Main Menu

allu arjun

 
 

అయ్యో..అల్లు అర్జున్ మీద దాడి…!

allu arjun

టాలీవుడ్ స్ట‌యిలిష్ స్టార్ అల్లు అర్జున్ వ్య‌వ‌హారం ఇటీవ‌ల హాట్ టాపిక్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం మోడీ విష‌యంలో ఆయ‌న్ని నెటిజ‌న్లు ట్రోల్ చేశారు. ట్విట్ట‌ర్ సాక్షిగా ఎదురుదాడికి దిగారు. ఇక తాజాగా మ‌రోసారి అలాంటి ప‌రిస్థితి వ‌చ్చింది. ఈసారి త‌న సినిమా డైలాగ్ బ‌న్నీకి త‌ల‌నొప్పి తెచ్చిపెడుతోంది. అల్లు అర్జున్ లేటెస్ట్ మువీ నా పేరు సూర్య‌.నా ఇల్లు ఇండియా రిలీజ్ కి సిద్దం అవుతోంది. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ న‌టించిన సినిమా టీజ‌ర్‌ తాజాగా విడుద‌లయ్యింది. అభిమానుల నుంచి మంచి ఆద‌ర‌ణ వ‌స్తోంది. అయితే ఈ టీజ‌ర్ లో ఉన్న ఓ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగే బ‌న్నీని విమ‌ర్శ‌ల పాలుచేస్తోంది. `నార్త్ ఇండియా.. సౌత్ ఇండియా.. ఇలా అన్ని ఇండియాలు లేవురా. మ‌న‌కి ఒక్క‌టే ఇండియా` అంటూ సాగే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌ను బ‌న్నీRead More


అల్లు అర్జున్ కి త‌గిలిన సెగ‌

AluArjun

సోష‌ల్ మీడియాలో నిత్యం క‌నిపించే హీరోల‌లో అల్లుఅర్జున్ ఒక‌రు. ఇంట్లో వేడుక‌ల‌ను కూడా అభిమానుల‌తో పంచుకుంటూ బ‌న్నీ ఫేస్ బుక్, ట్విట్ట‌ర్ లో సంద‌డి చేస్తూ ఉంటాడు. అయితే తాజాగా అల్లు అర్జున్ చేసిన కొన్ని కామెంట్స్ ట్రోల్ అవుతున్నాయి. ప‌లువురు నెటిజ‌న్లు ఈ హీరో మీద మండిప‌డుతున్నారు. సెటైర్ల‌తో దాడి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ మ్యాగ్జైన్‌ ఒపీనియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కవర్‌ పేజీపై బన్నీ ఫోటోను ప్రచురించింది. స్టైలిష్‌ స్టార్‌ ఆఫ్‌ ది మిలీనియమ్‌గా పేర్కొంది. ఈ సంద‌ర్భంగానే నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో బన్నీ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఆయ‌న‌కు ప్రేర‌ణ ఎవ‌ర‌నే ప్ర‌శ్న రాగానే బ‌న్నీ న‌రేంద్ర‌మోడీని ప్ర‌స్తావించారు. గ‌తంలో ప‌లుమార్లు చిరంజీవి గురించి చెప్పిన బ‌న్నీ హ‌ఠాత్తుగా మోడీని ముందుకు తీసుకురావ‌డం చాలామందిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మోడీ స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నానంటూ బ‌న్నీRead More


బ‌న్నీది ఎన్టీఆర్ కి ఇష్ట‌మ‌ట‌..!

ntr-and-allu-arjun-share-same-dais_b_2606160551

ఎన్టీఆర్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రారంభం నాటి కన్నా కొంత ఆసక్తిగా మారింది. రానురాను టీవీ ప్రేక్షకుల్లో ఆదరణ పెంచుకుంటోంది. అదే సమయంలో అనేక ఆసక్తికర అంశాలకు వేదికవుతోంది. తాజాగా ఎన్టీఆర్ కూడా తనకిష్టమైన పాట గురించి ప్రస్తావించి అల్లు అర్జున్ పాటలోని కొన్ని లిరిక్స్ వినిపించడం విశేషంగా మారింది. ఎన్టీఆర్, అల్లుఅర్జున్ ఇద్దరి మధ్య చాలా పోలికలున్నాయి. నటనలోనే కాకుండా డ్యాన్సుల్లో వీళ్లిద్దరూ ఘనాపాఠీలు. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న స్టార్లు. నిత్యం పోటీ పడుతూ ఉండే వీళ్లిద్దరూ ఒకరి సినిమా గురించి మరొకరు ప్రస్తావించడం విశేషమ. అల్లుఅర్జున్ హీరోగా నటించిన ‘ఆర్య 2’ సినిమాలో మిస్టర్ పర్ఫెక్ట్ పాటంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. అంతేకాదు ఆ పాటలోని మూడు లైన్లు పాడి కూడా వినిపించాడు. బిగ్‌బాస్ హౌస్ నుండి ఎలిమినేట్Read More


డ్ర‌గ్స్ కేసులో అల్లు అర్జున్, రానా!

allu arjun

టాలీవుడ్ ని డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం ఇప్ప‌ట్లో వ‌దిలేలా లేదు. పెనుదుమారం దిశ‌గా సాగుతోంది. దాంతో ప‌లువురు ఇండ‌స్ట్రీ పెద్ద‌లే ఇప్పుడు బిక్కు బిక్కుమంటున్నారు. ఇన్నాళ్లుగా ద‌ర్జాగా సాగిపోయిన వ్య‌వ‌హారం ఇప్పుడు బ‌జారున ప‌డ‌డం క‌ల‌వ‌రం క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే ర‌వితేజ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు నోటీసులందుకుని సిట్ విచార‌ణ‌ల‌తో స‌త‌మ‌తం అవుతుండ‌గా తాజాగా ఈ వ్య‌వ‌హారం రానా, అల్లు అర్జున్ మెడ‌కు చుట్టుకుంటుందా అనే సందేహం మొద‌ల‌య్యింది. టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో తెలంగాణ యూత్‌ ఫోర్స్‌ సంస్థ కెవియెట్ దాఖలు చేసింది. డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ తారల వాదనను హైకోర్టు వినేముందు తమ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. కేసు నుంచి తప్పించుకునేందుకు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారని తెలంగాణ యూత్‌ ఫోర్స్‌ సంస్థ వాదిస్తోంది. రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన ఈRead More


అల్లు వారి అను క‌న్ఫ‌ర్మ్

allu anu

టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ల హ‌వా క‌నిపిస్తోంది. టాప్ హీరోలు కూడా వారికే అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ అలాంటి భామ‌ను ఎంచుకున్నారు. నా పేరు సూర్య సినిమా కోసం అను ఇమ్మాన్యుయేల్ కి ఓకే చెప్పారు. దాంతో ఈ భామ ఆనందానికి అవ‌ధుల్లేవు. ‘మజ్ను’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాలతో ఆకట్టుకున్న‌ అను ఇమ్మానియేల్ కి ఇది బంప‌రాఫ‌ర్ గానే భావించాలి. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. లగడపాటి శ్రీధర్‌, శిరీషా నిర్మాతలు. ఈ చిత్రంలో కథానాయికగా అను ఇమ్మానియేల్‌ని ఎంచుకొన్నారు. వచ్చే నెల తొలివారంలో చిత్రీకరణ మొదలుపెడతారు. వ‌చ్చే న‌వంబ‌ర్ నాటికి సినిమా సిద్ధం చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు.‘‘బన్నీ పక్కన నటించేందుకు చాలా మంది కథానాయికల పేర్లు పరిశీలించాం.Read More


ఎఫ్ బీలో ‘డీజే’ పూర్తి సినిమా..!

allu arjun dj

పైరసీ భూతం మరోసారి పడగ విప్పింది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డీజే’ దువ్వాడ జగన్నాథమ్‌’. హరీష్‌ శంకర్‌ దర్శకుడు. పూజాహెగ్డే కథానాయిక. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ‘డీజే’ పూర్తి చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే తెచ్చుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌ నటన, కామెడీ అందర్నీ ఆకట్టుకుంది. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే చిత్రం ఆన్‌లైన్‌లోకి రావడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమాను పైరసీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.


బ‌న్నీకి షాకిచ్చిన కొడుకు!

dj

టాలీవుడ్ స్ట‌యిలిస్ స్టార్ షాక‌య్యాడు. అది కూడా సొంత కూడా వ్య‌వ‌హారం చూసి. డీజే ఆడియో వేడుక‌లో క‌నిపించిన సీన్ తో నోరెళ్ల‌బెట్టాల్సి వ‌చ్చిందంటూ స్వ‌యంగా అల్లు అర్జున్ వెల్ల‌డించ‌డం విశేషం. కొడుకు ఆయాన్ వ్య‌వ‌హారం చూసి ఆశ్చ‌ర్య‌పోయాన‌ని చెప్పుకోచ్చాడు. బన్నీ తాజా సినిమా ‘డీజే దువ్వాడ జగన్నాథం’ విడుదలయ్యాయి. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను అల్లు అరవింద్‌ మనవడు, బన్నీ కొడుకు అయాన్‌ , ‘దిల్‌’ రాజు మనవడు ఆరాన్ష్‌ కలిసి విడుదల చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ పాటల వేడుకలో ఓ ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ఈ వేడుకలో అయాన్‌ జనాలను చూసి ఇచ్చిన ఓ పోజు తల్లిదండ్రులు అల్లు అర్జున్‌-స్నేహరెడ్డిలను ఆశ్చర్యంలో ముంచెత్తితే.. అక్కడే ఉన్న తాత అల్లు అరవింద్‌ను పొట్టచెక్కలయ్యేలా నవ్వించేసింది. ఇంతకూ బుజ్జీ అయాన్‌ ఏంRead More


డీజే వివాదంలో వెన‌క‌డుగు

allu arjun dj

వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నఅల్లు అర్జున్‌ ‘డీజే– దువ్వాడ జగన్నాథం’ సినిమాను దర్శకుడు హరీశ్‌ శంకరే స్వయంగా గట్టెక్కించారు. సినిమాలోని ఓ పాటలో ప్రయోగించిన ‘నమక చమకాలు’, ‘ప్రవర’, ‘అగ్రహారాల’ అనే పదాలను తొలగిస్తామని ఆ సినిమా దర్శకుడు హరీశ్‌శంకర్, గీత రచయిత సాహితి తెలిపారు. చిత్రంలోని ఓ పాటలో కొన్ని పదాలను ఉపయోగించడంపై బ్రాహ్మణ సంఘాలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ సంఘం నేతలు సోమవారం ‘డీజే’ సినిమా దర్శకుడు హరీష్‌శంకర్‌ను, గేయ రచయిత సాహితిని వారి కార్యాలయంలో కలిశారు. ‘నమక, చమకాల’ ప్రాశస్త్యాన్ని వివరించి, ఆ పదాలను తొలగించాలని కోరారు. దీనిపై హరీష్‌ శంకర్‌ స్పందిస్తూ.. ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో పాటను రాయలేదని, పండితుల, బ్రాహ్మణ సంఘాల కోరిక మేరకు వాటిని మారుస్తామన్నారు. పాటలో మార్పుచేర్పులకు అంగీకరించిన దర్శక నిర్మాతలకు వారుRead More


వివాదంలో బ‌న్నీ మువీ

dj

అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథమ్‌ (డీజే) సినిమా వివాదాల్లో ఇరుక్కుంటోంది. విడుద‌లకు ముందే పాట‌లే పెద్ద దుమారం రేపేలా క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన రెండో పాట విష‌యంలో అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏకంగా సెన్సార్ బోర్డ్ వ‌ర‌కూ ఈ వ్య‌వ‌హారం చేరుతోంది. అదుర్స్ సినిమాకు సీక్వెల్ గా భావిస్తున్న ఈ సినిమా కూడా అదే త‌ర‌హాలో సాగుతుండ‌డం విశేషం. అప్ప‌ట్లో అదుర్స్ సినిమా మీద బ్రాహ్మ‌ణ సంఘాలు మండిప‌డ్డాయి. ఇక ఇప్పుడు కూడా బ్రాహ్మ‌ణ సంఘాల ప్ర‌తినిధులు సెన్సార్ బోర్డ్ మీద ఒత్తిడి తీసుకొస్తుండ‌డం విశేషం. డీజే సినిమాలో బ్రాహ్మణుల్ని, రుషులను కించపరిచేలా ఉన్న పాటలను వెంటనే నిలుపుదల చేయాలని తెలంగాణా బ్రాహ్మ‌ణ స‌మాఖ్య డిమాండ్ చేస్తోంది. స్పందించ‌కుండా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చ‌రిస్తోంది. ‘డీజే’ సినిమాలో ‘‘అస్మైక యోగ తస్మైక భోగ’’Read More


డీజేకి లీకేజీ స‌మ‌స్య‌

allu arjun dj

అల్లు అర్జున్ కి కొత్త స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. దువ్వాడ జ‌గ‌న్నాథం అంటూ జ‌నం ముందుకు రాబోతున్న బ‌న్నీని లీకేజీ స‌మ‌స్య వెంటాడుతోంది. స‌మ్మ‌ర్ చివ‌ర‌లో డీజేనంటూ అల్లు అర్జున్ దూసుకొస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మామూలుగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే టీజర్ విడుదల కావడంతో అన్ని వర్గాలవారు ఎంతో ఆసక్తిగా చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే డీజేకు కూడా లీకేజీ బాధలు తప్పేటు లేవని తెలుస్తోంది. ఈ మధ్య ప్రతి సినిమాకు సంబంధించి ఏదో ఒక విషయం లీకు అవడం సర్వసాధారణమైపోయింది. సినిమా విడుదలకు ముందే అందులోని సీన్స్, డైలాగ్స్, సాంగ్స్ లీకైపోతున్నాయి. తాజాగా డీజే కూడా లీకేజీ బారిన పడిందని తెలుస్తోంది. ఇప్పుడీ ప్ర‌చారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. పెద్ద చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.