌ప‌ట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. చివ‌ర‌కు పార్ల‌మెంట్ లో ఓటింగ్ సంద‌ర్బంగా మోడీకి వ్య‌తిరేకంగా క‌నీసం నినాదాలు కూడా బ‌లంగా వినిపించ‌లేక‌పోయార‌నే అభిప్రాయం ఏర్ప‌డింది. అంత‌కుముందు రాజ్ నాధ్ సింగ్ ఉప‌న్యాసంలో టీడీపీ అప్పుడు, ఇప్పుడూ మా మిత్ర‌ప‌క్ష‌మేన‌ని పేర్కొన‌డం బాబుకి మింగుడుప‌డ‌డం లేదు. బీజేపీ ఎదురుదాడితో త‌ల్ల‌డిల్లిపోవాల్సి వ‌స్తోంది. ప్ర‌జ‌ల్లో త‌ప్పుడు సంకేతాలు వెళ్లిన‌ట్టు క‌నిపిస్తోంది.Read More


మీడియా సంద‌డి మొద‌ల‌య్యింది..!

మ‌ళ్లీ క‌ద‌లిక మొద‌ల‌య్యింది. తెలుగు మీడియాకి జోష్ వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. వ‌రుస‌గా మీడియా సంస్థ‌ల యాజ‌మాన్యాలు మారుతున్నాయి. మ‌రికొన్నింటిలో మార్పుల‌కు సిద్ధం అవుతున్నాయి. ఇప్ప‌టికే 99 చానెల్ ని జ‌న‌సేన స్వాధీనం చేసుకుంది. ఆపార్టీ నాయ‌కుడు తోట చంద్ర‌శేఖ‌ర్ సార‌ధ్యంలో ఆదిత్య గ్రూప్ నుంచి న్యూస్ వేవ్ మీడియా ఈ చానెల్ న‌డుపుతోంది. ఇక త్వ‌ర‌లో 10టీవీ కూడా చేతులు మారుతోంది. ఈ చానెల్ వైసీపీ సానుభూతిప‌రుడైన జ‌గ‌న్ స‌న్నిహితుడు కొనుగోలు చేసిన‌ట్టు ప్ర‌చారంలో ఉంది. ఇక వాటికితోడుగా స్టూడియో ఎన్ చానెల్ కూడా ప్ర‌స్తుతం తాత్కాలికంగా మూత‌ప‌డింది. త్వ‌ర‌లోనే కొత్త ఆఫీసులో ప్రారంభిస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. క‌ల్కి భ‌గ‌వ‌న్, అమ్మ భ‌గ‌వాన్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న ఈ చానెల్ లో మార్పులు కూడా ఆస‌క్తిగా క‌నిపిస్తున్నాయి. ఇక కొత్త‌గా ఎట్ రిప‌బ్లిక్ పేరుతో కొత్త‌చానెల్ తెరంగేట్రానికి రంగంRead More


పీకే ఎఫెక్ట్: కాపుల‌కు మ‌రో బెర్త్

ఏపీ రాజ‌కీయాల్లో మ‌రో కొత్త ప‌రిణామం చోటు చేసుకుంటోంది. ఏపీ క్యాబినెట్ విస్త‌ర‌ణ వ్య‌వ‌హారాలు ముందుకొస్తున్నాయి. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు సింగ‌పూర్ లో ప‌ర్య‌టిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న తిరిగి వ‌చ్చిన త‌ర్వాత కీల‌క ప‌రిణామాలు ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఏపీ క్యాబినెట్ లో రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. బీజేపీకి చెందిన మాణిక్యాల‌రావు, కామినేని శ్రీనివాస్ రాజీనామాల త‌ర్వాత మూడు నెల‌లుగా అటు దేవాదాయ శాఖ‌తో పాటు ఇటు ప్ర‌ధాన‌మైన వైద్య‌, ఆరోగ్యం కూడా మంత్రి కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఖాళీలను భ‌ర్తీ చేసే ఆలోచ‌న‌లో భాగంగా మైనార్టీల‌కు ఒక ప‌ద‌వి కేటాయించాల‌ని చంద్ర‌బాబు ఆలోచిస్తున్నారు. ఆ స్థానాన్ని ష‌రీఫ్ కి దాదాపు ఖాయంగా భావిస్తున్నారు. వైసీపీ నుంచి వ‌చ్చి చేరిన మ‌రో ఇద్ద‌రు ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న‌ప్ప‌టికీ టీడీపీ ఎమ్మెల్సీ వైపు మొగ్గు చూపుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. జ‌లీల్Read More


బాబు ఆశ‌లు పండేలా లేదు..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకి ఓ స‌మ‌స్య ఉంది. ముంద‌స్తు ఎన్నిక‌లు గ‌తంలోనే ఆయ‌న్ని ముప్పు తిప్ప‌లు పెట్టాయి. చివ‌ర‌కు ఓట‌మి పాలుజేశాయి. ఇప్పుడు మ‌రోసారి ముందుస్తు మేఘాలు క‌మ్ముకుంటున్న త‌రుణంలో ఆయ‌న తీవ్రంగా స‌త‌మ‌తం అవుతున్నారు. ముంద‌స్తు బారి నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని భావిస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్ప‌టికీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను సాధార‌ణ స‌మ‌యానికే జ‌ర‌పాల‌ని ఆయ‌న ప‌ట్టుబ‌ట్టేలా క‌నిపిస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. కానీ ఫ‌లితాలు సందేహ‌మే. ఆయ‌న ఆశించింది జ‌రుగుతుంద‌ని ఊహించ‌డం కూడా క‌ష్ట‌మే. ఏపీలో చంద్ర‌బాబు కోరుకున్న‌ట్టుగా చివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల పునర్విభ‌జ‌న కూడా జ‌ర‌గ‌లేదు. చ‌ట్టంలో ఉన్న అంశాన్ని కూడా చంద్ర‌బాబుకి అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో కేంద్రం నిరాక‌రించింది. అలాంటి స‌మ‌యంలో ముంద‌స్తు విష‌యంలో చంద్ర‌బాబు కోరుకున్న‌ట్టు జ‌రిగే అవ‌కాశం లేదు. అందుకే జ‌మిలీకోసం ప‌ట్టుబ‌డుతున్న మోడీ దానికి త‌గ్గ‌ట్టుగాRead More


వైసీపీ విఫ‌ల‌మ‌య్యింది…!

విప‌క్ష వైసీపీకి ఓ అలవాటు ఉంది. సానుకూల‌తను చివ‌రి వ‌ర‌కూ కొన‌సాగించ‌డం విఫ‌లం అవుతూ ఉంటుంది. గ‌తంలో అనేక సార్లు ఇదే అనుభ‌వం ఉంది. ప్ర‌స్తుతం మ‌రోసారి ఆపార్టీ త‌న పాత అనుభ‌వాన్ని పున‌రావృతం చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అల‌వాటులో పొర‌పాటు మాదిరిగా త‌న మీద సాగుతున్న ప్ర‌చారం విష‌యంలో అప్ర‌మ‌త్త‌త లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టుగా ఉంది. తాజాగా ఏపీ రాజ‌కీయాల్లో వైసీపీకి ప్ర‌ధాన‌బ‌లం రెడ్లు అయితే, ఆత‌ర్వాత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. ఎస్సీల‌లో అత్య‌ధికులు క్రిస్టియ‌న్స్ ఉంటార‌ని భావిస్తే, క్రైస్త‌వ‌, ముస్లీం మైనార్టీలే జ‌గ‌న్ కి ఇప్ప‌టి వ‌ర‌కూ తోడుగా ఉన్నారు. ఇప్పుడు వారంతా దూర‌మ‌య్యే ప్ర‌మాదం దాపురించినా వైసీపీలో క‌ద‌లిక లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. బ‌లం మీద దెబ్బ‌ప‌డుతున్నా పెద్ద‌గా స్పందించ‌క‌పోవ‌డం పెద్ద స‌మ‌స్య కాబోతోంద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. దేశ‌వ్యాప్త ప‌రిణామాల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మూక‌ల కార‌ణంగాRead More