బాలీవుడ్ లో మిథాలీ రాజ్ మువీ

mithali-raj-0a
Spread the love

ఇప్పటికే పలువురు క్రికెటర్లు ఇలాంటి గౌరవం అందుకున్నారు. అయితే వాళ్లంతా మెన్ కావడం విశేషం. తొలిసారిగా ఇప్పుడో మహిళా క్రికెటర్ జీవిత చరిత్ర తెరకెక్కబోతోంది. అలాంటి అరుదైన అవకాశం మిథాలీ రాజ్ కి దక్కింది. ఈ హైదరాబాదీ క్రికెటర్ బయె పిక్ కి బాలీవుడ్ సిద్ధమవుతోంది.

సచిన్, ధోనీ, అజహార్ వంటి ఉద్దండులు జీవిత చరిత్రలు తెరకెక్కించారు. అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి కూడా. ఇప్పుడు అదే బాటలో మిథాలీ రాజ్ బయోపిక్ కి సిద్ధం కావడం విశేషం. మహిళల టీం ఇండియా కెప్టెన్‌ జీవితచరిత్రను వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ నిర్మించబోతోంది. ఈ మేరకు ఆ సంస్థకు అనుమతులు వచ్చాయని మువీ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ప్రకటించడం విశేషం. మిథాలీ రాజ్ అంగీకరించడంతో ఆమె జీవిత కథ సిల్వర్ స్క్రీన్ మీద చూసే అవకాశం రాబోతోంది.

మరో ప్రముఖ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ జీవితం కూడా సినిమాగా రాబోతోంది. కపిల్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటించనున్నాడు. ఈ సినిమాని ఫాంటమ్‌ ఫిలింస్‌ తెరకెక్కించే అవకాశాలున్నాయి.


Related News

Kanpur: Mohammed Siraj of Sunrisers Hyderabad during an IPL match against Gujarat Lions in Kanpur on Saturday. PTI Photo(PTI5_13_2017_000116B)

హైదరాబాదీకి అరుదైన అవకాశం

Spread the loveహైదరాబాద్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌కు భారత టి-20 జట్టులో చోటు లభించింది. అదేRead More

hockey'

మట్టికరిచిన పాక్

Spread the loveపాకిస్తాన్ జట్టు మట్టికరిచింది. మళ్లీ ఓటమి పాలయ్యింది. ప్రత్యర్థి పాక్ పై టీమిండియా ఆటగాళ్లు సంపూర్ణ ఆధిక్యాన్నిRead More

 • అనిల్ కుంబ్లేని అవమానించారు..
 • పాకిస్తాన్ ని మట్టికరిపించి ముందంజ
 • టీమిండియాలో ఠాకూర్
 • టెస్ట్ ఛాంపియన్ షిప్ కి అనుమతి
 • ఆసీస్ ఆటగాళ్లపై రాయి విసిరిందెవరు
 • టీమిండియా విజయం
 • టీమిండియా ఘన విజయం
 • అనుమానంగా ఆసీస్ కెప్టెన్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *