Main Menu

పుజారా, పంత్ హ‌వా

Spread the love

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో 521 పరుగులు సహా మూడు శతకాలు బాదిన చతేశ్వర్‌ పుజార ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మరో స్థానం పైకి చేరాడు. భారత జట్టులో నం.3 పొజిషన్‌లో బ్యాటింగ్‌ చేసే పుజారకు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ మూడోస్థానమే దక్కింది. 521 పరుగుల తన కెరీర్‌ అత్యధిక విదేశీ సిరీస్‌ స్కోరుతో పుజార ఆసీస్‌పై విజయంలో ముఖ్య భూమిక వహించాడు. సిడ్నీ టెస్టుకు నాల్గో స్థానంలో కొనసాగిన పుజార, సిడ్నీలో 193 పరుగులు సాధించాడు. దీంతో 881 పాయింట్లు సాధించి, వరల్డ్‌ నం.3 బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

కెప్టెన్‌ కోహ్లి 922 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ రెండో స్థానంలో నిలిచాడు. నిషేధంలో ఉన్న ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ నాల్గో స్థానంలో, ఇంగ్లాండ్‌ నాయకుడు జో రూట్‌ ఐదో స్థానంలో ఉన్నారు. ఇక సిడ్నీలో అజేయంగా 159 పరుగులు బాదిన యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ 21 స్థానాలు ఎగబాకాడు. 673 పాయింట్లతో అత్యధిక రేటింగ్‌ సాధించిన భారత వికెట్‌ కీపర్‌గా ధోనిని (662)ని వెనక్కి నెట్టిన పంత్‌ 20వ స్థానంలో నిలిచాడు. బౌలర్ల జాబితాలో జడేజా ఐదో స్థానంలో నిలువగా, ఆల్‌రౌండర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *