Main Menu

ద్రావిడ్ కి షాకిచ్చిన క్రికెట్ బోర్డ్

Spread the love

ప్ర‌పంచ‌విజేత‌లుగా యువ‌భార‌త్ ని తీర్చిదిద్దిన రాహుల్ ద్రావిడ్ కి షాక్ త‌గిలింది. ప్రైజ్ మ‌నీ వివాదంలో యంగ్ ఇండియా కోచ్ కు అశ‌నిపాతం అయ్యింది. బీసీసీఐ తీసుకున్న నిర్ణ‌యం పెను దుమారం రేపేలా ఉంది. కోచ్ తో స‌మానంగా ఆట‌గాళ్ల‌కు కూడా ప్రైజ్ మ‌నీ ఇవ్వాల‌ని ద్రావిడ్ డిమాండ్ చేశాడు. త‌న‌కు 50ల‌క్ష‌లు ప్ర‌క‌టించి, ఆట‌గాళ్ల‌కు 20ల‌క్ష‌లు మాత్ర‌మే ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌డంపై ఆయ‌న మండిప‌డ్డారు. దాంతో బీసీసీఐ తాజాగా ద్రావిడ్ ప్రైజ్ మ‌నీని తగ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఆట‌గాళ్ల‌తో దాదాపు స‌మానంగా 25ల‌క్ష‌ల‌కు కుదించి అనూహ్య ప్ర‌క‌ట‌న చేసింది. దాంతో ద్రావిడ్ కి ప్రైజ్ మ‌నీ క‌ట్ చేయ‌డం ఆశ్చ‌ర్యంగా మారింది.

తనకు రూ.50 లక్షలు, సిబ్బందికి రూ.20 లక్షలు ప్రకటించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ద్రవిడ్ వారు కూడా తనలాగే కష్టపడ్డారని, ప్రైజ్‌మనీ విషయంలో ఈ తేడాలెందుకంటూ బోర్డు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో స్పందించిన బీసీసీఐ ప్రైజ్‌మనీ ప్రకటనను సవరించింది. ద్రవిడ్ సహా సిబ్బందికి కూడా చెరో రూ.25 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. సపోర్టింగ్ స్టాఫ్‌ మరింతమందికి ఈ ప్రోత్సాహకం అందించాలని నిర్ణయిస్తూ మరింతమందిని జాబితాలో చేర్చింది.






Related News

కోహ్లీ చుట్టూ కొత్త వివాదం

Spread the loveటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్య‌వ‌హారం కొత్త వివాదానికి దారితీస్తోంది. బీసీసీఐ కి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.Read More

సిరీస్ పోయినా అది మిగిలింది…!

Spread the loveఇంగ్లడ్ గ‌డ్డ‌పై జ‌రిగిన‌ టెస్టు సిరీస్‌లో టీమిండియా ప‌రాజ‌యం పాల‌య్యింది. అయిన‌ప్ప‌టికీ టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో త‌నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *