చిక్కుల్లో హార్థిక్ పాండ్యా

hardik-28-1521641582-302081-khaskhabar
Spread the love

టీమిండియా ఆల్‌రౌండ‌ర్‌ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో ఇరుక్కున్నాడు. కోరి క‌ష్టాలు తెచ్చుకున్నాడు. నోటిదుర‌ద‌తో ఇప్పుడు న్యాయ‌స్థానాల ముందు నిల‌వాల్సిన స్థితి తెచ్చుకున్నాడు. ఒక్క ట్వీట్ తో అత‌ని తీరు ఇప్పుడు దోషిని చేసింది. ఏకంగా రాజ్యాంగ నిర్మాత మీద అనుచిత వ్యాఖ్య‌లు చేసి అవ‌స్థ‌ల్లో ఇరుక్కున్న‌ట్ట‌య్యింది. అత‌నిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేయాల‌ని జోధ్‌పూర్ కోర్టు పోలీసుల‌ను ఆదేశించింది. దాంతో హార్థిక్ పాండ్యాకి చిక్కులు త‌ప్ప‌వ‌నిస్తోంది.

గ‌తేడాది డిసెంబ‌ర్ 26వ తేదీన పాండ్యా త‌న ట్విట‌ర్ ఖాతాలో బాబాసాహెబ్ బీఆర్ అంబేద్క‌ర్‌పై అనుచిత వ్యాఖ్యాలు చేశాడు. దీనిపై తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం అయ్యింది. రాజ‌స్థాన్‌కు చెందిన రాష్ట్రీయ భీమ్ సేన స‌భ్యుడు మేఘావాల్.. పాండ్యాపై కోర్టులో పిటీష‌న్ వేశారు. పాండ్యాపై పోలీసులు కేసు న‌మోదు చేయ‌క‌పోవ‌డంతో మేఘావాల్ కోర్ట్ ని ఆశ్ర‌యించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు న‌మోదు చేయాల‌ని కోర‌డంతో జోథ్ పూర్ కోర్ట్ అంగీక‌రించింది. దాంతో ఇప్పుడు హార్థిక పాండ్యా మీద కేసు ఎటు మ‌లుపు తిరుగుతుంద‌నే చ‌ర్చ మొద‌ల‌య్యింది.

గ‌డిచిన ఏడాది డిసెంబ‌ర్ 26వ తేదీన పాండ్యా త‌న ట్విట‌ర్ ఖాతాలో `ఏ అంబేద్క‌ర్‌? దేశంలో రిజ‌ర్వేష‌న్ల పేరుతో ఓ వ్యాధిని వ్యాప్తి చెందించిన వ్యక్తా?` అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చాలా వివాదాస్ప‌దంగా మారి పాండ్యాను చిక్కుల్లో ప‌డేసింది. ఆ ట్వీట్ రాగానే ప‌లువురు పాండ్యాపై దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు ఏకంగా కోర్ట్ గుమ్మం ఎక్కాల్సి రావ‌డంతో పాండ్యా ఏం చేస్తాడో చూడాలి.


Related News

Sania-Mirza-1

కొత్త‌పాత్ర‌లో సానియా మీర్జా

Spread the love3Sharesఇండియ‌న్ టెన్నీస్ బ్యూటీ, పాకిస్తాన్ కోడ‌లు సానియా మీర్జా కొత్త పాత్ర ధ‌రించ‌బోతోంది. వ‌చ్చే అక్టోబ‌ర్ లోనేRead More

chahal

క‌న్న‌డ హీరోయిన్ తో సంబంధంపై చాహ‌ల్ ..

Spread the loveక‌న్న‌డ హీరోయిన్ తో టీమిండియా స్పిన్న‌ర్ య‌జువేంద్ర చాహ‌ల్ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్Read More

 • బీజేపీకి షాకిచ్చిన స్టార్ క్రికెట‌ర్లు
 • సైనాదే పై చేయి: మ‌ళ్లీ సిల్వ‌ర్ సింధు
 • ఐపీఎల్ మార్చేస్తున్నారు…
 • ఐపీఎల్ మ్యాచ్ లో అతి పెద్ద త‌ప్పిదం
 • మ్యాచ్ ఫిక్సింగ్ ఉచ్చులో టీమిండియా క్రికెటర్
 • ఆఫ్రీదికి గంభీర్ ఘాటు కౌంట‌ర్
 • క‌న్నీరు పెట్టుకున్న డేవిడ్ వార్న‌ర్
 • ఏడాది వేటు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *