Main Menu

హార్థిక్ పాండ్యా దూరం..!

Spread the love

టీమిండియా కి అనుకోని ఎదురుదెబ్బ త‌గిలింది. ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా మ‌రోసారి జ‌ట్టుకు దూరమ‌య్యాడు. గ‌తంలో ఆయ‌న నోటి దురుసుతో చేసిన కామెంట్స్ క‌ష్టాలు తెస్తే, ఈసారి ఫిట్ నెస్ స‌మ‌స్యలు వెంటాడ‌డంతో జ‌ట్టుకు దూరం కావాల్సి వ‌చ్చింది.

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే ద్వైపాక్షిక పరిమిత ఓవర్ల సిరీస్‌నుంచి ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా త‌ప్పుకున్న‌ట్టు ప్ర‌క‌టించారు. వెన్నునొప్పి బాధ తిరగబెట్టడంతో వన్డే సిరీస్‌ మొత్తానికి దూరమైనట్లు బిసిసిఐ వెల్ల‌డించింది. దీంతో వన్డే సిరీస్‌కు హార్దిక్‌ పాండ్యా స్థానంలో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకుంటున్నట్టు తెలిపింది. గత ఏడాది ఆసియాకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా వెన్నునొప్పితో ఆ టోర్నీనుంచి అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది. ప్రధానంగా వరల్డ్‌కప్‌కు ముందు జరుగుతున్న కీలక సిరీస్‌ నుంచి పాండ్యా వైదొలగడం టీమిండియా మేనేజ్‌మెంట్‌ను కలవరపాటుకు గురిచేస్తోంది.






Related News

ఆ ముగ్గురే ఏ ప్ల‌స్

Spread the loveటీమిండియా ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ గ్రేడ్లు ప్ర‌క‌టించింది. వాటి ఆధారంగా ఆట‌గాళ్ల‌కు రెమ్యునేష‌న్ అందిస్తారు. అయితే ఈసారి జాబితాలోRead More

ఒక్క మ్యాచ్ లో ఎన్ని రికార్డులో..!

Spread the loveరికార్డుల ప‌రంప‌ర సాగుతోంది. విండీస్, ఇంగ్లాండ్ సిరీస్ ఆస‌క్తిక‌రంగా మారుతోంది. హోరాహోరీ పోరులో బ్యాట్స్ మెన్లు ప‌రుగులRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *