మ్యాచ్ ఫిక్సింగ్ ఉచ్చులో టీమిండియా క్రికెటర్

munaf patel
Spread the love

టీమిండియా క్రికెటర్ వ్యవహారం కలకలం రేపుతోంది. మ్యాచ్ ఫిక్సింగ్ భాగోతంలో మారు మ్రెగుతోంది. దాంతో ఇప్పుడీ వ్యవహారం ఆసక్తిగా మారింది. తాజాగా బీసీసీఐ రంగంలో దిగింది. విచారణ ప్రారంభించింది. 2011లో ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన మునాఫ్ పటేల్‌‌పై వచ్చిన ఆరోపణలతో అప్రమత్తమయ్యింది. ఆర్పీఎల్ పేరుతో జరుగుతున్న రాజ్ పుటానా ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందనే ఆరోపణలతో విచారణ ప్రారంభమయ్యింది. ఆర్పీఎల్‌లో ఓ మ్యాచ్‌లో జరిగిన కొన్ని ఘటనలు ఫిక్సింగ్‌ ఆరోపణలకు ఊతమిచ్చాయి. ఆ మ్యాచ్‌లో బౌలర్ వరుసపెట్టి వైడ్లు వేశాడు. ప్రత్యర్థి జట్టు విజయానికి పది పరుగులు మాత్రమే అవసరమైన వేళ చివరి ఓవర్ వేసిన బౌలర్ ధారాళంగా వైడ్లు వేస్తూ పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

ఆర్పీఎల్‌కు కొంత మేరకు ఆర్థిక సాయం అందించిన ఓ వ్యక్తి ‘ఆర్గనైజ్‌డ్ క్రికెట్ రాకెట్’ వెనక ఉన్నట్టు రాజస్థాన్ పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి వ్యాపార లావాదేవీలన్నీ మునాఫ్ పటేల్ తో ముడిపడి ఉన్నట్టు సందేహిస్తున్నారు. అయితే ఆ ఆరోపణలు అవాస్తవమని మునాఫ్ పటేల్ కొట్టి పడేశాడు. ఆర్పీఎల్ వంటి స్థానిక లీగ్‌లను ఫిక్స్ చేయలేమని పేర్కొన్నాడు. తనకు క్రికెట్ తప్ప మరో ప్రపంచం తెలియదని పేర్కొన్నాడు. తనపై ఎవరైనా ఆరోపణలు చేసినా.. అది సీఐడీ అయినా, ప్రభుత్వమైనా వదిలిపెట్టబోనని హెచ్చరించాడు. తాను బుకీని కానని, తన బెట్టింగ్‌కు పాల్పడలేదని మునాఫ్ స్పష్టం చేశాడు.


Related News

kumble, dravid

బీజేపీకి షాకిచ్చిన స్టార్ క్రికెట‌ర్లు

Spread the loveబీజేపీకి వ‌రుస‌గా ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. తాజాగా ఆపార్టీలో కొన‌సాగ‌డం సుర‌క్షితం కాదంటూ ఓ న‌టి గుడ్ బైRead More

saina sindhu

సైనాదే పై చేయి: మ‌ళ్లీ సిల్వ‌ర్ సింధు

Spread the loveసీనియ‌ర్ సాధించింది. సైనా నెహ్వాల్ గెలిచింది. పీవీ సింధు ని ఓడించింది. కామ‌న్ వెల్త్ గేమ్స్ లోRead More

 • ఐపీఎల్ మార్చేస్తున్నారు…
 • ఐపీఎల్ మ్యాచ్ లో అతి పెద్ద త‌ప్పిదం
 • మ్యాచ్ ఫిక్సింగ్ ఉచ్చులో టీమిండియా క్రికెటర్
 • ఆఫ్రీదికి గంభీర్ ఘాటు కౌంట‌ర్
 • క‌న్నీరు పెట్టుకున్న డేవిడ్ వార్న‌ర్
 • ఏడాది వేటు
 • ఆసీస్ కి అనూహ్య దెబ్బ‌
 • చిక్కుల్లో హార్థిక్ పాండ్యా
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *