లంక వెన్నువిరిచిన అశ్విన్

ashwin
Spread the love

టీమిండియా బౌల‌ర్లు రెచ్చిపోయారు. లంక బ్యాట్స్ మెన్ ను కంగారెత్తించారు. ముఖ్యంగా అశ్విన్ చాలాకాలం త‌ర్వాత విజృంభించ‌డంతో శ్రీలంక ద‌గ్గ‌ర స‌మాధానం ల‌భించ‌లేదు. చివ‌ర‌కు 183 ర‌న్స్ కే ఆలౌట్ అయ్యింది. టీమిండియా సాధించిన 622 ర‌న్స్ భారీ స్కోర్ కి స‌మాధానంగా బ్యాటింగ్ కి దిగి స్వ‌ల్ప స్కోర్ కే ఆలౌట్ కావ‌డంతో 439 ర‌న్స్ వెనుక‌బ‌డింది. ఆ త‌ర్వాత ఫాలో ఆన్ ఆడుతూ మొద‌టి వికెట్ కూడా త్వ‌ర‌గానే కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. 7 ప‌రుగుల వ‌ద్ద ఉపుల్ త‌రంగ వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 60 ఓవ‌ర్ల‌కు 2 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసింది. . కరుణరత్నె 92, పుష్పకుమార 2 పరుగులతో స్టాండింగ్‌లో ఉన్నారు. కుశాల్ ఫెరీరా అద్భుత సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. దాంతో శ్రీలంక కోలుకుంది. భారత్ 230 పరుగుల అధిక్యంలో ఉంది.

ఓవర్ నైట్ స్కోరు 50/2తో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన లంకకు భారత బౌలర్లు షాకిచ్చారు. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాట్స్‌మన్ చేతులెత్తేశారు. డిక్‌వెలా అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో అశ్విన్ ఐదు వికెట్లతో సత్తా చాటగా, జడేజా 2, షమీ 2, ఉమేష్ ఒక వికెట్ తీశారు.

భారత్ మొదటి ఇన్నింగ్స్: 622/9 డిక్లెర్డ్
శ్రీలంక మొదటి ఇన్నింగ్స్: తరంగ 0, కరుణరత్నే 25, మెండిస్ 24, చండీమల్ 10, మ్యాథ్యూస్ 26, డిక్‌వెలా 51, డిసిల్వా 0, పెరీరా 25, హెరాత్ 2, పుష్పకుమారా 15 నాటౌట్, ప్రదీప్ 0; మొత్తం: 49.4 ఓవర్లలో 183 ఆలౌట్.

భారత్ బౌలింగ్: అశ్విన్ 16.4-68-5, జడేజా 22-84-2, షమీ 6-13-2, ఉమేష్ 5-12-1






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *