సిరీస్ కైవసం చేసుకున్న కోహ్లీ సేన‌

Team_India_2878628f
Spread the love

శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో భారీ విజయం సాధించిన భారత జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంది. రెండోఇన్నింగ్స్ లో శ్రీలంకను 386 పరుగుల వద్ద ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. దాంతో సిరీస్ ను ఇంకా టెస్టు మ్యాచ్ మిగిలిఉండగానే 2-0తో చేజిక్కించుకుంది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో కుశాల్ మెండిస్(110;135 బంతుల్లో17 ఫోర్లు), దిముత్ కరుణరత్నే(141; 307 బంతుల్లో 16 ఫోర్లు)లు మినహా ఎవరూ రాణించలేదు. భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించగా, అశ్విన్, హార్దిక్ పాండ్యాలు తలో రెండు వికెట్లు సాధించారు. ఉమేశ్ కు వికెట్ దక్కింది.

209/2 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన లంకేయులు స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డారు. జట్టు స్కోరు 238 పరుగుల వద్ద మలిందా పుష్పకుమార(16) వికెట్ ను కోల్పోయిన శ్రీలంక. . ఆపై మూడు పరుగుల వ్యవధిలో కెప్టెన్ దినేశ్ చండిమాల్(2) వికెట్ ను సైతం చేజార్చుకుంది. పుష్పకుమారను అశ్విన్ బౌల్డ్ చేస్తే, జడేజా బౌలింగ్ లో రహానేకు క్యాచ్ ఇచ్చి చండిమాల్ అవుటయ్యాడు. వీరిద్దరూ లంచ్ లోపే అవుట్ కావడంతో శ్రీలంక ఓటమి దిశగా పయనించింది. ఆపై వచ్చిన ఆటగాళ్ల భారత బౌలింగ్ ను ఎదుర్కోలేక చతికిలబడ్డారు. జట్టు స్కోరు 310 పరుగుల వద్ద కరుణరత్నే ఐదో వికెట్ గా అవుటయ్యాడు. ఆపై కాసేపటికి ఏంజెలో మాథ్యూస్(36) నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ దెబ్బకు విలవిల్లాడిన లంకేయులు.. రెండో ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజాకు చిక్కారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 183 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.

భారత్ తొలి ఇన్నింగ్స్ 622/9 డిక్లేర్

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 183 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 386 ఆలౌట్


Related News

pujara vijay

చేతులెత్తేసిన టీమిండియా

Spread the loveరెండో టెస్టులోనూ టీమిండియా చేతులెత్తేసింది. పేసర్ల దాటికి విలవిల్లాడింది. సునాయాసంగా బ్యాటింగ్ చేయడానికి తగ్గట్టుగా పిచ్ అనుకూలిస్తున్నాRead More

team india

టీమిండియా కూర్పుపై ఆగ్రహం

Spread the loveతొలిటెస్టులో రహానేకి బదులుగా రోహిత్ శర్మను తీసుకోవడం ద్వారా విమర్శలకు అవకాశం ఇచ్చిన టీమిండియా రెండో టెస్టులోRead More

 • టీమిండియాకి గుణపాఠాలు
 • సౌతాఫ్రికాకి ఎదురుదెబ్బ: స్టెయిన్ అవుట్
 • దీనస్థితిలో సనత్ జయసూర్య
 • హార్థిక్ పాండ్యా ఒంటరిపోరు, అయినా..
 • ధోనీ గ్రేడ్ పడిపోతోంది..
 • ధావన్ ఫిట్, జడేజా డౌట్
 • కొట్టి తీరతామంటున్న కోహ్లీ
 • ఎంజాయ్ చేస్తున్న కొత్త జంట
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *