Main Menu

మ‌ళ్లీ నోరుపారేసుకున్న షాహిద్ ఆఫ్రిదీ

Spread the love

పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ షాహిద్ ఆఫ్రీది మ‌రోసారి నోటికి ప‌నిచెప్పారు. గ‌తంలో కూడా త‌న నోటి దురుసుతో చీవాట్లు తిన్న‌ప్ప‌టికీ బుద్ధి మారిన‌ట్టు లేదు. తాజాగా మ‌రోసారి క‌శ్మీర్ విష‌యంలో సంచ‌ల‌న కామెంట్స్ చేసి క‌ల‌క‌లం రేపారు. కశ్మీర్‌ అంశంలో పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానాలపైనా నిప్పులు చెరిగాడు. తమ నాయకులు ఉన్న నాలుగు రాష్ట్రాలనే సరిగా పాలించలేకపోతున్నారని, ఇక పాకిస్తాన్‌కు కశ్మీర్‌ ఎందుకని ప్రశ్నించాడు. ఇక అదేవిధంగా కశ్మీర్‌ను భారత్‌కు కూడా అప్పగించే ప్రసక్తే లేదని, కశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశాడు. లోయలో అమాయక ప్రజలు చనిపోతున్నారని, మానవత్వంతో ఆలోచించి ఇరు దేశాలు నిర్ణయం తీసుకోవాలని సూచనలిచ్చాడు.

బ్రిటిష్ పార్లమెంట్‌లో విద్యార్థులతో మాట్లాడుతున్న సందర్భంగా ఆఫ్రిది ఈ వ్యాఖ్యలు చేశాడు. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి కూడా తమ ప్రభుత్వాలకు చేత కాలేదని విమర్శించడం విశేషం. పాక్‌ క్రికెట్‌ మాజీ సారథి ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆఫ్రిది ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వివాదానికి దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.






Related News

టాప్ లోనే కింగ్ కోహ్లీ

Spread the loveఅంతర్జాతీయ క్రికెట్‌ నియంత్రణ మండలి(ఐసిసి) మంగళవారం విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత సారథి విరాట్‌ కోహ్లీRead More

కోహ్లీ సేన కొత్త రికార్డులు

Spread the love ఆస్ట్రేలియాతో జరిగిన ఇక్కడ జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *