లంకను తుడిచిపెట్టేసిన టీమిండియా

kohli
Spread the love

శ్రీలంకను టీమిండియా చిత్తు చేసింది. కొత్త చరిత్ర స్రుష్టించింది. మొత్తంగా మూడు ఫార్మేట్లలోనూ విజయం వాసన లేకుండా శ్రీలంకను చాప చుట్టేసింది. విజయపరంపరలో భాగంగా తొలుత టెస్టు సిరీస్‌లో 3-0 తొ గెలిచిన కోహ్లీ సేన ఆతర్వాత వన్డే సిరీస్‌లో 5-0 తేడాతో చిత్తుచేసింది. ఇక తాజాగా ఏకైక టి-20లోనూ విజయభేరి మోగించింది. ప్రత్యర్థి తన ముందు ఉంచిన 171 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 82 పరుగులు సాధించగా, ఫామ్‌లో ఉన్న మనీష్ పాండే (51) అర్ధ శతకంతో నాటౌట్‌గా నిలిచి, టీమిండియాకు ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు. టెస్టు, వన్డేల్లో భారత్‌కు గట్టిపోటీనివ్వలేకపోయిన లంక, మూడో ఫార్మాట్‌లోనూ చేతులెత్తేసింది.

భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు చేసిన శ్రీలంక 23 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను కెప్టెన్ ఉపుల్ తరంగ రూపంలో కోల్పోయింది. అతను నాలుగు బంతుల్లో ఐదు పరుగులు చేసి, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్, వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లా 17 పరుగుల వ్యక్తి స్కోరువద్ద జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 14 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో మూడు ఫోర్లు ఉన్నాయి. మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (7)ను యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతంగా స్టంప్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యత దిల్షాన్ మునవీర, అషాన్ ప్రియంజన్‌పై పడింది. అయితే, క్రీజ్‌లో నిలదొక్కుకొని, 29 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 53 పరుగులు చేసిన మునవీరను కుల్దీప్ యాదవ్ బౌల్డ్ చేయడంతో లంక కష్టాల్లో పడింది. తిసర పెరెరా (11), దసున్ శణక (0), సీకుగే ప్రసన్న (11) భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేక తక్కువ స్కోర్లకే పోరాటాన్ని ముగించారు. ప్రియంజన్ 40 బంతుల్లో 40 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, 20 ఓవర్లలో శ్రీలంక 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఇసురు ఉదానా 19 పరుగులతో ప్రియంజన్‌తోకలిసి క్రీజ్‌లో ఉన్నాడు. యుజువేంద్ర చాహల్ 43 పరుగులకు 3వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్ 20 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించాడు.
కోహ్లీ, జాధవ్ అర్ధ శతకాలు
బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉన్న భారత్‌కు సులభంగానే లక్ష్యాన్ని చేరింది. రోహిత్ శర్మ 9 పరుగులు చేసి, మలింగ బౌలింగ్‌లో తిసర పెరెరాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి భారత్ స్కోరు 22 పరుగులు. మరో 20 పరుగుల తర్వాత లోకేష్ రాహుల్ వికెట్ కూడా కూలింది. అతను 18 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లతో 24 పరుగులు చేసి, సీకుగే ప్రసన్న బౌలింగ్‌లో దసున్ శణక క్యాచ్ పట్టుకోగా అవుటయ్యాడు. అయితే, కోహ్లీ, మనీష్ పాండే జట్టుకు అండగా నిలిచారు. మూడో వికెట్‌కు వీరు 119 పరుగుల అత్యంత కీలక భాగస్వామ్యాన్ని అందించారు. 54 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 82 పరుగులు చేసిన కోహ్లీని దసున్ శణక క్యాచ్ అందుకోగా ఇసురు ఉదానా అవుట్ చేశాడు. అప్పటికే స్కోరు 161 పరుగులు కావడంతో, భారత్ మరో వికెట్ కూలకుండానే విజయాన్ని నమోదు చేసింది. పాండే 36 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 పరుగులు చేయగా, అతనితోపాటు ఒక పరుగు చేసిన ధోనీ నాటౌట్‌గా నిలిచాడు.


Related News

VIRAT-KOHLI

వైర‌ల్ గా మారిన కోహ్లీ కిస్

Spread the loveటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా అదో సంచ‌ల‌నం అవుతోంది. గ్రౌండ్ లో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌తోRead More

kohli team india

కోహ్లీ సృష్టించిన మ‌రో చ‌రిత్ర‌

Spread the loveసుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన క్రికెట్ లో కోహ్లీ ఖ్యాతి రోజురోజుకి పెరుగుతోంది. ఐసీసీ చ‌రిత్ర‌లో కింగ్ కోహ్లీRead More

 • కోహ్లీ కొత్త చరిత్ర
 • ప్రయోగాలకు సిద్దమవుతున్న కోహ్లీ
 • కోహ్లీ సేన కొత్త చ‌రిత్ర‌..
 • దక్షిణాఫ్రికాకు మరో దెబ్బ
 • టీమిండియా సంచలన విజయం
 • దక్షిణాఫ్రికాకి గట్టి దెబ్బ
 • చెలరేగిన కోహ్లీ, బారత్ బోణీ
 • పాక్ ని మట్టికరిపించిన యువభారత్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *