టీమిండియా సంచలన విజయం

SHIKHAR DHAVAN KOHLI
Spread the love

టీమిండియా విజయపరంపర కొనసాగుతోంది. చివరి టెస్టులో విజయం సాధించి ఊపిరి పీల్చుకున్న కోహ్లీ సేన వన్డేలలో మాత్రం సత్తా చాటుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా సంచలన విజయం సాధించింది. డర్బన్ లో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా మీద కింగ్స్ మీడ్ లో తొలిసారిగా విజయకేతనం ఎగురవేసిన టీమిండియా తాజాగా సెంచూరియన్ లో చరిత్ర తిరగరాసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ నమ్మకాన్ని బౌలర్లు నిలబెట్టారు. ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగారు. దాంతో ఆ స్టేడియంలో అతి స్వల్ప స్కోర్ కే దక్షిణాఫ్రికా జట్టు ఆలౌట్ అయ్యింది. గతంలో జింబాబ్వే సాధించిన 119 రన్స్ అతి స్వల్ప స్కోర్ కాగా, తాజాగా దక్షిణాఫ్రికా జట్టు 32.2 ఓవర్లలో కేవలం 118 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో జేపీ డుమినీ చేసిన 25 పరుగులే అత్యధిక స్కోర్ కావడం విశేషం.

టీమిండియా స్పిన్నర్లలో యజువేంద్ర చాహల్ తన కెరీర్ బెస్ట్ సాధించాడు. 5 వికెట్లు నేలకూల్చాడు. 22 పరుగులకే 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా జట్టు వెన్ను విరిచాడు. మరో స్పిన్నర కుల్దీప్ యాదవ్ కూడా కీలక వికెట్లు 3 తీశాడు. భువనేశ్వర్ , బుమ్రా చెరో వికెట్ తీశారు.

స్వల్ప స్కోర్ చేధనలో బ్యాటింగ్ కి దిగిన టీమిండియా దూకుడుగా ప్రారంభించింది. తొలి ఓవర్లోనే సిక్స్ కొట్టి ఊఫు మీద కనిపించిన రోహిత్ శర్మ రబాడా బౌలింగ్ లో అవుటయ్యాడు. కానీ త ర్వాత శిఖర్ ధావన్ అర్థ సెంచరీతో రాణించగా, కెప్టెన్ కోహ్లీ డర్బన్ లో సెంచరీతో మొదలెట్టిన దూకుడు కొనసాగించాడు. ధావన్ కి తోడుగా మరో వికెట్ పడకుండా జట్టుని విజయ తీరానికి చేర్చాడు. అయితే 19 ఓవర్లలో 117 రన్స్ చేసి విజయానికి మరో 2 పరుగులు దూరంలో ఉండగా, అనూహ్యంగా లంచ్ పేరుతో ఆట నిలిపేయడం విశేషంగా మారింది. ఆట కొనసాగించి ఉంటే మరికొన్ని నిమిషాల్లో ముగిసిపోయే ఆటను అనూహ్యంగా నిలిపివేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దక్షిణాఫ్రికా జట్టు మీద 9 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేయడానికి రంగం సిద్దం అయ్యింది. మరో 30 ఓవర్లు మిగిలి ఉండగా విజయం సాధించబోతున్నారు. సౌతాఫ్రికాలో టీమిండియాకి ఇదే పెద్ద విజయం కాబోతోంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *