Main Menu

ర‌ఫా ది ఛాంపియ‌న్

rafa nadal
Spread the love

ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, క్లే కోర్టు స్పెషలిస్టు రాఫెల్ నాదల్ గ్రాస్ కోర్టులోనూ రాణించే సత్తా తనకు ఉందని నిరూపించాడు. యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్ ఆండర్సన్‌ను 6-3, 6-3, 6-4 తేడాతో వరుస సెట్లలో ఓడించిన ‘స్పెయిన్ బుల్’ కెరర్‌లో 16వ గ్రాండ్ శ్లామ్ సింగిల్స్ టైటిల్‌ను అందుకున్నాడు. యుఎస్ ఓపెన్‌లో అతను విజేతగా నిలవడం ఇది మూడోసారి. క్లే కోర్టుల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు కాబట్టే, ఫ్రెంచ్ ఓపెన్‌లో ఏకంగా పది పర్యాయాలు విజేతగా నిలిచాడు. హార్డ్, గ్రాస్ కోర్టుల్లో అతను గొప్పగా రాణించిన సందర్భాలు తక్కువే. సుమారు రెండేళ్ల క్రితం కాలి, చేతి మణికట్టు గాయాలతో అల్లాడిపోయి, ఒకానొక దశలో టెన్నిస్‌కు దూరమయ్యే ప్రమాదంలో పడిన నాదల్ పట్టుదలతో ప్రయత్నించి, ఫిట్నెస్ సమస్యలను అధిగమించాడు. శస్త్ర చికిత్సలు చేయించుకున్న తర్వాత మళ్లీ ప్రాక్టీస్‌ను మొదలుపెట్టడమేగాక, అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తూ, ఏకంగా ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని అందుకున్నాడు.

ఈ ఏడాది నాలుగు గ్రాండ్ శ్లామ్స్‌లో అతను మూడింటిలో ఫైనల్ చేరడం విశేషం. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌లో ఫెదరర్ చేతిలో ఓడిన అతను ఫ్రెంచ్ ఓపెన్‌లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. తుది పోరులో స్టానిస్లాస్ వావ్రిన్కాపై విజయం సాధించి, రికార్డు స్థాయిలో పదోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను అందుకున్నాడు. వింబుల్డన్‌లో నాలుగో రౌండ్ నుంచే నిష్క్రమించాడు. గిలెస్ ముల్లర్ చేతిలో ఓడిన అతను యుఎస్ ఓపెన్‌లో ‘అండర్ డాగ్’గానే బరిలోకి దిగాడు. అయితే, తిరుగులేని విజయాలను నమోదు చేస్తూ ఫేవరిట్స్ జాబితాలోకి చేరాడు. గ్రాస్ కోర్టుల్లోనూ విజయాలను సాధించే శక్తిసామర్థ్యాలు తనకు ఉన్నాయని కెవిన్ ఆండర్సన్‌ను పైనల్‌లో వరుస సెట్లలో ఓడించడం ద్వారా రుజువు చేశాడు.

రాఫెల్ నాదల్ కెరీర్‌లో మూడోసారి యుఎస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఇంతకు ముందు అతను 2010, 2013 సంవత్సరాల్లో యుఎస్ చాంపియన్‌గా నిలిచాడు. అతని ఖాతాలో ఒక ఆస్ట్రేలియా ఓపెన్ (2009), పది ఫ్రెంచ్ ఓపెన్ (2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017), రెండు వింబుల్డన్ (2008, 2010) టైటిళ్లు కూడా ఉన్నాయి. సింగిల్స్ విభాగంలో నాదల్ ఇంత వరకూ సాధించిన టైటిళ్ల సంఖ్య 74. ఓపెన్ శకంలో అత్యధిక సింగిల్స్ టైటిళ్లను గెల్చుకున్న ఆటగాళ్ల జాబితాలో జిమీ కానర్స్ (109 టైటిళ్లు), ఇవాన్ లెండిల్ (94 టైటిళ్లు), రోజర్ ఫెదరర్ (93 టైటిళ్లు), జాన్ మెకెన్రో (77 టైటిళ్లు) వరుసగా మొదటి నాలుగు స్థానాలను ఆక్రమించుకోగా, 74 టైటిళ్లను సాధించిన నాదల్ ఐదో స్థానాన్ని రాడ్ లెవర్‌తో కలిసి పంచుకుంటున్నాడు. కాగా, డబుల్స్ విభాగంతో కలిపి నాదల్ కైవసం చేసుకున్న టైటిళ్ల సంఖ్య 85కు చేరింది. అన్ని విభాగాల్లోనూ కలిపి ఎక్కువ టైటిళ్లు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో నాదల్‌ది 13వ స్థానం. ఈ జాబితాలో జాన్ మెకెన్రో (77 సింగిల్స్, 78 డబుల్స్, ఒక మిక్స్‌డ్ డబుల్స్‌సహా మొత్తం 156), జిమీ కానర్స్ (109 సింగిల్స్, 15 డబుల్స్‌సహా మొత్తం 124), బాబ్ బ్రియాన్ (114 డబుల్స్, 7 మిక్స్‌డ్ డబుల్స్‌సహా మొత్తం 121), మైక్ బ్రియాన్ (116 డబుల్స్, 4 మిక్స్‌డ్ డబుల్స్‌సహా మొత్తం 120), రాడ్ లెవర్ (74 సింగిల్స్, 37 డబుల్స్‌సహా మొత్తం 111 టైటిళ్లు) మొదటి ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.


Related News

australia

34 ఏళ్ల దిగువ‌కు ఆసీస్

Spread the loveఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టు ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారుతోంది. రానురాను ఆ జ‌ట్టు ప‌రిస్థితి ప‌త‌నం దిశ‌గా సాగుతోంది.Read More

Indian players celebrate the dismissal of Afghanistan's Mohammad Nabi during the second day of their one-off cricket test match in Bangalore, India, Friday, June 15, 2018. (AP Photo/Aijaz Rahi)

రికార్డుల మోత మోగించిన టీమిండియా

Spread the love భారత్‌ అఫ్గానిస్తాన్‌ జట్ల మధ్య జరిగిన చారిత్రక టెస్టు ఏక‌ప‌క్షంగా సాగింది. రెండు రోజులు పూర్తికాకుండానేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *