Main Menu

వ‌రుస ప‌రాభ‌వాలు

Spread the love

టీమిండియాకు స్వింగ్ రుచి క‌నిపిస్తోంది. వ‌రుస‌గా రెండో టెస్టులోనూ ఇంగ్లాండ్ బౌల‌ర్లు చుక్క‌లు చూపించారు. రెండో టెస్టులో ఏక‌యితే ఏకంగా రెండు ఇన్నింగ్సుల‌లో క‌లిసి 247 ర‌న్స్ కే చాప చుట్టేసింది. దాంతో ఇంగ్లండ్‌ పర్యటనలో వరసగా రెండో టెస్టులోనూ భారత క్రికెట్‌ జట్టు ఘోర పరాజయం చవిచూసింది. ఈ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 47 ఓవర్లలో 130 పరుగులకే కోహ్లి సేన ఆలౌటయింది. దీంతో ఇంగ్లండ్‌ జట్టు 159 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రెండో టెస్టు నాలుగో రోజుల్లోనే ముగిసింది. వ‌రుస‌గా రెండు టెస్టుల‌లో ఓట‌మి కార‌ణంగా 2-0 తేడాతో టీమిండియా వెనుక‌బ‌డి ఉంది. ఈ సిరీస్‌లో మూడో టెస్టు ఈ నెల 18న ప్రారంభం కానుంది.

రెండో టెస్టులో నాలుగో రోజున ముందుగా ఇంగ్లాండ్‌ 396/7 వద్ద జోరూట్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. ఏడో స్థానం, అంతకన్నా దిగువన వచ్చి బ్యాటింగ్‌ చేసి భారత్‌పై అత్యధిక పరుగులు (125) చేసిన ఇంగ్లాండ్‌ ఆటగాడిగా క్రిస్‌వోక్స్‌ నిలిచాడు. ఇంగ్లండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను ఢిక్లేర్‌ చేసే సమయానికి ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ (137 నాటౌట్‌, 177 బంతుల్లో 21 ఫోర్లు) అజేయంగా నిలిచాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆది నుంచి అపసోపాలు పడింది. అసలు బ్యాటింగ్‌ ఎందుకు దిగారో తెలియనంతంగా చెత్త ప్రదర్శన చేసింది. మురళీ విజయ్ డకౌట్‌గా నిష్క్రమించగా, కేఎల్‌ రాహుల్‌(10) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో భారత జట్టు 13 పరుగులకే రెండో వికెట్‌ నష్టపోయింది. ఆపై అజింక్యా రహానే(13), చతేశ్వర్‌ పుజారా(17), విరాట్‌ కోహ్లి(17)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరారు. అటు తర్వాత దినేశ్‌ కార్తీక్‌(0) పరుగులేమీ చేయకుండానే ఎల్బీగా ఔటయ్యాడు. దీంతో భారత్‌ 61 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో హర్థిక్‌ పాండ్య- అశ్విన్‌ జోడీ కొద్ది సేపు ఇంగ్లండ్‌ బౌలర్లకు ఎదురు నిలిచింది. అయితే క్రిస్‌వోక్స్‌ వేసిన 42.1వ బంతికి హర్థిక్‌ ఎల్బీ రూపంలో వెనుదిరిగాడు. హార్దిక్‌ పాండ్య (26 పరుగులు, 43 బంతుల్లో 5 ఫోర్లు) జట్టు స్కోరు 116 వద్ద అవుటయ్యాడు. ఈ జోడీ ఏడో వికెట్‌కు 55 పరుగులు జోడించింది. ఈ తరువాత వచ్చిన కుల్‌దీప్‌, షమీలను అండర్సన్‌ డకౌట్‌ చేశాడు. తరువాత ఇశాంత్‌ (2)ను వోక్స్‌ పెవిలియన్‌ చేర్చాడు. దీంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ముగిసింది. అశ్విన్‌ 33 పరుగులు (48 బంతుల్లో 5 ఫోర్లు)తో నాటౌట్‌గా ఉన్నాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అండర్సన్‌, బ్రాడ్‌లకు చెరో నాలుగు వికెట్లు లభించగా, వోక్స్‌ రెండు వికెట్లు సాధించాడు. వోక్స్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.






Related News

టాప్ లో టీమిండియా

Spread the loveతాజా ర్యాంకింగ్స్ లో టీమిండియాకు తిరుగు లేదు. కెప్టెన్ కోహ్లీ కూడా అదే రేంజ్ లో సాగుతున్నాడు.Read More

స్టేడియంలోనే కోహ్లీకి ముద్దు

Spread the loveటీమిండియా కెప్టెన్ కి విచిత్ర‌మైన అనుభ‌వం ఎదుర‌య్యింది. విండీస్ తో హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రుగుతున్న మ్యాచ్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *