Main Menu

టీమిండియా కెప్టెన్ రహానే

Spread the love

టీమిండియాకు కొత్త కెప్టెన్ వచ్చాడు. కోహ్లీ స్థానంలో సారధ్య బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. ఒక్క టెస్ట్ మ్యాచ్ కే అయినప్పటికీ జట్టు సారధుల జాబితాలో చేరే చాన్స్ రహానే దక్కించుకున్నాడు. గతంలో ఆసీస్ తో ధర్మశాల టెస్ట్ లో కూడా రహానే సారధ్యం వహించాడు. విజయం సాధించాడు. అయితే అప్పుడు తాత్కాలికంగా, ఇప్పుడు ఓ సిరీస్ కి సారధిగా ఎంపిక కావడం విశేసం. ఆఫ్ఘనిస్థాన్‌ తొలి టెస్టులో తలపడే భారత క్రికెట్‌ జట్టుకు అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు ఇంగ్లాండ్‌ వెళ్లనుండటంతో రహానేకు సారథ్య బాధ్యతలను అప్పగించనున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రహానే సారథ్యంలో భారత్‌ జూన్‌ 14న బెంగళూరులో జరిగే టెస్ట్‌ మ్యాచ్‌లో ఆఫ్గాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌తోనే ఆఫ్ఘనిస్తాన్‌ టెస్టుల్లోకి ప్రవేశించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో అజింక్య రహానే రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు కెప్టెన్ గా ఆడుతున్నాడు.

అఫ్గానిస్థాన్‌తో జరిగే చారిత్రక టెస్టులో విరాట్‌ కోహ్లీ స్థానంలో యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌కు చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు కోహ్లి జూన్‌లో ఇంగ్లాండ్‌ వెళ్లనున్నాడు. దీంతో కోహ్లి ఆఫ్ఘన్‌తో టెస్టుకు, ఐర్లాండ్‌ సిరీస్‌కు అందుబాటులో ఉండడు. అతడి స్థానంలో శ్రేయస్‌ పేరును బిసిసిఐ సెలక్షన్‌ కమిటీ పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆఫ్ఘన్‌తో టెస్టుకు రహానె సారథ్యం వహిస్తుండగా, ఐర్లాండ్‌తో సిరీస్‌కు రోహిత్‌ శర్మ నాయకత్వం వహించవచ్చు. జులై మొదటి వారంలో కోహ్లీ భారత జట్టుతో కలుస్తాడు.అలాగే ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడుతున్న ఛెతేశ్వర్‌ పుజారా, ఇషాంత్‌ శర్మ అఫ్గాన్‌ టెస్టుకు అందుబాటులో ఉంటారని బిసిసిఐ స్పష్టం చేసింది. కోహ్లీ స్థానంలో శ్రేయస్‌, జడేజా స్థానంలో అక్షర్‌ పటేల్‌, హార్డిక్‌ పాండ్య బదులు విజరు శంకర్‌ పేర్లు సెలక్షన్‌ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని బిసిసిఐ అధికారి ఒకరు వెల్లడించారు.






Related News

8 నెలల్లో కోహ్లీకిది ఆరోది

Spread the love ట్రెం‌‌ట్‌బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు.Read More

రెండో రోజు బౌల‌ర్ల‌దే..!

Spread the loveతొలిరోజు టీమిండియా బ్యాట్స్ మెన్ రాణించారు. తొలిసారిగా మిడిలార్డ‌ర్ రాణించ‌డంతో జ‌ట్టు మంచి స్కోర్ సాధించింది. అయితేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *