టీమిండియా బౌల‌ర్ పై బౌన్స‌ర్ వేసిన భార్య‌

shami
Spread the love

టీమిండియా బౌల‌ర్ చిక్కుల్లో ప‌డ్డారు. మ‌హ‌మ్మ‌ద్ ష‌మీపై అత‌ని భార్య చేసిన ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నంగా మారాయి. షమీ భార్య‌ హాసిన్ జాహ‌న్ వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ష‌మీ పెద్ద మోస‌గాడ‌ని, దేశంలో ఎంతో మంది మ‌హిళ‌ల‌తో అత‌నికి సంబంధాలు ఉన్నాయ‌ని, అత‌నికి త‌న కంటే ముందే పాకిస్తాన్‌కు చెందిన మ‌హిళతో వివాహం కూడా జ‌రిగింద‌ని ష‌మీపై అత‌ని భార్య ఆరోప‌ణ‌లు చేయ‌డం ఆస‌క్తిగా మారింది. ఈవిష‌యాలు బ‌య‌ట‌పెడ‌తాన‌నే ఉద్దేశంతో త‌న‌ను అత్తింటి వారు వేధిస్తున్నార‌ని ఆరోపించ‌డం విశేషం.

`ష‌మీకి దేశంలో ఎంతో మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయి. ఒక‌రోజు కారులో ష‌మీ మొబైల్ చూస్తే దాన్నిండా అసభ్య‌క‌ర సందేశాలు, ఫోటోలు ఉన్నాయి. వాటిని చూడ‌డానికి నాకు ఒక రాత్రంతా స‌రిపోలేదు. మ‌రోసారి కారులో గ‌ర్భినిరోధ‌క మాత్ర‌లు కూడా చూశాను. పాకిస్తాన్‌కు చెందిన ఓ అమ్మాయితో ష‌మీకి గ‌తంలోనే పెళ్లి జ‌రిగిపోయింది. ఆ అమ్మాయి కోసం ష‌మీ పాకిస్తాన్ కూడా వెళ్లాడు. టీమిండియాతోపాటు ష‌మీ ఏ మ్యాచ్ ఆడ‌డానికి వెళ్లినా.. కుల్‌దీప్ అనే వ్య‌క్తి అత‌నికి అమ్మాయిల‌ను స‌ప్లై చేస్తాడు. ఈ విష‌యం బీసీసీఐకి కూడా తెలుసు. అయినా అత‌నిపై చ‌ర్య‌లు తీసుకోలేదు. ఈ విష‌యాల‌న్నీ తెలుసుకున్నందుకు రెండేళ్లుగా న‌న్ను వేధింపుల‌కు గురి చేస్తున్నారు. న‌న్ను చంప‌డానికి కూడా ప్ర‌య‌త్నిస్తున్నారు. త్వ‌ర‌లోనే ష‌మీ కుటుంబంపై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాన‌`ని హ‌సీన్ వెల్ల‌డించారు. కాగా, ష‌మీ, హసీన్‌ది ప్రేమ వివాహం. 2014లో వీరి వివాహం జ‌రిగింది. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది.

అయితే ష‌మీపై ఆరోప‌ణ‌ల‌ను క్రికెట్ వ‌ర్గాలు ఖండిస్తున్నాయి. ఆయ‌న కోచ్ కూడా జాహ‌న్ చేసిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌ని కొట్టిపారేశారు. ష‌మీ కెరీర్ పై దెబ్బ కొట్ట‌డానికే ఇలాంటి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా అని ఆయ‌న సందేహం వ్య‌క్తం చేశారు. మొత్తంగా ష‌మీ వ్య‌వ‌హారం మాత్రం సంచ‌ల‌నంగా మారింది.


Related News

hardik-28-1521641582-302081-khaskhabar

చిక్కుల్లో హార్థిక్ పాండ్యా

Spread the loveటీమిండియా ఆల్‌రౌండ‌ర్‌ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో ఇరుక్కున్నాడు. కోరి క‌ష్టాలు తెచ్చుకున్నాడు. నోటిదుర‌ద‌తో ఇప్పుడు న్యాయ‌స్థానాల ముందుRead More

crciket dressing room

రెచ్చిపోయిన క్రికెటర్లు

Spread the loveనిదాహాస్ టీ20 టోర్నీలో గ్రౌండ్ లోనే బంగ్లాదేశ్ ఆట‌గాళ్లు హ‌ల్ చ‌ల్ చేశారు. కెప్టెన్ ష‌కీబుల్ అయితేRead More

 • చిక్కుల్లో ష‌మీ: సందిగ్ధంలో కెరీర్
 • టీమిండియా బౌల‌ర్ పై బౌన్స‌ర్ వేసిన భార్య‌
 • పాండ్యా ల‌వ్ వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు
 • ద్రావిడ్ కి షాకిచ్చిన క్రికెట్ బోర్డ్
 • కోహ్లీ సేన‌కు మ‌రుపురాని సిరీస్
 • వైర‌ల్ గా మారిన కోహ్లీ కిస్
 • కోహ్లీ సృష్టించిన మ‌రో చ‌రిత్ర‌
 • కోహ్లీ కొత్త చరిత్ర
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *