Main Menu

అనుమానంగా ఆసీస్ కెప్టెన్

Spread the love

భారత్‌పై 4-1తో వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న ఆస్ట్రేలియాకు టీ20 మ్యాచ్‌లకు ముందు మరో భయం పట్టుకుంది. కనీసం టీ20 సిరీస్‌ను అయినా గెలుచుకొని సగర్వంగా సొంత దేశంలో కాలుమోపాలునుకున్న ఆసీస్‌కు గాయల బెడద కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాంచీ వేదికగా శనివారం జరిగే తొలి టీ20 మ్యాచ్‌కు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఆడుతాడా లేదా అనే భయం కంగారులలో నెలకొంది.

ఈ మ్యాచ్‌కు స్మిత్‌ దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం రాంచీలో ప్రాక్టీస్‌ చేస్తూ స్మిత్‌ గాయపడ్డాడు. వెంటనే అతనిని లోకల్‌ ఆసుపత్రికి తరలించారు. భుజానికి చిన్న గాయం అయినట్లు, ఎంఆర్‌ఐ స్కాన్‌ తీసినట్లు తెలుస్తోంది. డాక్టర్ల సూచనల మేరకు స్మిత్‌కు ఆసీస్‌ టీం మేనేజ్‌మెంట్‌ తొలి మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.






Related News

కోహ్లీ చుట్టూ కొత్త వివాదం

Spread the loveటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్య‌వ‌హారం కొత్త వివాదానికి దారితీస్తోంది. బీసీసీఐ కి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.Read More

సిరీస్ పోయినా అది మిగిలింది…!

Spread the loveఇంగ్లడ్ గ‌డ్డ‌పై జ‌రిగిన‌ టెస్టు సిరీస్‌లో టీమిండియా ప‌రాజ‌యం పాల‌య్యింది. అయిన‌ప్ప‌టికీ టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో త‌నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *