Main Menu

పుజారా ఒంట‌రిపోరాటం, కోలుకున్న టీమిండియా

Spread the love

ఆసీస్ తో తొలి టెస్ట్ తొలి రోజు టీమిండియాకు చేదు ప్రారంభం ఎదుర‌య్యింది. ఆరంభంలోన టాపార్డ‌ర్ వికెట్లు ట‌ప‌ట‌పా కోల్పోయింది. దాంతో జ‌ట్టు గౌర‌ప్ర‌ద‌మైన స్కోర్ సాధించ‌గ‌లుగుతుందా లేదా అన్న సందేహం క‌లిగింది. అయితే చివ‌ర‌కు వ‌న్ డౌన్ బ్యాట్స్ మెన్ ఒంట‌రిపోరాటంతో జ‌ట్టు కోలుకుంది. బ్యాట్స్ మెన్ ఒక్కొక్క‌రుగా క్యూ క‌డుతున్నా ఛ‌టేశ్వ‌ర్ పుజారా మాత్రం బ్యాట్ కి ప‌ని చెప్పారు. సెంచ‌రీతో క‌దం తొక్కాడు. దాంతో టీమిండియా తొలి రోజు ఆట‌లో చివ‌ర‌కు 250 ప‌రుగుల స్కోర్ దాటింది.

తొలుత బ్యాటింగ్ కి దిగిన టీమిండియా రాహుల్, ముర‌ళీ విజ‌య్, కోహ్లీ వైఫ‌ల్యంతో 20 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. రాహుల్ 2, కోహ్లీ 3, ముర‌ళీ విజ‌య్ 11 ప‌రుగులు చేశారు. ఆ త‌ర్వాత ర‌హానే కూడా 13 ప‌రుగులు చేసి అన‌వ‌స‌రంగా అవుట్ సైడ్ బాల్ ఆడి స్లిప్పులో క్యాచ్ ఇచ్చి 46 ప‌రుగుల వ‌ద్ద అవుట‌య్యారు. ఆ త‌ర్వాత మంచి ఊపులో క‌నిపించిన రోహిత్ శ‌ర్మ 35 ప‌రుగులు చేసి అవుట‌వ‌డంతో వంద లోపులోనే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ త‌ర్వాత రిష‌భ్ పంత్ కూడా 25 ప‌రుగుల‌తో ఊపు క‌నిపించిన‌ప్ప‌టికీ చివ‌ర‌కు 126 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ గా అవుట‌య్యాడు.

ఆ త‌ర్వాత అశ్విన్ తో క‌లిసి పుజారా ఏడో వికెట్ కి కీల‌క‌మైన పార్ట‌న‌ర్ షిప్ న‌మోదు చేశారు. 22 ర‌న్స్ చేసిన త‌ర్వాత అశ్విన్ 189 ప‌రుగుల వ‌ద్ద ఏడో వికెట్ గా అవుట‌య్యాడు. ఆత‌ర్వాత ఇషాంత్ శ‌ర్మ 4 ప‌రుగులు చేసి అవుట్ కావ‌డంతో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఆ వెంట‌నే ఆసీస్ గ‌డ్డ మీద తొలి సెంచ‌రీ సాధించిన పుజారా, ఆక్ర‌మంలో టెస్టుల్లో 5వేల ప‌రుగుల‌కు చేరుకున‌నాడు. చివ‌ర‌కు 123 ప‌రుగులు చేసిన త‌ర్వాత ర‌నౌట్ గా వెనుదిర‌గ‌డంతో టీమిండియా 250 ర‌న్స్ వ‌ద్ద‌ తొమ్మిదో వికెట్ కోల్పోయింది

తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి జ‌ట్టు 9 వికెట్లు కోల్పోయి 250 ప‌రుగులు చేసింది. ఆసీస్ జ‌ట్టులో క‌మిన్స్, హాజిల్ వుడ్, స్టార్క్, ల‌య‌న్ త‌లో రెండు వికెట్లు చొప్పున సాధించారు.






Related News

టాప్ లోనే కింగ్ కోహ్లీ

Spread the loveఅంతర్జాతీయ క్రికెట్‌ నియంత్రణ మండలి(ఐసిసి) మంగళవారం విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత సారథి విరాట్‌ కోహ్లీRead More

కోహ్లీ సేన కొత్త రికార్డులు

Spread the love ఆస్ట్రేలియాతో జరిగిన ఇక్కడ జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *