ఆసీస్ ఆటగాళ్లపై రాయి విసిరిందెవరు

australia
Spread the love

ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై గుర్తుతెలియని ఆగంతకుడు రాయితో దాడి చేశాడు. ఈ సంఘటనలో బస్సు అద్దం ఒకటి ధ్వంసమైంది. అయితే, సమీపంలోని సీటు ఖాళీగా ఉండడంతో ఎవరూ గాయపడలేదు. మంగళవారం భారత్‌తో జరిగిన రెండో టి-20 ఇంటర్నేషనల్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయభేరి మోగించిన ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1గా సమం చేసింది. 13న హైదరాబాద్‌లో జరిగే చివరి, మూడో మ్యాచ్‌ని ఉత్కంఠ భరితంగా మార్చింది. రెండో టి-20 ముగిసిన తర్వాత ఆసీస్ క్రికెటర్లు బర్సాపరా ప్రాంతం నుంచి ప్రత్యేక బస్సులో రాడిసన్ హోటల్‌కు బయలుదేరారు. స్టేడియానికి సమీపంలోనే గుర్తుతెలియని వ్యక్తి విరిసిన రాయి బస్సు అద్దానికి తగిలింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

ఆసీస్ క్రికెటర్ల బస్సుపై రాయి విసిరిన సంఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో ఆకతాయి చేసిన పనిగా చాలా మంది దీనిని అభివర్ణిస్తున్నారు. టీమిండియా ఏకంగా ఎనిమిది వికెట్ల తేడతో ఓడడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఎవరూ ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే, కొంత మంది మాత్రం దీనిని ఉద్దేశపూర్వకంగా చేసిన దాడిగానే అనుమానిస్తున్నారు. గువాహటి ఒక క్రీడా హబ్‌గా ఎదుగుతున్న దశలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని అస్సాం క్రికెట్ సంఘం (ఎసిఎ) ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. గువాహటికి ఉన్న మంచి పేరును దెబ్బతీసేందుకు కుట్ర జరిగి ఉండవచ్చని అసోం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ ట్వీట్ చేశారు. కారకులు ఎవరైనప్పటికీ, జరిగిన సంఘటనకు తాను క్షమాపణ చెప్తున్నానని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.


Related News

during the 2015 ICC Cricket World Cup match between India and Pakistan at Adelaide Oval on February 15, 2015 in Adelaide, Australia.

కోహ్లీ కొత్త చరిత్ర

Spread the loveటీమిండియా సారధి మరో రికార్డ్ సాధించాడు. పరుగుల వరద పారిస్తూ కొత్త చరిత్ర స్రుష్టిస్తున్నాడు. వన్డే క్రికెట్Read More

team india

ప్రయోగాలకు సిద్దమవుతున్న కోహ్లీ

Spread the loveటీమిండియాలో పలు మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. చివరి వన్డే కోసం కోహ్లీ సన్నాహాలు షురూ చేశారు. రిజర్వ్Read More

 • కోహ్లీ సేన కొత్త చ‌రిత్ర‌..
 • దక్షిణాఫ్రికాకు మరో దెబ్బ
 • టీమిండియా సంచలన విజయం
 • దక్షిణాఫ్రికాకి గట్టి దెబ్బ
 • చెలరేగిన కోహ్లీ, బారత్ బోణీ
 • పాక్ ని మట్టికరిపించిన యువభారత్
 • ఆల్ టైమ్ లిస్టులో కోహ్లీ ముందంజ
 • కూల్చారు:మూడో రోజు కీలకంగా మార్చారు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *