Main Menu

రిష‌బ్ చెత్త.. కృణాల్ కొత్త రికార్డ్!

Spread the love

టీమిండియా ఆసీస్ పర్య‌ట‌న సంతృప్తిక‌రంగా స్టార్ట్ కాక‌పోయినా చివ‌ర‌కు టీ20 సిరీస్ స‌మం కావ‌డంతో ఊపిరిపీల్చుకుంది. అయితే టీ20 మ్యాచ్ ల‌లో వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తొలి మ్యాచ్ లో అనూహ్యంగా రివ‌ర్స్ స్వీప్ కి ప్ర‌య‌త్నించి చేజేతులా వికెట్ స‌మ‌ర్పించుకున‌న పంత్ కార‌ణంగానే జ‌ట్టు ప‌రాజ‌యం చ‌విచూడాల్సి వ‌చ్చింది.

లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ ఆత‌ర్వాత చివ‌రి మ్యాచ్ లో సాధించిన ఘ‌న‌త‌తో ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత చెత్త రికార్డు నెలకొల్పాడు. టీ20లో గోల్డెన్ డక్ అయిన తొలి భారత వికెట్ కీపర్‌గా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. లోకేశ్ రాహుల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్.. ఆండ్రూ టై వేసిన పదమూడో ఓవర్ తొలి బంతికి అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఫలితంగా టీ20ల్లో గోల్డెన్ డక్ అయిన తొలి భారత వికెట్ కీపర్‌గా రికార్డులకెక్కాడు. కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టులో చోటు సంపాదించుకున్న పంత్ అరంగేట్ర మ్యాచ్‌లో తొలి బంతినే సిక్సర్ కొట్టి రికార్డు సృష్టించాడు.

అదే స‌మ‌యంలో తొలి మ్యాచ్ లో విఫ‌ల‌మ‌య్యి విమ‌ర్శ‌లు పాల‌యిన కృణాళ్ పాండ్యా మాత్రం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. నాలుగు వికెట్ల‌తో ఆక‌ట్టుకున్నాడు. సిడ్నీలో తొలిస్పిన్న‌ర్ గా నిలిచాడు. టీ20ల‌లో నాలుగు వికెట్లు సిడ్నీలో స్పిన్న‌ర్ కి ద‌క్క‌డం ఇదే తొలిసారి.






Related News

హార్థిక్ పాండ్యా దూరం..!

Spread the loveటీమిండియా కి అనుకోని ఎదురుదెబ్బ త‌గిలింది. ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా మ‌రోసారి జ‌ట్టుకు దూరమ‌య్యాడు. గ‌తంలోRead More

కోహ్లీ టాప్ లోనే..!

Spread the loveటీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ టెస్ట్‌ బ్యాట్స్‌మన్ల జాబితాలో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. ఐసిసి ప్రకటించిన జాబితాలో 922Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *