మళ్లీ రజత సింధు

PV SINDHU
Spread the love

పీవీ సింధు పోరాట ప్రతిమ ప్రదర్శించింది. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. దాంతో చివరకు ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కూడా రజతంతో సరిపెట్టుకోక తప్పలేదు. జపాన్ ప్రత్యర్థి చేతిలో పీవీ సింధు ఫైనల్స్ లో తలవంచింది. కానీ బ్యాడ్మింటన్ ప్రియుల మన్ననలు పొందింది. ఫైనల్స్ లో ఓటమి పాలయిన పీవీ సింధూకి 10లక్షలు, సెమీస్ లో ఓడి కాంశ్యంతో సరిపెట్టుకున్న సైనా నెహ్వాల్ కి 5లక్షలు చొప్పున బ్యాడ్మింటన్ అసోసియేషన్ రివార్డ్ ప్రకటించింది. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో వారి ప్రతిభకు గుర్తింపు ఈ రివార్డ్ ప్రకటిస్తున్నట్టు తెలిపింది.

ఇక ఫైనల్స్ లో తొలి సెట్ లో ఓటమి పాలయిన సిందు, రెండో రౌండ్ లో రెచ్చిపోయింది. దాంతో రెండో రౌండ్ గెలిచి సమం అయిన సమయంలో కీలకమయిన మూడో రౌండ్ లో ఓటమి పాలయ్యి పరాజయం మూటగట్టుకుంది. నోజోమీ ఒకుహోరా అద్భుతంగా రాణించడంతో చివరకు పీవీ సింధు 19-21, 22-20, 20-22 తలవంచక తప్పలేదు. అత్యంత హోరా హోరీగా సాగిన ఫైనల్స్ లో ప్రతీ పాయింట్ కోసం ఇరువురు తీవ్రంగా శ్రమించారు. కానీ చివరకు ఫలితం జపాన్ క్రీడాకారిణికి అనుకూలంగా రావడం విశేషం.


Related News

VIRAT-KOHLI

వైర‌ల్ గా మారిన కోహ్లీ కిస్

Spread the loveటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా అదో సంచ‌ల‌నం అవుతోంది. గ్రౌండ్ లో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌తోRead More

kohli team india

కోహ్లీ సృష్టించిన మ‌రో చ‌రిత్ర‌

Spread the loveసుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన క్రికెట్ లో కోహ్లీ ఖ్యాతి రోజురోజుకి పెరుగుతోంది. ఐసీసీ చ‌రిత్ర‌లో కింగ్ కోహ్లీRead More

 • కోహ్లీ కొత్త చరిత్ర
 • ప్రయోగాలకు సిద్దమవుతున్న కోహ్లీ
 • కోహ్లీ సేన కొత్త చ‌రిత్ర‌..
 • దక్షిణాఫ్రికాకు మరో దెబ్బ
 • టీమిండియా సంచలన విజయం
 • దక్షిణాఫ్రికాకి గట్టి దెబ్బ
 • చెలరేగిన కోహ్లీ, బారత్ బోణీ
 • పాక్ ని మట్టికరిపించిన యువభారత్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *