Main Menu

తొలి టెస్టుకి ముందే టీమిండియా ఓపెనర్ అవుట్

Spread the love

ప్రతిష్టాత్మక దక్షిణాఫ్రికా టూర్ లో టీమిండియాకు చుక్కెదురయ్యింది. పర్యటనలో అడుగు పెట్టిన తోలిరోజే ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్ లో ఉన్న ఓపెనర్ కి గాయం అయ్యింది. దాంతో తొలిటెస్టుకి శిఖర్ ధావన్ దూరం కావాల్సి వస్తోంది. ధావన్ స్థానంలో మురళీ విజయ్ బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. స‌ఫారీ గ‌డ్డ‌పై టీమిండియా చాలాకాలం తర్వాత అడుగుపెట్టింది. ఇటీవల స్వదేశంలో సాధించిన విజయాలతో సరిపెట్టకుండా విదేశీ గడ్డ మీద కూడా సత్తా చాటాలని చూస్తోంది. కానీ హంట్ ప్రారంభించ‌క ముందే ఓపెనర్ శిఖర్ ధావన్ తొలి టెస్టుకు దూరం కావడం జట్టుకి పెద్ద ఎదురుదెబ్బగానే భావించాలి.

కాలి గాయంతోనే ధావన్ దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. అయితే, ఈ గాయం నుంచి ధావన్ పూర్తిగా కోలుకోక‌పోవ‌డంతో ధావన్ ను తొలి టెస్టుకు దూరంగా ఉంచుతున్నట్టు టీమ్ మేనేజ్ మెంట్ ప్రకటించింది. జనవరి 5 నుంచి భారత్-దక్షిణాఫ్రిల మధ్య తొలి టెస్టు జరగనుంది. కేప్ టౌన్ ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. ధావన్ కాలి గాయం నేపథ్యంలో, ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మురళీ విజయ్ లు బరిలోకి దిగనున్నారు.






Related News

కోహ్లీ చుట్టూ కొత్త వివాదం

Spread the loveటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్య‌వ‌హారం కొత్త వివాదానికి దారితీస్తోంది. బీసీసీఐ కి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.Read More

సిరీస్ పోయినా అది మిగిలింది…!

Spread the loveఇంగ్లడ్ గ‌డ్డ‌పై జ‌రిగిన‌ టెస్టు సిరీస్‌లో టీమిండియా ప‌రాజ‌యం పాల‌య్యింది. అయిన‌ప్ప‌టికీ టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో త‌నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *