టీమిండియా కూర్పుపై ఆగ్రహం

team india
Spread the love

తొలిటెస్టులో రహానేకి బదులుగా రోహిత్ శర్మను తీసుకోవడం ద్వారా విమర్శలకు అవకాశం ఇచ్చిన టీమిండియా రెండో టెస్టులో మరిన్ని సమస్యలు కొనితెచ్చుకుంది. టీమ్ కూర్పు విషయంలో తగిన జాగ్రత్తలు పాటించలేదనే విమర్శలు వస్తున్నాయి. తొలిరోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాని 265 రన్స్ కే 6 వికెట్లు తీసి కట్టడి చేసినప్పటికీ జట్టు ఎంపికపై మాత్రం వివాదం కొనసాగేలా ఉంది.

రెండవ టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు ఎంపికపై మాజీ కెప్టెన్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో కేఎల్ రాహును ఎంపిక చేయడంతోపాటు భువనేశ్వర్ కుమార్ స్థానంలో ఇషాంత్ శర్మను జట్టులోకి తీసుకోవడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించాడు. తన ఉద్దేశంలో మాత్రం శిఖర్‌ధావన్‌ను బలిపశువును చేశారని ఆయన వ్యాఖ్యానించాడు. ఒక ఇన్నింగ్స్‌లో బాగా ఆడనంతమాత్రాన అతనిని జట్టులోకి తీసుకోరా అని ఆయన ప్రశ్నించాడు. అదేవిధంగా వికెట్ కీపర్ వృద్ధిమాన్ షా స్థానంలో పార్థివ్ పటేల్‌ను తీసుకోవడం కూడా ఆక్షేపణీయమని అన్నాడు. కేప్‌టౌన్‌లో జరిగిన మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ స్థానంలో ఇషాంత్ శర్మను తీసుకోవడంలో అర్ధం లేదని, భువనేశ్వర్ లేని లోటును ఇషాంత్ భర్తీ చేయగలడా అని ఆయన ప్రశ్నించాడు.

పలువురు మాజీలు కూడా ఇలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు. దక్షిణాఫ్రికా టూర్ లో టీమిండియా వ్యవహారాలను తూర్పారపడుతున్నారు. తొలి టెస్టులో స్టార్ బ్యాట్స్ మెన్లుకు మించిన బ్యాటింగ్ తీరు ప్రదర్శించడంతోనే భువీకి ఉద్వాసన పలికినట్టున్నారంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు.


Related News

hardik-28-1521641582-302081-khaskhabar

చిక్కుల్లో హార్థిక్ పాండ్యా

Spread the loveటీమిండియా ఆల్‌రౌండ‌ర్‌ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో ఇరుక్కున్నాడు. కోరి క‌ష్టాలు తెచ్చుకున్నాడు. నోటిదుర‌ద‌తో ఇప్పుడు న్యాయ‌స్థానాల ముందుRead More

crciket dressing room

రెచ్చిపోయిన క్రికెటర్లు

Spread the loveనిదాహాస్ టీ20 టోర్నీలో గ్రౌండ్ లోనే బంగ్లాదేశ్ ఆట‌గాళ్లు హ‌ల్ చ‌ల్ చేశారు. కెప్టెన్ ష‌కీబుల్ అయితేRead More

 • చిక్కుల్లో ష‌మీ: సందిగ్ధంలో కెరీర్
 • టీమిండియా బౌల‌ర్ పై బౌన్స‌ర్ వేసిన భార్య‌
 • పాండ్యా ల‌వ్ వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు
 • ద్రావిడ్ కి షాకిచ్చిన క్రికెట్ బోర్డ్
 • కోహ్లీ సేన‌కు మ‌రుపురాని సిరీస్
 • వైర‌ల్ గా మారిన కోహ్లీ కిస్
 • కోహ్లీ సృష్టించిన మ‌రో చ‌రిత్ర‌
 • కోహ్లీ కొత్త చరిత్ర
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *