రెండంకెల్లో ముగ్గురే…

kohli virat
Spread the love

దక్షిణాఫ్రికాతో జరుగు తున్న మూడో టెస్టులోనూ టీమిండియా బ్యాటింగ్‌ తీరు ఏమాత్రం మారలేదు. మన క్రీడాకారులు వ్యక్తిగతంగా విజరు(8), రాహుల్‌(0), రహానే(9), పార్థీవ్‌ పాటిల్‌(2), పాండ్యా(0), షమి(8), ఇషాంత్‌(0)… సాధించిన పరుగులివే… ఛటేశ్వర పుజరా(50), కోహ్లి(54), భువనేశ్వర్‌ కుమార్‌ (30) మినహా మరెవ్వరూ రాణించలేకపోయారు.

బుధవారం ఉదయం టాస్‌ గెలిచి తొలి గా బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 187 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు ఒక వికెట్‌ నష్టానికి ఆరు పరుగులు చేసింది. తొలిరోజు ఆట నిలిపి వేసే సమయానికి ఎల్గర్‌ 4, రబడ 6 పరుగు లతో క్రీజ్‌లో ఉన్నారు. భారతజట్టు తొలిసారి ఒక్క స్పిన్నర్‌కూడా లేకుండా బరిలోకి దిగిం ది. మూడో టెస్ట్‌ జట్టు కూర్పులోనూ రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. రోహిత్‌ శర్మ స్థానంలో అజింక్య రహానే… అశ్విన్‌ స్థానంలో భువనేశ్వర్‌ కుమార్‌కు చోటు కల్పించారు.

దక్షిణాఫ్రికా జట్టు కూడా స్పినర్‌ లేకుం డానే బరిలోకి దిగింది. స్పిన్నర్‌ కేశవ్‌ మహ రాజ్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ ఆండిలె ఫెహ్లు క్వాయోను తీసుకున్నట్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌ వెల్లడించాడు. మొదటి రెండు టెస్టుల్లోనూ సఫారీ టీమ్‌ గెలిచిన సంగతి తెలిసింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్వీన్‌స్వీప్‌ చేయాలని ఆతిథ్య జట్టు ఉవ్విళ్లూరుతోంది. చివరి మ్యాచ్‌లోనైనా పరువు నిలుపుకోవాలని టీమిండియా భావిస్తోంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *