Main Menu

వైర‌ల్ గా మారిన కోహ్లీ కిస్

VIRAT-KOHLI
Spread the love

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా అదో సంచ‌ల‌నం అవుతోంది. గ్రౌండ్ లో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌తో చెడుగుడు ఆడుతున్న కోహ్లీ మైదానం బ‌య‌ట‌కూడా త‌న‌దైన మార్క్ చూపుతున్నాడు. ముఖ్యంగా ముద్దుగుమ్మ అనుష్క శ‌ర్మ‌ను పెళ్లి చేసుకున్న కోహ్లీ హాట్ టాపిక్ అయ్యాడు. ల‌వ‌ర్స్ గా నాలుగేళ్ల పాటు నిత్యం మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసిన ఈ జంట పెళ్లి త‌ర్వాత కూడా అదే రీతిలో సాగుతోంది.

తాజాగా అనుష్క‌ను ముద్దు పెట్టుకున్న కోహ్లీ ఫోటో ఒక‌టి ఫోస్ట్ చేశాడు. అంతే అభిమానుల ఆనందానికి హ‌ద్దుల్లేవు. వెంట‌నే లైకుల వ‌ర్షం కురిసింది. ఈ ఫోటో పెద్ద వైర‌ల్ అవుతోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న కోహ్లి తన భార్యకు ప్రేమతో ముద్దు పెట్టినట్లుగా ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో కొన్ని గంటల్లోనే 20 లక్షలకు పైగా లైక్స్ సొంతం చేసుకుంది. వన్ అండ్ ఓన్లీ అన్న క్యాప్షన్‌తో కోహ్లి చేసిన పోస్ట్‌కు విశేష స్పందన వస్తోంది. వీరి వెనకాల సైతం ఓ జంట ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఉండటం గమనార్హం. భార్యకు ప్రేమతో కోహ్లి ఈ పోస్ట్ చేశాడని కొందరు, జంట చూడచక్కగా ఉందని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.






Related News

Australia-v-England-Game-2

వ‌ర‌ల్డ్ రికార్డ్: ఆసీస్ ని అల్లాడించిన ఇంగ్లాండ్

Spread the loveమూలిగే న‌క్క‌పై తాటికాయ‌ప‌డ్డ‌ట్టుగా మారుతోంది. అస‌లే అంతంత‌మాత్రంగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ తో ఇంగ్లాండ్ ఆట‌గాళ్లుRead More

rohit-sharma-scored-his-17th-o

రోహిత్ కూడా ప్ర‌శ్నార్థ‌క‌మే

Spread the loveఇంగ్లాండ్ తో సిరీస్ కి బ‌య‌లుదేరే ముందు భార‌త క్రికెట్ జ‌ట్టు కీల‌క ఆట‌గాళ్ల ప‌రిస్థితి ఢోలాయ‌మానంలోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *