Main Menu

టీడీపీ

 
 

వైసీపీ రాజీనామాలు: బైఠాయించిన టీడీపీ

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్ సమావేశాలు స్తంభింపజేసిన పార్టీల నేతలు, వాయిదా తర్వాత కూడా నిరసనలు సాగిస్తున్నారు. సభలో ఆందోళనలకు ప్రభుత్వం దిగిరాకపోవడంతో స్పీకర్ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా పార్లమెంట్ లో హోదా విషయాన్ని చర్చించనందుకు నిరసనగా వైసీపీ రాజీనామాలు చేసింది. ఆపార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామాలు సమర్పించారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్ రాజీనామాలు సమర్పించారు. స్పీకర్ ఫార్మెట్ లో రూపొందించిన రాజీనామాలను నేరుగా తీసుకెళ్లి స్పీకర్ సుమిత్రా మహాజన్ కి అందించారు. తమ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నందున తాము పార్లమెంట్ లో కొనసాగలేమని తేల్చేశారు. అదే సమయంలో టీడీపీ కూడా రాజీనామాలకు ససేమీరా అన్నప్పటికీ స్పీకర్ ఛాంబర్ లో మాత్రం బైఠాయించింది. నిన్న సెంట్రల్ హాల్ లో నిరసన తెలిపిన నేతలంతా ఈరోజుRead More


టీడీపీలో కుర్చీలాట‌

కాకినాడ కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నిక ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు టీడీపీలో మాత్రం మేయర్‌ లొల్లి జోరందుకుంది. డిప్యూటీ మేయర్‌ పదవికి కూడా టీడీపీ నేతలు పట్టు బిగించారు. మేయర్‌ పదవిని అర్బన్‌కిస్తే, డిప్యూటీ మేయర్‌ను రూరల్‌కు ఇవ్వాలని ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి డిమాండ్‌ చేస్తున్నారు. అధిష్టానం ఎన్ని రూ. కోట్లకు బేరం పెట్టినా, ఎన్ని షరతులు పెట్టినా తలాడించేందుకు ఆశావహులంతా సిద్ధమయ్యారు. ప్రస్తుతం రేసులో 38వ డివిజన్‌ కార్పొరేటర్‌ మాకినీడి శేçషుకుమారి, 28వ డివిజన్‌ కార్పొరేటర్‌ సుంకర పావని, 40వ డివిజన్‌ కార్పొరేటర్‌ సుంకర శివప్రసన్న, 8వ డివిజన్‌ కార్పొరేటర్‌ అడ్డూరి వరలక్ష్మి ఉన్నారు. రేసులో ప్రధానంగా ఉన్న మాకినీడి శేషుకుమారి వెనుక మంత్రి నారాయణ ఉండగా, సుంకరి శివప్రసన్న వెనక మంత్రి యనమల, సుంకరి పావని వెనక ఎంపీ తోట నర్సింహం, పలువురు ఎమ్మెల్యేలు,Read More


టీడీపీకి డ్వాక్రా మ‌హిళ‌లే ఓట్లేయించాలి..!

ఎవ్వరికైనా తిండి పెట్టినవాడిని అన్నదాత అని ఆశీర్వదించడం మన సంస్కృతి. డ్వాక్రా సంఘాలను నేనే ప్రారంభించాను. రూ.6 వేలు చొప్పున పసుపు కుంకుమ కింద ఇచ్చాను. రుణాలపై వడ్డీ మాఫీ చేశాను. నెలకు రూ.10 వేల చొప్పున ఆదాయం చూపిస్తాను. ఇంకా రూ.20 వేల ఆదాయం వచ్చేట్లు చేస్తాను. ఇది గుర్తుంచుకోండి. 65 లక్షల మంది టీడీపీ కార్యకర్తలతో 90 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలు కలిసి పనిచేయాలి. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 80 శాతం ఓట్లేయించాలి…’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా సంఘాలకు మరోసారి ఎర వేశారు. ఆయన సోమవారం శ్రీకాకుళం జిల్లా పాల కొండ నియోజకవర్గం పరిధి వీరఘట్టం మండలంలోని తెట్టంగి గ్రామంలో ‘ఇంటింటా టీడీపీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు.


టీడీపీ ఆశలు నీరుగార్చేస్తున్న కాంగ్రెస్

నంద్యాలలో టీడీపీ ఎత్తులు బూమరాంగ్ అవుతున్నాయా..కాంగ్రెస్ అభ్యర్థి కారణంగా వైసీపీ ఓట్ బ్యాంక్ కి చిల్లుపడుతుందని ఆశిస్తే చివరకు టీడీపీకే తలనొప్పిగా మారుతోంది. కాంగ్రెస్ చీల్చే ఓట్లన్నీ టీడీపీ కి దక్కాల్సినవేనా..ఇదే అనుమానం ఇప్పుడు పెరుగుతోంది. టీడీపీ శిబిరంలో కలకలం రేకెత్తిస్తోంది. చివరకు ఫలితాలను తారుమారు చేసే విధంగా మారుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది. నంద్యాలలో కాంగ్రెస్ అభ్యర్థిగా మైనార్టీ వర్గానికి చెందిన అబ్దుల్ ని నిలబెట్టారు. సుదీర్ఘకాలంగా కార్మికుల సమస్యలపై పనిచేసిన బనగానపల్లెకి చెందిన ఆయన ఈ ఎన్నికల్లో కొన్ని ఓట్లు చీల్చడం ఖాయంగా కనిపిస్తోంది. అవి ఎవరివి, ఎన్ని అన్నదే ప్రశ్నార్థకం. వాస్తవానికి తొలుత కాంగ్రెస్ చీల్చే ఓట్లతో వైసీపీకి నష్టం ఖాయమని అంతా భావించారు. వైసీపీ నేతల్లో కూడా ఆందోళన కనిపించింది. కానీ తీరా చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థికి దక్కే ఓట్లు ,Read More


టీడీపీ ఆఖ‌రి ఆశ‌లు కూడా ఆవిరి

నంద్యాల ఉప ఎన్నిక‌ల కోసం టీడీపీ చేసిన ప్ర‌య‌త్నాల‌న్నీ బెడిసికొడుతున్నాయి. ఆఖ‌రి ఆశ‌గా భావించిన కొత్త ఓట‌ర్ల వ్య‌వ‌హారం కూడా బూమ‌రాంగ్ అయ్యింది. దాంతో తెలుగుదేశం శ్రేణులు ఢీలా ప‌డ్డాయి. ఆఖ‌రి ఆశ‌లు కూడా ఆవిరి కావ‌డంతో నిరాశ‌లో మునిగిపోయాయి. ఎన్నిక‌ల క‌మిష‌న్ తాజా ఆదేశాల ప్ర‌కారం జ‌న‌వ‌రి 1 , 2017 నాటికి ఓట‌ర్లుగా ఉన్న వారికే ఓటు హ‌క్కు క‌ల్పించ‌బోతున్నారు. దాంతో ఇటీవ‌ల నంద్యాల‌లో కొత్త‌గా చేరిన ఓట్ల‌న్నీ నిష్ప్ర‌యోజ‌నంగా మారిపోవ‌డంతో ఏపీలో అధికార‌ప‌క్షానికి మింగుడు ప‌డ‌డం లేదు. తెలుగుదేశం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చిందనే చెప్ప‌వ‌చ్చు. ఈసీ తాజా ఆదేశాలతో టీడీపీకి ఝలక్‌ ఇచ్చినట్లు అయింది. తాజా ఓటర్ల చేరికను పరిగణనలోకి తీసుకోబోమని సీఈసీ స్పష్టం చేసింది. కాగా ఇటీవేల దాదాపు 15వేల మందిని కొత్తగా ఓటర్లగా టీడీపీ చేర్చింది.Read More


చంద్ర‌బాబు కోపం వ‌చ్చింది..!

అద్దంకి వ్య‌వ‌హారం హాట్ హాట్ టాపిక్ అవుతోంది. టీడీపీ వ్య‌వ‌హారాల్లో పెను దుమారం దిశ‌గా సాగుతోంది. అద్దంకి వ్య‌వ‌హారాల్లో త‌ల‌దూర్చ‌బోన‌ని మాట ఇచ్చి ఎమ్మెల్సీ ప‌ద‌వి తీసుకున్న క‌ర‌ణం బ‌ల‌రాం వ్య‌వ‌హారం చంద్ర‌బాబు కి కోపం ర‌ప్పించిన‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌కాశం జిల్లాలో పార్టీ ప‌రిణామాల‌పై ఆందోళ‌న చెందుతున్న చంద్ర‌బాబు తాజాగా స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో అద్దంకి నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలపై చర్చ జరిగింది. ఎమ్మెల్సీ కరణం బలరాం తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అద్దంకి నియోజక వర్గంలో కరణం బలరాం మాట చెల్లదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ నియోజకవర్గంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చెప్పిందే ఫైనల్ అని తేల్చేశారు. కరణం బలరాంకు ఎమ్మెల్సీ ఇచ్చిన సమయంలోనే ఈ విషయం చెప్పినట్లు చంద్రబాబు గుర్తుచేశారు.Read More


లోకేష్ కి షాకిచ్చిన క‌ర్నూలు వాసులు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. కర్నూలు సభలో మంత్రి లోకేష్‌కు స్థానికులు సూటి ప్రశ్న సంధించడంతో నీళ్లు నమలడమే మంత్రి వంతయింది. రాయలసీమకు భారీగా పరిశ్రమలొచ్చాయని తమ ప్రభుత్వ పనితీరు కారణంగానే పెట్టుబడులొస్తున్నాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. కియ మోటార్స్‌ కంపెనీ రావడంతో 5 లక్షల మంది స్థానికులకు ఉద్యోగాలు వచ్చాయని మంత్రి చెప్పడంతో అక్కడి ప్రజలకు చిర్రెత్తుకొచ్చింది. అయితే 5 లక్షల ఉద్యోగాలు వచ్చిన వారిలో ఒక్కరిని చూపిస్తే చాలంటూ స్థానికులు మంత్రి లోకేష్‌ను నిలదీశారు. వెంటనే స్పందించిన స్థానిక టీడీపీ నాయకులు లోకేష్‌ను ప్రశ్నించిన వారిని అడ్డుకుని వారించే యత్నాలు మొదలుపెట్టారు. దీంతో స్థానికుల ఆగ్రహం రెట్టింపయింది. మీ నాయకుడి ముందు మీరు ఎలాగూ మాట్లాడలేరు.. కనీసం మమ్మల్ని అయినా మాట్లాడనివ్వాలంటూRead More


స‌వాల్ కి సై అంటున్న రోజా

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించిన 9 హామీలపై టీడీపీ సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన పథకాలపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, ఒకవేళ అనుమానం ఉంటే చంద్రబాబును తక్షణమే రాజీనామా చేయమనాలని, ఆ పథకాలను ఎలా చేసి చూపిస్తారో జగన్‌ నిరూపిస్తారని ఆమె పేర్కొన్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు వెంటనే అసెంబ్లీని సమావేశపరిస్తే లెక్కలతో సహా వైఎస్‌ జగన్‌ సమాధానం చెబుతారు. ఇప్పటివరకూ టీడీపీ వైఎస్‌ జగన్‌ ని చూసి మాత్రమే భయపడేదని, అయితే ఇప్పుడు ప్రశాంత్‌ కిషోర్‌ను చూసి కూడా వణికిపోతున్నారని అర్థం అవుతోంది. అయినా మా పార్టీ ఎవరి సలహాలు తీసుకుంటే టీడీపీకి ఎందుకు?. నరేంద్ర మోదీ గత ఎన్నికల్లో ప్రశాంత్‌ కిషోర్‌ సలహాలు తీసుకున్నారు.Read More


అఖిల‌ప్రియ అల‌క‌..!

నంద్యాల టీడీపీలో ఆధిప‌త్య పోరు తార‌స్థాయికి చేరుతోంది. ఉప ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాక‌ముందే నేత‌ల మ‌ధ్య వైరం బ‌య‌ట‌ప‌డుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం సోద‌రుడు కేఈ ప్ర‌భాక‌ర్ జోక్యం తో అంత‌ర్గ‌త పోరు ర‌చ్చ‌కెక్కుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఈ విష‌యంలో కేఈ ప్ర‌భాక‌ర్ కి ఎన్నిక‌ల బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డాన్ని అఖిల‌ప్రియ స‌హించ‌లేక‌పోతున్న‌ట్టు స‌మాచారం. తాజాగా ప్ర‌భాక‌ర్ నిర్వ‌హించిన స‌మావేశానికి మంత్రి అఖిల‌ప్రియ ఢుమ్మా కొట్టడానికి కార‌ణ‌మిదేన‌నే ప్ర‌చారం సాగుతోంది. నంద్యాల‌కు బాధ్య‌త వ‌హిస్తున్న మంత్రి దూరంగా ఉండ‌డంతో అ సమావేశాన్ని మొత్తం మాజీ మంత్రి ఫరూఖ్, కేఈ ప్రభాకర్, ఏవీ సుబ్బారెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి నడిపించారు. మరోవైపు భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి అఖిలప్రియ మధ్య విభేదాలు యథావిధిగా కొనసాగుతున్నట్టు అధికార పార్టీలో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మంత్రితో కాకుండాRead More


రామోజీకి చంద్ర‌బాబు ఏమిప్పించారో తెలుసా..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు ఇటీవ‌ల ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తున్నాయి. ఆట‌గాళ్ల కుడా నోబెల్ ప్రైజ్ ఇప్పిస్తాన‌ని చెప్పిన ఆయ‌న మాట‌లు సోష‌ల్ మీడియాలో హోరెత్తాయి. ఇక తాజాగా దానికి మించిన మాట‌లు ఆయ‌న మాట్లాడారు. ఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీరావు స‌మ‌క్షంలోనే ఆయ‌న గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్య‌లు బాబు-ఈనాడు బంధం గురించి అంద‌రికీ తెలిసేలా చేశాయి. ఇటీవ‌ల రామోజీరావు ని కేంద్రం పద్మ‌విభూష‌ణ్ గా ఎంపిక చేసింది. అయితే దానికి కార‌ణం తానేన‌ని చంద్ర‌బాబు చెప్పుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఇప్పించింది తానేనని ఆయ‌న బాహాటంగా ప్ర‌క‌టించారు. కృష్ణాజిల్లా పెదపారుపూడిలో రామోజీ ఫౌండేషన్‌ ఆ«ధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో సీఎం ఈ వ్యాఖ్య‌లు చేశారు. అంతేగాకుండా మంత్రులు, ఎమ్మెల్యేల ప‌నితీరును ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నామ‌న్నారు. వారి తీరు గురించిRead More