చిక్కుల్లో ష‌మీ: సందిగ్ధంలో కెరీర్

Shami
Spread the love

టీమిండియా పేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ చిక్కుల్లో ప‌డ్డారు. కేసులో ఇరుక్కున్నారు. నాన్ బెయిల‌బుల్ సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది ష‌మీపై ఆయ‌న భార్య ఫిర్యాదుతో వ్య‌వ‌హారం దుమారం రేపుతోంది. మాజీలు, క్రికెట్ బోర్డ్ అధికారులు మ‌ద్ధ‌తుగా ఉన్న‌ప్ప‌టికీ ష‌మీ చివ‌ర‌కు ఐపీఎల్ కి దూరం కావాల్సిన ప‌రిస్థితి దాపురిస్తోంది. మూలిగే నక్కమీద తాటి పండొచ్చి పడ్డట్లుగా ష‌మీ స్థితి మారుతోంది. ’ ఇప్ప‌టికే వార్షిక వేతనాల కాంట్రాక్టుల్లో బీసీసీఐ షమీకి చోటు ద‌క్క‌లేదు. దానికితోడు పలువురి యువతులతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని భార్య హాసిన్‌ జహాన్‌ చేసిన ఆరోపణలు పోలీస్ స్టేష‌న్ కి చేర‌డం వివాద‌స్ప‌దం అవుతోంది.

అంద‌కు తోడుగా వివాదంలో చిక్కుకున్న షమీని ఐపీఎల్‌ క్యాంప్‌లకు అనుమతించాలా? వద్దా అనే సందిగ్ధంలో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ యాజమాన్యం ఉంది. ఈ విషయంలో బీసీసీఐ న్యాయసలహా తీసుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. మహ్మద్‌ షమీ షమీని వేలంలో ఢిల్లీ రూ. 3 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే.

షమీ అనేక మంది యువతులతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని అతని భార్య హాసిన్‌ జహాన్‌ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కోల్‌కతా పోలీసులు షమీపై గృహ హింసా చట్టం, భార్య జహాన్‌ను వేధించటం.. రేప్‌ అటెంప్ట్‌.. హత్యాయత్నం, వివాహేతర సంబంధాలకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వివాదంతో షమీ ఐపీఎల్‌కు దూరమైతే షమీ కెరీర్‌ ప్రశ్నార్ధకంగా మారనుంది. స‌మ‌ర్థుడైన బౌల‌ర్ చివ‌ర‌కు అనూహ్యంగా కుటుంబ త‌గాదాల‌తో చిక్కులు కొనితెచ్చుకోవ‌డం విచార‌క‌ర‌మ‌నే ప‌రిస్థితి వ‌స్తోంది.


Related News

hardik-28-1521641582-302081-khaskhabar

చిక్కుల్లో హార్థిక్ పాండ్యా

Spread the loveటీమిండియా ఆల్‌రౌండ‌ర్‌ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో ఇరుక్కున్నాడు. కోరి క‌ష్టాలు తెచ్చుకున్నాడు. నోటిదుర‌ద‌తో ఇప్పుడు న్యాయ‌స్థానాల ముందుRead More

crciket dressing room

రెచ్చిపోయిన క్రికెటర్లు

Spread the loveనిదాహాస్ టీ20 టోర్నీలో గ్రౌండ్ లోనే బంగ్లాదేశ్ ఆట‌గాళ్లు హ‌ల్ చ‌ల్ చేశారు. కెప్టెన్ ష‌కీబుల్ అయితేRead More

 • చిక్కుల్లో ష‌మీ: సందిగ్ధంలో కెరీర్
 • టీమిండియా బౌల‌ర్ పై బౌన్స‌ర్ వేసిన భార్య‌
 • పాండ్యా ల‌వ్ వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు
 • ద్రావిడ్ కి షాకిచ్చిన క్రికెట్ బోర్డ్
 • కోహ్లీ సేన‌కు మ‌రుపురాని సిరీస్
 • వైర‌ల్ గా మారిన కోహ్లీ కిస్
 • కోహ్లీ సృష్టించిన మ‌రో చ‌రిత్ర‌
 • కోహ్లీ కొత్త చరిత్ర
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *