Main Menu

కోహ్లీ సేన‌కు మ‌రుపురాని సిరీస్

cricket-south-africa-newlands-india-3rd-t20i_bc02b89c-199d-11e8-8f49-ddf93c7ed473
Spread the love

ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ మీద టీమిండియాకు ఈ సిరీస్ చిర‌కాలం గుర్తుంటుంది. సుదీర్ఘ‌కాలంగా ప్రోటీస్ మీద విజ‌యం కోసం మొఖం వాచి ఉన్న ఫ్యాన్స్ కి కోహ్లీ సేన డ‌బుల్ సిరిస్ విజ‌యాల‌తో సంతృప్తినిచ్చింది. టెస్ట్ మ్యాచ్ ల‌కు ముందు ప్రాక్టీస్ లేకుండానే బ‌రిలో దిగి కొంత త‌డ‌బ‌డింది. కానీ చివ‌రి టెస్టులో విజ‌యం సాధించి ఊర‌ట‌గా భావించింది.

ఆ త‌ర్వాత వన్డేల‌లో సుడిగాలిలా చెల‌రేగారు. ద‌క్షిణాఫ్రికా మీద సంపూర్ణ ఆధిప‌త్యాన్ని చెలాయించారు. ఏకంగా 5-1 తేడాతో విజ‌యం సాధించ‌డం సామాన్య విష‌యం కాదు. ఈ సిరీస్ లో కోహ్లీ ఏకంగా మూడు సెంచ‌రీలు సాధించి జ‌ట్టుని ముందు నడిపించాడు. ఆ త‌ర్వాత టీ20ల‌లో కూడా టీమిండియా త‌డాఖా చూపించింది. తొలి మ్యాచ్ గెలిచిన‌ప్ప‌టికీ, రెండో మ్యాచ్ లో ఓట‌మి పాల‌య్యింది. కానీ చివ‌రి మ్యాచ్ ను మాత్రం ఉత్కంఠత మ‌ధ్య నిల‌బెట్టుకుని సిరీస్ ఛాంపియ‌న్ గా నిలిచింది.

మూడ టీ20లో కోహ్లీ గాయంతో దూరం కావ‌డం మూలంగా రోహిత్ శ‌ర్మ సార‌ధిగా వ్య‌వ‌హ‌రించాడు. కానీ రెండో టీ20 మాదిరిగానే రెండో ఓవ‌ర్లోనే డాలా బౌలింగ్ లో ఎల్బీడ‌బ్ల్యూగా అవుట్ కావడం నిరాశ‌ప‌రిచింది. కానీ త‌ర్వాత రైనా, ధ‌వ‌న్, హార్థిక్ పాండ్యా కొంత మేర‌కు రాణించ‌డంతో 172 ప‌రుగులు సాధించింది. అయినా త‌ర్వాత బౌల‌ర్ల తాకిడితో సౌతాఫ్రికా త‌ల్ల‌డిల్లిపోయింది. ముఖ్యంగా తొలి 6ఓవ‌ర్ల ప‌వ‌ర్ ప్లేలో కేవ‌లం 30 ప‌రుగులు మాత్ర‌మే సాధించ‌గ‌లిగిందంటే పేస్ బౌల‌ర్ల ప్ర‌భావం అర్థం చేసుకోవ‌చ్చు. ఇక చివ‌రి 3 ఓవ‌ర్ల‌లో 53ర‌న్స్ చేయాల్సిన ద‌శ నుంచి ఆఖ‌రి ఓవ‌ర్ కి 20 ప‌రుగులు చేయాల్సిన స్థితికి వ‌చ్చింది. కానీ భువ‌నేశ్వ‌ర్ కుమార్ మ‌రోసారి క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో ఆఖ‌రికి 7 పరుగుల తేడాతో టీమిండియా విజ‌యం సాధించింది.

మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా భువ‌నేశ్వ‌ర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా సురేష్ రైనా నిలిచారు. ఆల్ టైమ్ టీమిండియా రికార్డుల పరంప‌ర‌లో ఈ సిరీస్ కొత్త ఒర‌వ‌డికి నాందిప‌లుకుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. విదేశీ గ‌డ్డ మీద మ‌న‌వాళ్లు పిల్లులు అనే ముద్ర నుంచి తామేంటో నిరూపించుకుని యువ‌సేన ప్ర‌తాపం చాట‌డం శుభ‌ప‌రిణామంగా క‌నిపిస్తోంది.


Related News

Australia-v-England-Game-2

వ‌ర‌ల్డ్ రికార్డ్: ఆసీస్ ని అల్లాడించిన ఇంగ్లాండ్

Spread the loveమూలిగే న‌క్క‌పై తాటికాయ‌ప‌డ్డ‌ట్టుగా మారుతోంది. అస‌లే అంతంత‌మాత్రంగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ తో ఇంగ్లాండ్ ఆట‌గాళ్లుRead More

rohit-sharma-scored-his-17th-o

రోహిత్ కూడా ప్ర‌శ్నార్థ‌క‌మే

Spread the loveఇంగ్లాండ్ తో సిరీస్ కి బ‌య‌లుదేరే ముందు భార‌త క్రికెట్ జ‌ట్టు కీల‌క ఆట‌గాళ్ల ప‌రిస్థితి ఢోలాయ‌మానంలోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *