Main Menu

కోహ్లీ సృష్టించిన మ‌రో చ‌రిత్ర‌

kohli team india
Spread the love

సుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన క్రికెట్ లో కోహ్లీ ఖ్యాతి రోజురోజుకి పెరుగుతోంది. ఐసీసీ చ‌రిత్ర‌లో కింగ్ కోహ్లీ కొత్త చ‌రిత్ర‌కు శ్రీకారం చుడుతున్నారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్, పరుగుల యంత్రంగా వినుతికెక్కిన విరాట్ కోహ్లీ విజృంభ‌ణ‌తో కొత్త రికార్డులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో కోహ్లీకి రెండవ స్థానం దక్కింది. అయితే ఐసీసీ చ‌రిత్ర‌లో అటు వ‌న్డేల్లో, ఇటు టెస్టుల్లోనూ 900కి పైగా పాయింట్లు సాధించిన క్రికెట‌ర్ గా కోహ్లీకి గుర్తింపు ద‌క్కింది. గ‌తంలో ఈ రికార్డ్ కేవ‌లం వివియ‌న్ రిచ‌ర్డ్స్ కి మాత్ర‌మే సాధ్య‌మ‌య్యింది. రిచ‌ర్డ్స్ త ర్వాత ఆ జాబితాలో కోహ్లీ మాత్ర‌మే ఐసీసీలో అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకుని ఆల్ టైమ్ జాబితాలో నెంబ‌ర్ టూ గా నిలవ‌డం విశేషం.

29 ఏళ్ల విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో ఇటీవల జరిగిన టెస్టు మ్యాచ్‌లో 5-1 తేడాతో అఖండ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి 558 పరుగులు సాధించాడు. గత నెలలోనే కోహ్లీ అగ్రశ్రేణి క్రికెటర్ బ్రియాన్ లారా రికార్డును అధిగమించాడు. దాని ద్వారా వ‌న్డేల‌లో కోహ్లీ ఒకేసారి ఏడో స్థానానికి ఎగబాకాడు.

కోహ్లీతో పాటుగా వ‌న్డే క్రికెట్ బౌల‌ర్ల‌లో జ‌స్ప్రీత్ బుమ్రాకి అగ్ర‌స్థానం ద‌క్కింది ఈ సీజ‌న్ లో 16 వికెట్లు తీసిన బుమ్రా తొలిసారి టాప్ ప్లేస్ కి చేరుకున్నాడు.






Related News

Australia-v-England-Game-2

వ‌ర‌ల్డ్ రికార్డ్: ఆసీస్ ని అల్లాడించిన ఇంగ్లాండ్

Spread the loveమూలిగే న‌క్క‌పై తాటికాయ‌ప‌డ్డ‌ట్టుగా మారుతోంది. అస‌లే అంతంత‌మాత్రంగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ తో ఇంగ్లాండ్ ఆట‌గాళ్లుRead More

rohit-sharma-scored-his-17th-o

రోహిత్ కూడా ప్ర‌శ్నార్థ‌క‌మే

Spread the loveఇంగ్లాండ్ తో సిరీస్ కి బ‌య‌లుదేరే ముందు భార‌త క్రికెట్ జ‌ట్టు కీల‌క ఆట‌గాళ్ల ప‌రిస్థితి ఢోలాయ‌మానంలోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *