కోహ్లీ కోరిక నెరవేరలేదు..

australia
Spread the love

టీమిండియా కొత్త రికార్డ్ మీద కన్నేసినా ఆస్ట్రేలియా అడ్డుకట్ట వేసింది. కెప్టెన్ గా కోహ్లీ కొత్త రికార్డ్ స్రుష్టించాలని ఆశించినా ఆస్ట్రేలియా బౌలర్లు నిలువరించారు. దాంతో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిసిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా విధించిన 335 పరుగుట టార్గెట్ చేధించడంలో టీమిండియా చతికిల పడింది. మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం దక్కినా ఆ తర్వాత రోహిత్ శర్మ రనౌట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. చివరకు 21 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది.

అంతకు ముందు ఆస్ట్రేలియా ఓపెనర్లు చెలరేగిపోయారు. ఫించ్ 94 పరుగులకు అవుట్ కాగా, 100వ మ్యాచ్ ఆడుతున్న వార్నర్ మాత్రం విరుచుకుపడ్డాడు. 124 పరుగుల భారీ స్కోర్ చేశాడు. దాంతో ఆస్ట్రేలియా ఓపెనింగ్ భాగస్వామ్యం అదిరిపోయింది. హ్యాట్రిక్ ఓటములతో సతమతమవుతున్న ఆస్ట్రేలియాకు ఊరటనిచ్చి విజయానికి దోహదమయ్యింది.

ఈ ఓటమితో టీమిండియాా కి 9 వన్డే మ్యాచ్ ల తర్వాత ఓటమి పాలయ్యింది. అయితే ఈ మ్యాచ్ ద్వారా వేగంగా 2వేల పరుగులు పూర్తి చేసిన కెప్టెన్ గా కోహ్లీ కొత్త రికార్డ్ నెలకొల్పడం విశేషం. అంతకుముందు డివిల్లీర్స్ 41 ఇన్సింగ్స్ లలో సాధించిన స్కోర్ ని కోహ్లీ 36 ఇన్నింగ్స్ లలో సాధించి రికార్డ్ నమోదు చేశాడు. కానీ ఛేజింగ్ లో సత్తా చాటే కోహ్లీ తన ఐపీఎల్ సొంత గడ్డపై మాత్రం రాణించలేకపోవడంతో టీమిండియా ఓటమి మూటగట్టుకుంది.






Related News

VIRAT-KOHLI

వైర‌ల్ గా మారిన కోహ్లీ కిస్

Spread the loveటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా అదో సంచ‌ల‌నం అవుతోంది. గ్రౌండ్ లో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌తోRead More

kohli team india

కోహ్లీ సృష్టించిన మ‌రో చ‌రిత్ర‌

Spread the loveసుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన క్రికెట్ లో కోహ్లీ ఖ్యాతి రోజురోజుకి పెరుగుతోంది. ఐసీసీ చ‌రిత్ర‌లో కింగ్ కోహ్లీRead More

  • కోహ్లీ కొత్త చరిత్ర
  • ప్రయోగాలకు సిద్దమవుతున్న కోహ్లీ
  • కోహ్లీ సేన కొత్త చ‌రిత్ర‌..
  • దక్షిణాఫ్రికాకు మరో దెబ్బ
  • టీమిండియా సంచలన విజయం
  • దక్షిణాఫ్రికాకి గట్టి దెబ్బ
  • చెలరేగిన కోహ్లీ, బారత్ బోణీ
  • పాక్ ని మట్టికరిపించిన యువభారత్
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *