Main Menu

కోహ్లీ కీర్తికిరీటంలో మ‌రో ఘ‌న‌త‌

Spread the love

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన ఘనతను సాధించాడు. విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో సౌరవ్‌ గంగూలీతో కలిసి కోహ్లి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఇప‍్పటివరకూ విదేశాల్లో 24 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి 11 విజయాలు సాధించాడు. ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా గెలుపు తర్వాత గంగూలీతో కలిసి టాప్‌ను ఆక్రమించాడు. కాగా, గంగూలీ విదేశాల్లో 28 టెస్టుల్లో సారథ్యం వహించి 11 విజయాలు సాధించగా, కోహ్లి 24 టెస్టుల్లోనే ఆ గెలుపు మార్కును చేరుకోవడం విశేషం. విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో గంగూలీ, కోహ్లిల తర్వాత స్థానాల్ల ఎంఎస్‌ ధోని(6), రాహుల్‌ ద్రవిడ్‌(5)లు ఉన్నారు.

ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జోహనెస్‌బర్గ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌ను గెలిచిన భారత్‌.. ఇంగ్లండ్‌తో ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఆపై ఆసీస్‌తో ప్రస్తుత సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌, మెల్‌బోర్న్‌ టెస్టులు భారత్‌ ఖాతాలో చేరాయి. తద్వారా 1968లో న్యూజిలాండ్‌పై వారి దేశంలో గెలిచిన టెస్టు మ్యాచ్‌ల రికార్డును భారత్‌ తాజాగా సవరించింది.






Related News

ఆ ముగ్గురే ఏ ప్ల‌స్

Spread the loveటీమిండియా ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ గ్రేడ్లు ప్ర‌క‌టించింది. వాటి ఆధారంగా ఆట‌గాళ్ల‌కు రెమ్యునేష‌న్ అందిస్తారు. అయితే ఈసారి జాబితాలోRead More

ఒక్క మ్యాచ్ లో ఎన్ని రికార్డులో..!

Spread the loveరికార్డుల ప‌రంప‌ర సాగుతోంది. విండీస్, ఇంగ్లాండ్ సిరీస్ ఆస‌క్తిక‌రంగా మారుతోంది. హోరాహోరీ పోరులో బ్యాట్స్ మెన్లు ప‌రుగులRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *