ALLARI NARESH

 
 

మ‌ల్టీస్టార‌ర్ రూట్ లో మ‌హేష్..!

mahesh

మహేష్ బాబు సినిమాల విష‌యంలో చాలా సెల‌క్టివ్ గా ఉంటారు. స‌క్సెస్ లు, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఈ సూప‌ర్ స్టార్ సినిమాలుంటాయి. అంతేగాకుండా మ‌ల్టీస్టార‌ర్ మువీస్ తోనూ అటు అభిమానుల‌ను, ఇటు సామాన్య ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డం మ‌హేష్ కే చెల్లింది. ఇక ఇప్పుడు ఓ యాక్ష‌న్ మువీతో మురుగుదాస్ తో క‌లిసి ముందుకొస్తున్న మ‌హేష్ ఆ త‌ర్వాత మ‌రోసారి మ‌ల్టీస్టార‌ర్ వైపు క‌న్నేసిన‌ట్టు క‌నిపిస్తోంది. మురుగదాస్ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ అనే పొలిటికల్ థ్రిల్లర్ కి సిద్ధ‌మ‌వుతున్నాడు. ఆ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించాడు. అశ్వనీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒక‌టి హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మహేష్ బాబు నటించనున్నఈ సినిమా మల్టీ స్టారర్Read More


‘ఇంట్లో దెయ్యం..’ వచ్చేస్తోంది..

Intl-Dayyam-Nakem-Bhayam

టాలీవుడ్లో, ‘అల్లరి’ నరేష్‌ కథానాయకుడిగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’. ఈ చిత్ర ఆడియోను అక్టోబర్‌ 28న విడుదల చేయనున్నట్లు నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ తెలిపారు. ఈ సందర్భంగా చిత్రంలోని ‘శతమానం భవతి’ పాటను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుటుంబం అంతా హాయిగా ఆనందిస్తూ చూసే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు వివరించారు. సాయికార్తీక్‌ అందించిన గీతాలు అందర్నీ అలరిస్తాయని కథానాయకుడు నరేష్‌ అన్నారు.జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో గతంలో ‘సీమశాస్త్రి’, ‘సీమ టపాకాయ్‌’ చిత్రాల కోవలోనే ఇది కూడా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నవంబర్‌ 11న ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


ప్ర‌మోష‌న్ సాదించిన స‌డెన్ స్టార్..!

allari naresh

యంగ్ హీరో అల్లరి నరేష్ కు ప్రమోషన్ వచ్చింది. ఇప్పటి వరకు వెండితెర మీద అల్లరి హీరోగా ఉన్న నరేష్ ఇంట మరింత నవ్వులు కనిపించనున్నాయి. గత ఏడాది మేలో విరుపతో నరేష్ వివాహం ఘనంగా జరిగింది. కాగా బుధవారం నరేష్ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. తను తండ్రి అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న నరేష్, అందమైన కూతురు జన్మించటం తన అదృష్టం అంటూ ట్వీట్ చేశాడు. మరో యంగ్ హీరో నాని, హీరోయిన్ ప్రియమణి… నరేష్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘టీచర్ : నువ్వు బాగా అల్లరి చేస్తున్నావ్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్? స్టూడెంట్ : అల్లరి నరేష్ ఇట్స్ ఏ బేబీ గర్ల్ కంగ్రాట్స్ బాబాయ్’ అంటూ నరేష్ పాపను ఎత్తుకున్న ఫోటో తో సహా ట్వీట్Read More


‘అల్లరి నరేష్‌’కి ‘అమితాబ్‌’ రికమెండేషన్‌..

Allari-Naresh

‘అల్లరి’తో మొదలైన నరేష్‌ స్పీడు 50 చిత్రాల్ని దాటుకొంటూ వెళ్లిపోయింది. అయితే గత కొంతకాలంగా నరేష్‌ ఖాతాలో సరైన విజయం పడలేదు. ‘సెల్ఫీ రాజా’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చే ప్రయత్నం చేశాడు ఈ అల్లరోడు. ఆ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా అల్లరి నరేష్‌ చెప్పుకొచ్చిన సెల్ఫీ.. సంగతులు..ఆయన మాటల్లోనే చదువుకోండి మరి…. ‘హీరోనా, దర్శకుడినా అనే క్లారిటీ ఉండేది కాదు కానీ, ఏం చేసినా ఈ ఇండ్రస్ట్రీలోనే అనేది మాత్రం క్లియర్‌గా తెలుసు. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణమే కనిపించేది. నాన్నగారు యేడాదికి రెండు మూడు సినిమాలు చేస్తుండేవారు. ఇంట్లో కనీసం ఓ డజనుమంది సహాయ దర్శకులు ఉండేవారు. నా బాల్యమంతా అలానే గడిచింది. నన్ను ప్రొడ్యూసర్‌ని చేయాలన్నది నాన్న ఆలోచన. ‘చాలా బాగుంది’ సినిమాకి క్యాషియర్‌గా పనిచేశా.Read More


ఇద్దరు ‘రాజా’లు మూడోసారి….

selfie raja

అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సెల్ఫీరాజా’. నరేష్‌తో సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు జి.ఈశ్వర్ రెడ్డి డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. షూటింగ్ పూర్తిచేసుకుని జులై 15న తెరమీదకు రానున్న ‘సెల్ఫీరాజా’ చిత్రానికి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’గా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ వాయిస్ ఓవర్ అందిచడం విశేషం. శర్వానంద్ వాయిస్ ఓవర్ సినిమాకు ప్లస్ కానుందని చిత్రయూనిట్ భావిస్తోంది. ‘గ‌మ్యం’ వంటి బెంచ్ మార్క్ మూవీతో పాటు, ‘నువ్వా నేనా’ అనే ఎంట‌ర్ టైనింగ్ మూవీలో శ‌ర్వానంద్‌, అల్ల‌రి న‌రేష్‌ల కాంబినేష‌న్ స‌క్సెస్ అయ్యింది. సెల్ఫీరాజా చిత్రానికి వాయిస్ అందించ‌డం ద్వారా వీరు మూడోసారి క‌లిసి ప‌ని చేస్తున్న‌ట్ట‌య్యింది. సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే విడుద‌ల‌కు ముందు టూర్‌లో విడుద‌ల చేసిన సాంగ్స్‌కు మంచిRead More