Main Menu

amaravathi

 
 

మ‌ళ్లీ గంటా మీద గురిపెట్టిన ఆంధ్ర‌జ్యోతి!

ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అవినీతిలో కూర‌కుపోయిందని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తుంటాయి. చంద్ర‌బాబు సెల‌క్ష‌న్లు..చిన‌బాబు క‌లెక్ష‌న్లు అన్న‌ట్టుగా మారింద‌ని కామెంట్స్ చేస్తుంటాయి. అందులో కొత్త‌ద‌నం లేదు. కానీ తాజాగా విప‌క్షాల వాద‌న‌కు త‌గ్గ‌ట్టుగా సొంత ప‌త్రిక స్వ‌రం వినిపించ‌డం ఆశ్చ‌ర్యంగానూ, రాజ‌కీయాంశంగానూ క‌నిపిస్తోంది. తాజాగా ఆంధ్ర‌జ్యోతిలో ‘హేమ్ స్కెచ్ బాసూ’ అంటూ 200 కోట్ల రూపాయ‌ల అవినీతి వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. స‌ర్వ‌శిక్షా అబియాన్ లో సాగుతున్న దందాల‌కు అద్దంప‌డుతోంది. ఇప్ప‌టికే ఎస్ఎస్ఏ నిధులు స్వాహా చేస్తున్నార‌ని బీజేపీ నేత సోము వీర్రాజు ఆరోపించారు. ఏకంగా గ‌వ‌ర్న‌ర్ కి లేఖ రాశారు. ఆయ‌న వాద‌న‌కు త‌గ్గ‌ట్టుగా ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక క‌థ‌నాలున్నాయి. స‌ర్కారీ బ‌డుల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కోసం కేటాయించిన నిధుల్లో టెండ‌ర్ల వ్య‌వ‌హారంలో గోల్ మాల్ జ‌రిగింద‌న్న‌ది ఆంధ్ర‌జ్యోతి క‌థ‌నం. సిండికేట్ గా మారి కొంద‌రు ఉన్న‌త వ్య‌క్తులుRead More


టీడీపీని కాపాడాలంటూ ఆమ‌ర‌ణ‌దీక్ష‌

తెలుగుదేశం పార్టీని కాపాడాలంటూ ఆపార్టీ నేత‌లే రోడ్డెక్కారు. ఏకంగా ఆమ‌ర‌ణ‌దీక్ష‌కు పూనుకున్నారు. దాంతో ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్ప‌టికే మూడు సార్లు వ‌రుస‌గా ఓట‌మి పాల‌యిన త‌ర్వాత కూడా పార్టీ నేత‌లు క‌ళ్లు తెర‌వ‌డం లేద‌ని వాపోతున్నారు. ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా అధిష్టానం స్పందించ‌డం లేదంటూ ఆమ‌ర‌ణ‌దీక్ష‌కు పూనుకున్నారు. మార్కెట్ యార్డ్ క‌మిటీ చైర్మ‌న్ రామిరెడ్డి దీక్ష‌తో గుంటూరు జిల్లా న‌ర్సారావుపేట టీడీపీ రాజ‌కీయాలు రోడ్డున ప‌డ్డాయి. ఒక‌ప్పుడు కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ప్రాతినిధ్యం వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గంలో 2004 నుంచి టీడీపీ ఓట‌మి పాల‌వుతోంది. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత ఇన్ఛార్జ్ ని నియ‌మించ‌డంలో పార్టీ అధిష్టానం జాప్యం చేస్తోంది. నేటికీ అది పూర్తిచేయ‌క‌పోవ‌డంతో జిల్లా మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు. జిల్లా పార్టీ అధ్య‌క్షుడు జీవీ ఆంజ‌నేయులు, పార్టీ అధినేత చంద్ర‌బాబు స‌హా అంద‌రికీ కార్య‌క‌ర్త‌లు ప‌దేRead More


అమ‌రావ‌తి అవినీతిపై మ‌రో పుస్త‌కం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని వ్య‌వ‌హారం మ‌రోసారి క‌ల‌క‌లం రేపింది. ఇప్ప‌టికే ఐవైఆర్ కృష్ణారావు సంచ‌ల‌నం రేప‌గా, తాజాగా ఆయ‌న స‌ర‌స‌న మ‌రో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చేరిపోయారు. ఈసారి చంద్ర‌బాబు స‌న్నిహితుడిగా గుర్తింపు పొందిన అజ‌య్ క‌ల్లాం చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, రాజధాని నిర్మాణం పేరుతో భారీ ఎత్తున డబ్బులు వృధా చేస్తున్నారని కల్లాం ఆరోపించారు. అంత‌టితో స‌రిపెట్ట‌కుండా అమ‌రావ‌తి వ్య‌వ‌హారాల‌పై తానో పుస్త‌కం రాయ‌బోతున్న‌ట్టు అజ‌య్ క‌ల్లం ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిగా మారింది. చంద్ర‌బాబు పాల‌నాతీరుని అజయ్ క‌ల్లాం త‌ప్పుబ‌ట్టారు. అభివృద్ధి కేంద్రీక‌ర‌ణ స‌రికాద‌న్నారు. విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం నగరాలకు పరిపాలనను విస్తరించాల‌ని డిమాండ్ చేశారు. ఏపీ కొత్త రాష్ట్రంగా ఏర్ప‌డిన‌ప్ప‌టికీ ప్రజలకు మంచి జరగకపోగా పాలకుల అవినీతి చాలా పెరిగిపోయిందని ఆరోపించారు. ఏపీలో కొత్త రాజధాని కట్టాలనుకునేది కేవలం పైరవీలRead More


ప్ర‌భుత్వ తీరుపై టీడీపీ నేత‌ల్లో అస‌హ‌నం

టీడీపీ నేత‌లు ఎదురుతిరుగుతున్నారు. ప్ర‌భుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మొన్న మండ‌లిలో అద్దంకి నేత క‌ర‌ణం బ‌ల‌రాం ప్ర‌శ్న‌ల‌కు పాల‌క‌ప‌క్ష నేత‌లు అవాక్క‌య్యారు. ప్ర‌కాశం జిల్లాను నిర్ల‌క్ష్యం చేస్తున్నారంటూ ఆయ‌న సూటిగానే విమ‌ర్శించారు. దాంతో పాటు దొన‌కొండ‌లో ప‌రిశ్ర‌మ‌లు ఎందుకు పెట్ట‌డం లేదంటూ నిల‌దీయ‌డంతో అంతా ఖంగుతిన్నారు. దాని నుంచి తేరుకోక‌ముందే తాజాగా మ‌రో ఎమ్మెల్యే గొంతు విప్పారు. రైతు స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న ప్ర‌శ్న‌ల‌కు పాల‌క‌ప‌క్షం నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకోవాల్సి వ‌చ్చింది. స‌మాధానం లేక స‌త‌మ‌తం కావాల్సి వ‌చ్చింది. రాష్ట్రంలో 2022 నాటికి రైతులకు రెట్టింపు ఆదాయం తెస్తామని చెప్పారని, అది ఎలా సాధ్యపడుతుంది, దానికేమైనా కార్యాచరణ ప్రణాళిక ఉందా, అలాంటిదేమీ లేకుండా రైతుల ఆదాయాన్ని ఎలా పెంచుతారో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అసెంబ్లీలో ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఒకవైపు పండించిన పంటలను నిల్వ ఉంచుకునేందుకుRead More


మీడియాను భ‌య‌పెడుతున్న మంత్రి!

ఏపీ మంత్రి నారాయ‌ణ వ్య‌వ‌హారం మామూలుగా ఉండ‌దు. బ‌డా వ్యాపారిగా గుర్తింపు పొంది ఆ త‌ర్వాత రాజకీయాల్లోకి వ‌చ్చారాయ‌న‌. ప్ర‌జ‌ల‌తో పెద్ద‌గా సంబంధం లేకుండానే పెద్ద‌ల స‌భ‌లో అడుగుపెట్టారు. ఆ వెంట‌నే అమాత్య హోదా ద‌క్కింది. కీల‌క‌మైన ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ పేరుతో రాజ‌ధాని వ్య‌వ‌హారాలన్నీ ఆయ‌న చేతుల్లోనే ఉన్నాయి. దాంతో ఆయ‌న ప్రాధాన్య‌త‌గ‌ల మంత్రిగా మారిపోయారు. కానీ పాత్రికేయులు మాత్రం ఈ మంత్రిని చూస్తే భ‌య‌ప‌డుతున్నారు. ముఖ్యంగా రాజ‌ధాని ప్రాంతంలో జ‌ర్న‌లిస్టుల‌యితే నారాయ‌ణ పేరెత్తితేనే ప‌రార‌వుతున్నారు. జ‌ర్న‌లిస్టులను ఓ రేంజ్ లో భ‌య‌పెడుతున్న మంత్రి వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మీడియా ప్ర‌తినిధుల‌న‌గానే దాదాపుగా నారాయ‌ణ కాలేజీ సిబ్బంది త‌ర‌హాలో ఆయ‌న ట్రీట్ చేస్తున్నార‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఆయ‌న ఓ మీడియా స‌మావేశం పెట్టాల‌నుకుంటే ఉద‌యాన్నే ఏడుగంట‌కు ఏర్పాటు చేస్తారు. దాంతో ఆరుగంట‌ల‌కుRead More


మ‌రో ఫిరాయింపు ఎమ్మెల్యేకి క్యాబినెట్ బెర్త్!

ఏపీ క్యాబినెట్ లో మూడోసారి మార్పులు ఖాయంగా క‌నిపిస్తోంది. మంత్రివ‌ర్గంలో మార్పుల పై టీడీపీ అధినేత దృష్టి సారించిన‌ట్టు ప్రచారం సాగుతోంది. ఇద్ద‌రు బీజేపీ మంత్రులు దూర‌మ‌యిన నేప‌థ్యంలో రెండు బెర్తులు భ‌ర్తీకి అవ‌కాశం ఉంది. అయితే ఇప్పుడు ఆశావాహుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో తేనెతుట్ట‌ను క‌దిలించే య‌త్నం చంద్ర‌బాబు చేస్తారా లేదా అన్న‌ది సందేహంగా క‌నిపిస్తోంది. గ‌తంలోనే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ నేప‌థ్యంలో పెను దుమారం చెల‌రేగింది. బుచ్చ‌య్య చౌద‌రి వంటి వారు తీవ్రంగా స్పందించారు. ఈ నేప‌థ్యంలో కాస్త చ‌ల్ల‌బ‌డుతున్న వాతావ‌ర‌ణాన్ని మ‌ళ్లీ వేడెక్కించే ప్ర‌య‌త్నం చంద్ర‌బాబు చేస్తారా అన్న‌ది సందేహ‌మే. కానీ తాజా ప‌రిణామాల‌తో ఊహాగానాలు మాత్రం పెరుగుతున్నాయి. చంద్ర‌బాబు నిజంగానే ఖాళీల భ‌ర్తీకి సిద్ద‌మ‌యితే మాత్రం ఈ సారి రెండు బెర్తుల‌ను ఒక‌టి మైనార్టీల‌కు, మ‌రోటి ఎస్టీల‌కు కేటాయించే అవ‌కాశం ఉంద‌నిRead More


ఎమ్మెల్యేల‌ను త‌ర‌లిస్తున్న జ‌గ‌న్

ఏపీ రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాల‌కు అవ‌కాశం ఏర్ప‌డుతోంది. దాంతో విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ అప్ర‌మ‌త్తమ‌య్యారు. అందులో భాగంగా త‌న ఎమ్మెల్యేల‌ను క్యాంప్ కి త‌ర‌లించే యోచ‌న‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. దానికి త‌గిన స్థానంగా గోవాని ఎంచుకున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే వైసీపీ ఎమ్మెల్యేల‌ను క్యాంప్ కి త‌ర‌లించడానికి త‌గ్గ‌ట్టుగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈ విష‌యంలో చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డికి బాధ్య‌త అప్ప‌గించార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఈనెల‌లో జ‌ర‌గ‌బోతున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. ముఖ్యంగా మూడు సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డంతో మూడింటిని కైవ‌సం చేసుకోవాల‌ని టీడీపీ వ్యూహం ర‌చిస్తోంది. అయితే మూడో అభ్య‌ర్థిని బ‌రిలో దింపాలా లేదా అన్న‌ది దానిపై ఓ నిర్ణ‌యానికి రాలేక‌పోతున్నట్టు స‌మాచారం. ముఖ్యంగా 23మంది ఎమ్మెల్యేలు ఫిరాయించ‌డంతో కేవ‌లం 44మంది మ్యాజిక్ ఫిగ‌ర్ మాత్ర‌మే వైసీపీకి మిగిలింది. అందులో ఒక‌రిద్ద‌రుRead More


అఖిలప్రియకు అండగా చినబాబు

అనుకున్నట్టే జరుగుతోంది. అఖిలప్రియను మంత్రిగా తొలగించబోతున్నట్టు సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని నారా లోకేష్ ప్రకటించారు. ఆమెకు అండగా చినబాబు వ్యవహరించినట్టు స్పష్టమవుతోంది. అఖిలప్రియను రాజీనామా చేయమని సీఎం కోరలేదన్నారు. బోటు ప్రమాదంలో వైఫల్యం పట్ల సీఎంగా సీరియస్ గా ఉన్నారని తెలిపారు. ప్రమాదానికి కారకులను వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. అందరిపైనా చర్యలుంటాయన్నారు. చాలాకాలంగా ఏపీ రాజకీయాల్లో భూమా అఖిలప్రియకు నారా లోకేష్ ఆశీస్సులు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. దానికి తగ్గట్టుగా తాజాగానే చంద్రబాబు సీరియస్ అయిన మరుక్షణం చినబాబు సీన్ లోకి వచ్చి అఖిలప్రియకు అండగా నిలవడం విశేషంగా మారింది. దాంతో చంద్రబాబు ఆశించినట్టు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించడానికి అఖిలప్రియ సిద్ధమవుతారా లేక చినబాబు చెప్పినట్టు దానికి దూరంగా ఉంటారా అన్న ఆసక్తి గా మారుతోంది. అదే సమయంలో నంది అవార్డులను విమర్శించేRead More


డిజైన్లు ఖరారు: 26న శంకుస్థాపన

ఏపీ రాజధాని డిజైన్ల వ్యవహారం మూడున్నరేళ్లు దాటినా కొలిక్కి రాలేదు. ఇంకా రేపోమాపో అనాల్సి వస్తోంది. నార్మన్ ఫోస్టర్ వ్యవహారంలో బాహుబలి దర్శకుడు రాజమౌళి కీలకంగా మారారు. ఆయన ఖరారు చేసిన డిజైన్లను త్వరలోనే ప్రభుత్వం ఓకే చేసేలా ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈలోగా రాజధానిలో మరో నిర్మాణానికి డిజైన్లు ఖరారయ్యాయి. ఈనెల 26న శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. మంగళగిరిలో నిర్మించనున్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యాలయ భవన నిర్మాణ డిజైన్లు ఖాయం కావడంతో నిర్మాణానికి పూేనుకుంటున్నారు. దానికి సంబంధించి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారు. ఉండవల్లిలోని నివాసంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళావెంకట్రావు, మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్సీ జనార్దన్‌ తదితరులు సమావేశమై ఈ ఆకృతులపై చర్చించారు. ఈ నెల 26న నిర్మాణRead More


చంద్రబాబుకి అస్వస్థత

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రాజధానిలో నిర్మించనున్న మెడిసిటీ భవనానికి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేసి సభలో మాట్లాడుతుండగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. తుళ్లూరు మండలం దొండపాడులో మెడిసిటీకి శంకుస్థాపన అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. విద్యా వైద్యానికి అమరావతిని హబ్‌గా మారుస్తామన్నారు. భవిష్యత్తులో అమరావతికి గల్ఫ్‌ దేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్నారు. త్వరలో అమరావతి నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమరైట్స్‌ (దుబాయి)కు విమాన సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. బహిరంగ సభలో 20 నిమిషాల పాటు మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించి కూర్చుండిపోయారు. రెండు నిమిషాల అనంతరం తేరుకొని యధావిధిగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి అలసటగా కనిపించడంతో సీఎంవో అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడే ఉన్న మంత్రి పుల్లారావు సీఎం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.