నెంబర్ వన్ టీమిండియా

Indian-team_20170123_600_855
Spread the love

వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ పొజిషన్‌ను భారత్‌ మళ్లీ చేజిక్కించుకున్నది. గెలుపు అవసరమైన వేళ ఆసీస్‌తో సిరీస్‌ చివరి వన్డేలో అత్యద్భుతంగా రాణించి నెంబర్‌ వన్‌ స్థానాన్ని పదిలం చేసుకున్నది. కంగారూలతో చివరి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దాంతో సౌతాఫ్రికాని మరోసారి రెండో స్థానానికి నెట్టింది. 115 పాయింట్లతో టీమిండియా ఆధిక్యం సాధించింది. త్వరలో న్యూజీలాండ్ తో జరగబోతున్న సిరీస్ లో రాణిస్తే నెంబర్ వన్ స్థానం నిలిచే అవకాశం ఉంటుంది.

ఇక చివరి వన్డేలో అక్సర్‌ పటేల్‌ (3/38 ), జశ్‌ప్రీత్‌ బుమ్రా (2/51)లు భారత్‌ గెలుపుకు బాటలు వేయగా.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ శర్మ (125, 109 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌)లతో భారత్‌ గెలుపును సులభం వేయగా. కంగారూలపై ఉత్తమ ప్రదర్శనను మరోసారి పునరావృతం చేశాడు. రహానె తోడుగా చేలరేగిన రోహిత్‌ ఆపై కోహ్లి అండగా విజృంభించాడు. మరికొద్ది పరుగుల్లో ఛేదన పూర్తవుతుందనగా రోహిత్‌ అవుటయినా.. కేదార్‌ జాదవ్‌, మనీశ్‌ పాండేలు గెలుపును లాంఛనం చేశారు.






Related News

hockey'

మట్టికరిచిన పాక్

Spread the loveపాకిస్తాన్ జట్టు మట్టికరిచింది. మళ్లీ ఓటమి పాలయ్యింది. ప్రత్యర్థి పాక్ పై టీమిండియా ఆటగాళ్లు సంపూర్ణ ఆధిక్యాన్నిRead More

kumble

అనిల్ కుంబ్లేని అవమానించారు..

Spread the loveటీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లేను బీసీసీఐ ఘోరంగా అవమానించింది. సహచరులంతా ముద్దుగా జంబోగా పిలుచుకునే అనిల్ కుంబ్లేRead More

  • పాకిస్తాన్ ని మట్టికరిపించి ముందంజ
  • టీమిండియాలో ఠాకూర్
  • టెస్ట్ ఛాంపియన్ షిప్ కి అనుమతి
  • ఆసీస్ ఆటగాళ్లపై రాయి విసిరిందెవరు
  • టీమిండియా విజయం
  • టీమిండియా ఘన విజయం
  • అనుమానంగా ఆసీస్ కెప్టెన్
  • పెళ్ళి పీటలపైకి టీమిండియా ఫాస్ట్ బౌలర్
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *