కోహ్లీ సేన కొత్త చ‌రిత్ర‌..

rohit-sharma-scored-his-17th-o
Spread the love

ఉద్దండుల వ‌ల్ల కానిది విరాట్ సాధించాడు. సచిన్, గంగూలీ, ధోనీ వంటి కెప్టెన్లు సాధించ‌లేని కోహ్లీ సేన సాధించి చూపింది. ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై ఆ జ‌ట్టును సునాయాసంగా ఓడించింది. ఆరు వ‌న్డేల సిరీస్ ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే కైవ‌సం చేసుకుంది. తొలి మూడు వ‌న్డేల‌లో సునాయాసంగా గెలిచిన టీమిండియా నాలుగో వ‌న్డేలో అనూహ్యంగా ఓట‌మి పాల‌య్యింది. అయితే పోర్ట్ ఎలిజ‌బెత్ లో జ‌రిగిన ఐదో వ‌న్డేలో మాత్రం మ‌రోసారి నెంబ‌ర్ వ‌న్ ఆట‌తీరు ప్ర‌ద‌ర్శించింది. 73 ప‌రుగుల తేడాతో సునాయాసంగా విజ‌యం సాదించింది. ద‌క్షిణాఫ్రికాను చిత్తు చేసి 4-1 తేడాతో సిరీస్ ని ద‌క్కించుకుంది. చివ‌రి వ‌న్డే 17నాడు జ‌ర‌గ‌బోతోంది.

కొంత‌కాలంగా ఫామ్ లో లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న రోహిత్ శ‌ర్మ బ్యాట్ కి ప‌నిచెప్ప‌డంతో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 274 ప‌రుగులు చేసింది. రోహిత్ శ‌ర్మ 115 ర‌న్స్ తో రాణించాడు. సెంచ‌రీతో త‌న స‌త్తా చాటాడు. కోహ్లీ (36), ధావ‌న్ (34), శ్రేయాస్ అయ్య‌ర్ (30) ప‌రుగులతో రాణించారు. అయితే చివ‌ర్లో ర‌హానే, పాండ్యా, ధోనీ ఆట‌తీరు మెరుగుప‌డ‌క‌పోవడంతో భారీ స్కోర్ సాధించ‌లేక‌పోయింది. చివ‌రి 10ఓవ‌ర్ల‌లో కేవ‌లం 55 ప‌రుగులు మాత్ర‌మే సాధించి 4 వికెట్లు కోల్పోవ‌డం విశేషం.

ఆ త‌ర్వాత 275 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలో దిగిన ఆతిథ్య జ‌ట్టుకి మంచి ఓపెనింగ్ ద‌క్కింది. 52 ప‌రుగుల వ‌ద్ద కెప్టెన్ మాక్ర‌మ్ ని బుమ్రా అవుట్ చేయ‌డంతో ఆ జ‌ట్టు ప‌త‌నం ప్రారంభ‌మ‌య్యింది. వ‌రుస‌గా 13 ర‌న్స్ తేడాలో మూడు కీల‌క వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఆ త‌ర్వాత ఓపెన‌ర్ ఆమ్లా(71)తో క‌లిసి గ‌త మ్యాచ్ విన్న‌ర్ మిల్ల‌ర్ (36) జ‌ట్టుని ఆదుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ టీమిండియా బౌల‌ర్ల ఎదురుదాడితో క్లాసెన్(39) మిగిలిన ఆట‌గాళ్లంతా చేతులెత్తేశారు. 42 వ ఓవ‌ర్లో కుల్దీప్ యాద‌వ్ ఏకంగా 3 వికెట్లు తీయ‌డం విశేషం. దాంతో 42.2 ఓవ‌ర్ల‌లో 201ర‌న్స్ కి ద‌క్షిణాఫ్రికా ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌల‌ర్ల‌లో కుల్దీప్ 3, పాండ్యా , చాహాల్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా బుమ్రా ఒక వికెట్ తీశాడు. ఆమ్లా ర‌నౌట్ అయ్యాడు.






Related News

VIRAT-KOHLI

వైర‌ల్ గా మారిన కోహ్లీ కిస్

Spread the loveటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా అదో సంచ‌ల‌నం అవుతోంది. గ్రౌండ్ లో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌తోRead More

kohli team india

కోహ్లీ సృష్టించిన మ‌రో చ‌రిత్ర‌

Spread the loveసుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన క్రికెట్ లో కోహ్లీ ఖ్యాతి రోజురోజుకి పెరుగుతోంది. ఐసీసీ చ‌రిత్ర‌లో కింగ్ కోహ్లీRead More

  • కోహ్లీ కొత్త చరిత్ర
  • ప్రయోగాలకు సిద్దమవుతున్న కోహ్లీ
  • కోహ్లీ సేన కొత్త చ‌రిత్ర‌..
  • దక్షిణాఫ్రికాకు మరో దెబ్బ
  • టీమిండియా సంచలన విజయం
  • దక్షిణాఫ్రికాకి గట్టి దెబ్బ
  • చెలరేగిన కోహ్లీ, బారత్ బోణీ
  • పాక్ ని మట్టికరిపించిన యువభారత్
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *