Main Menu

మిథాలీ మ‌న‌స్తాపం, ఇక గుడ్ బై

Spread the love

టీమిండియా స్టార్ బ్యాట్స్ ఉమెన్ అనూహ్య నిర్ణ‌యం తీసుకునే దిశ‌లో ఆలోచిస్తోంది. ఇప్ప‌టికే ప‌రిణామాలు ఆ దిశ‌లో క‌నిపిస్తున్నాయి. హర్మన్‌ప్రీత్‌లా అలవోకగా బంతిని మైదానం దాటించపోవచ్చు. రోహిత్‌ శర్మలా మంచినీళ్ల ప్రాయంలా భారీ స్కోర్లు కొట్టలేకపోవచ్చు. కానీ టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ క్రికెట్‌లో ఆమెదే హవా. మెన్స్‌, ఉమెన్స్‌ విభాగాల్లో కలిపి 20 ఓవర్ల ఆటలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌ రికార్డు ఆమె సొంతం. ఆమెనే మహిళల క్రికెట్‌ దిగ్గజం మిథాలీరాజ్‌. 85 మ్యాచుల్లో (80 ఇన్నింగ్స్‌లు) 17 అర్ధ సెంచరీలతో మిథాలీరాజ్‌ 2283 పరుగులు చేసింది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎంతటి ప్రత్యర్థిపైనైనా నిలకడగా పరుగులు సాధించటంలో మిథాలీది ప్రత్యేక శైలి.

చివరి మ్యాచ్ వ‌ర‌కూ ఫామ్‌ను, పరుగుల జోరును కొనసాగించిన ఘనత మిథాలీ సొంతం. వన్డేల్లో, టీ20ల్లో తిరుగులేని ప్రదర్శనలతో మహిళల క్రికెట్‌ దిగ్గజంగా ఎదిగిన మిథాలీరాజ్‌ 1999లో అంతర్జాతీయ అరంగేట్రం తర్వాత తొలిసారి వేటుకు గురైంది. ఆంటిగ్వాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌తో పోరులో మిథాలీరాజ్‌ను బెంచ్‌కు పరిమితం చేశారు. ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉన్నప్పటికీ సీనియర్‌ క్రికెటర్‌పై వేటు వేశారు.

ఈ పరిణామం భారత మహిళల క్రికెట్‌లో పెద్ద దుమారం రేపుతోంది. ఆంటిగ్వా సెలక్షన్‌ను అవమానంగా భావిస్తున్న మిథాలీరాజ్‌ .. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యం వహిస్తున్న టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అదే జరిగితే వెటరన్‌ సీమర్‌ జులన్‌ గోస్వామి తర్వాత మిథాలీరాజ్‌ సేవలను సైతం పొట్టి ఫార్మాట్‌ జట్టు కోల్పోనున్నది.






Related News

టాప్ లోనే కింగ్ కోహ్లీ

Spread the loveఅంతర్జాతీయ క్రికెట్‌ నియంత్రణ మండలి(ఐసిసి) మంగళవారం విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత సారథి విరాట్‌ కోహ్లీRead More

కోహ్లీ సేన కొత్త రికార్డులు

Spread the love ఆస్ట్రేలియాతో జరిగిన ఇక్కడ జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *