ఆల్ టైమ్ టాప్3లో కోహ్లీ

kohli rohit
Spread the love

భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఘనతను సాధించారు. కింగ్ కోహ్లీగా అభిమానుల ప్రశంసలు అందుకుంటున్న ఈ స్టైలిష్ బ్యాట్స్ మెన్ కెరీర్ లో మరో అడుగు ముందుకేశాడు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డేలో చెలరేగిన కోహ్లీ అరుదైన ఘనత సాధించిన ఆటగాడికి పేరు నమోదు చేసుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన మూడో క్రికెటర్ గా కోహ్లి గుర్తింపు సాధించారు. శ్రీలంకతో నాల్గో వన్డేలో కోహ్లి తన 29 సెంచరీని నమోదు చేశారు. తద్వారా శ్రీలంక మాజీ దిగ్గజ ఆటగాడు జయసూర్య రికార్డును కోహ్లి సవరించారు. ప్రస్తుతం వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్(49) తొలి స్థానంలో ఉండగా, రికీ పాంటింగ్(30)రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా కోహ్లి మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలోనే జయసూర్య(28)ను వెనక్కునెట్టాడు.

లంకేయులతో వన్డేలో కోహ్లి విజృంభించారు. 76 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో సెంచరీ నమోదు చేసి లంకను ఓ ఆట ఆడేసుకున్నారు. అయిత 96 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 131 పరుగులు చేసిన తరువాత కోహ్లి రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. దాంతో 219 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. శిఖర్ ధావన్ అవుటైన తరువాత రోహిత్ శర్మ కలిసిన కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తొలుత హాఫ్ సెంచరీని 38 బంతుల్లో పూర్తి చేసుకున్న కోహ్లి.. మరో 38 బంతులు ఎదుర్కొని సెంచరీ మార్కును చేరారు. అయితే మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో కోహ్లిని మలింగా అవుట్ చేశాడు. ఆ క్రమంలోనే జయసూర్య రికార్డ్ ను అతడి సొంత గడ్డ మీదే బ్రేక్ చేశాడు. అంతేగాకుండా తక్కువ వన్డేలలో 28 సెంచరీలు పూర్తి చేసిన ఘనతను సాధించాడు.

కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా రెచ్చిపోయాడు. సిరీస్ లో వరుసగా రెండో సెంచరీ నమోదు చేశాడు. కెరీర్ లో 11వ సెంచరీ సాధించాడు.


Related News

ashwin jadeja

చెలరేగిన స్పిన్ ద్వయం

Spread the love1Shareశ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్పిన్ ద్వయం చెలరేగింది. లంక బ్యాట్స్ మెన్ కి చుక్కలుRead More

kohli

కోహ్లీది ఆవేదనా..ఆందోళనా

Spread the love1Shareఅనూహ్య పరిణామం జరిగింది. భారత క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఓ కెప్టెన్ క్రికెట్ బోర్డుపై గళం విప్పారు.Read More

 • కోహ్లీ కొత్త రికార్డ్
 • లంకతో వన్డే సీరిస్ కోసం మార్పులు
 • టీమిండియా ఘోర రికార్డ్
 • అశీష్ నెహ్ర ఎంట్రీ నేడే
 • సైనాకి అనుష్క కానుక..
 • లంకకు ఎదురుదెబ్బ
 • సానియా మీర్జా కి గాయం
 • హార్ధిక్ పాండ్యాకు షాక్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *